For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్ ప్రైజ్ : అల్లంతో జుట్టు సమస్యలకు చెక్..!!

అల్లంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు జుట్టు కోసం అల్లం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

By Lekhaka
|

మీరు జుట్టు కోసం అల్లం ఉపయోగించవచ్చని విని ఉండరు. అల్లం వాడితే జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి మహిళ పొడవైన మరియు బలమైన జుట్టును కోరుకుంటున్నారు.

మీరు బ్యూటీ సమస్యలకు మంచి పరిష్కారాలను కనుగొనటానికి సాధారణ ఇంటి నివారణలు కోసం చూస్తున్నారా? జుట్టు పెరుగుదలకు అల్లం ఉపయోగించటం అనేది చాలా సమర్థవంతమైన పద్ధతి. ఈ పద్దతికి పెద్దగా ఖర్చు కూడా కాదు.

కాబట్టి జుట్టు కోసం అల్లంను ఉపయోగించి అద్భుతమైన ప్రభావాన్ని చూడండి.

1. హెయిర్ ఫాల్

1. హెయిర్ ఫాల్

మీ జుట్టు మీద నేరుగా అల్లం ముక్కతో రుద్దాలి. ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అల్లం రసంను తల మీద చర్మానికి రాసి 15 నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

2. చుండ్రు

2. చుండ్రు

అల్లంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండుట వలన తల మీద చర్మంపై సిబం ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంతేకాక చుండ్రు వంటి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది.

3. తల మీద కోతలు

3. తల మీద కోతలు

తల మీద చుండ్