Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
డ్రై షాంపూ గురించి విన్నారా..? జుట్టును కళగా..ఒత్తుగా కనబడేలా చేస్తుంది..!
సాధారణంగా తలస్నానం చేయడానికి సమయం లేనప్పుడు చాలా మంది ఎంపిక చేసుకునే మరో మార్గం డ్రై షాంపూ. దీనిని నేరుగా తలమీ స్ప్రే చేసుకుని హెయిర్ సెట్ చేసుకుంటే కేశాలు కళగా, ఒత్తుగా కనబడుతాయి.
డ్రై షాంపూ..తలస్నానం చేయడానికి సమయం లేనప్పుడు మనల్ని అందంగా కనిపించేలా చేసే తారకమంత్రం. అయితే దీన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. డ్రై షాంపూ ఉపయోగించేటప్పుడు జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కేశ సంపదకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయట. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటి? డ్రై షాంపూని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి...ఆ వివరాలన్నీ మనమూ తెలుసుకుందాం..
సాధారణంగా తలస్నానం చేయడానికి సమయం లేనప్పుడు చాలా మంది ఎంపిక చేసుకునే మరో మార్గం డ్రై షాంపూ. దీనిని నేరుగా తలమీ స్ప్రే చేసుకుని హెయిర్ సెట్ చేసుకుంటే కేశాలు కళగా, ఒత్తుగా కనబడుతాయి. అయితే ఈ తరహా షాంపూలను ఉపయోగించేటప్పు కొన్ని పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...

రోజూ వాడకూడదు:
తలస్నానం చేయకుండానే కేశాలను మెరిపించి మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది కదా అని డ్రై షాంపూని రోజూ ఉపయోగించకూడదు. దీని వల్ల కుదుళ్ల వద్ద రసాయనాలు ఎక్కువ మొత్తంలో పేరుకుపోతాయి. అలాగే జుట్టు నిర్జీవంగా మారుతుంది. జుట్టు ఒత్తుగా, కళగా కనిపించేలా చేయడానికే డ్రై షాంపూని వినియోగిస్తారు. కుదళ్ల వద్ద ఉన్న మురికి , రసాయనాలను ఇది తొలగించదు. కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే డ్రై షాంపూని వినియోగించాలి.

తొందరపడొద్దు:
ఈ రోజుల్లో ఏ పని చేసినా సమయభావం ఉండకూడదనే ఉద్దేశంతో తొందరగానే పూర్తి చేసేస్తున్నాం. అయితే డ్రై షాంపూ ఉపయోగించినప్పుడు మాత్రం అస్సలు తొందరపడకూడదు అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్ . ఒకసారి షాంపూ స్ప్రే చేసిన తర్వాత కాసేపు దానిని అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఒక హెయిర్ డ్రైయ్యర్ తీసుకుని, చక్కగా స్టైల్ చేసుకోవాలి. లేదా మునివేళ్లతో సాప్ట్ గా మర్ధన చేసుకోవాలి. అప్పుడే కుదుళ్ల వద్ద ఉన్న జిడ్డుదనం తగ్గి కేశాలు కళగా , ఒత్తుగా కనబడుతాయి.

అవసరానికి మించి :
జుట్టు ఒత్తుగా కనిపించేలా చేస్తుంది కదా అని అవసరానికి మించి డ్రై షాంపూని వినియోగించకూడదు. దీని వల్ల కుదుళ్ల వద్ద రసాయనాలు అధికమొత్తంలో పేరుకుపోతాయి. ఫలితంగా కురులకు సరైన పోషణ అందక నిర్జీవంగా మారి అట్టకట్టినట్లుగా కనిపిస్తాయి.

అవసరానికి మించి :
జుట్టు ఒత్తుగా కనిపించేలా చేస్తుంది కదా అని అవసరానికి మించి డ్రై షాంపూని వినియోగించకూడదు. దీని వల్ల కుదుళ్ల వద్ద రసాయనాలు అధికమొత్తంలో పేరుకుపోతాయి. ఫలితంగా కురులకు సరైన పోషణ అందక నిర్జీవంగా మారి అట్టకట్టినట్లుగా కనిపిస్తాయి.

పగలే కాదు:
డ్రై షాంపూ అప్లై చేసుకోవడానికి పగలే సరైన సమయం అని చాలా మంది భావిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. అవసరమనిపిస్తే రాత్రి నిద్రపోయే ముందు కూడా షాంపూ స్ప్రే చేసుకుని కాసేపు ఉండనిచ్చి మ్రుదువుగా మర్ధన చేసుకుని అలాగే నిద్రపోవచ్చు. ఫలితంగా కుదుళ్ల వద్ద ఉన్న ఆయిల్ నెస్ బాగా తగ్గుతుంది. ఇంకా జుట్టు కూడా కళకళలాడుతూ అందంగా కనిపిస్తుంది.

దగ్గరగా వద్దు:
కుదుళ్లకు దగ్గరగా డ్రై షాంపూని అస్సలు స్ప్రే చేసుకోకూడదు. కనీసం 10 నుండి 12 అంగుళాల దూరం నుండే దీనిని ఉపయోగించాలి. కుదుళ్లకు దగ్గరగా స్ప్రే చేస్తే కురులు అట్టకట్టినట్లుగా కనిపించడమే కాకుండా అందవిహీనంగా ఎండిపోయినట్లు కూడా కనబడుతాయి.

మర్ధన, స్టైలింగ్ తప్పనిసరి:
డ్రై షాంపూ స్ప్రే చేసుకున్న తర్వాత కొంత మంది హెయిర్ స్టైలింగ్ లేదా మర్ధన చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల షాంపూ సమానంగా పరుచుకోక ఆశించిన ఫలితాలు కనిపించకపోవచ్చు. కాబట్టి, షాంపూ ఉపయోగించిన తర్వాత కాసేపు ఆగి, తర్వాత మర్ధన లేదా స్టైలింగ్ ఉత్పత్తులతో కేశాలను స్టైల్ గా చేసుకోవాలి. అప్పుడే మంచి లుక్ వస్తుంది.

చివర్లు కూడా :
జుట్టు కుదుళ్లకు మాత్రమే కాదు, జుట్టు చివర్లకు కూడా డ్రై షాంపూ స్ప్రే చేసి కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత హెయిర్ డ్రయ్యర్ తో స్టైల్ చేసుకోవాలి. ఒక వేళ చివర్లు మరీ పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తుంటే రెండు చుక్కల సీరమ్ రాసుకోవాలి. ఆ తర్వాత షాంపూ వినియోగిస్తే చూడచక్కగా ఉంటాయి.

డ్రై హెయిర్ కు మాత్రమే ఉపయోగించాలి:
ఇది కొద్దిగా ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే డ్రై హెయిర్ మీద అయితేనే ఇది పనిచేస్తుంది. తడి జుట్టు లేదా ఫ్రెష్ గా తలస్నానం చేసిన జుట్టు మీద స్ప్రే చేయడం లేదా స్ప్రింకిల్ చేయకూడదు.

జుట్టుకు దూరంగా:
ఏరోసాల్ డ్రై షాంపూను జుట్టుకు ఉపయోగించేటప్పుడు, జుట్టుకు కాస్త దూరంగా ఉంచి స్ప్రే చేయాలి. లేదంటే జుట్టు మీద ఎక్కువగా పడటం వల్ల దాన్ని జుట్టు నుండి విడదీయడం కష్టం అవుతుంది.

డ్రై షాంపూ వాడేటప్పుడు చేయకూడని పొరపాట్లేంటో
డ్రై షాంపూ వాడేటప్పుడు చేయకూడని పొరపాట్లేంటో మీరు తెలుసుకున్నారు కదా...ఈ విషయాలను గుర్తుంచుకుని, అనుసరించండి...అందమైన, ఒత్తైన కేశసంపదతో అందంగా, స్టైలిష్ గా మెరిపోతారు.



Click it and Unblock the Notifications
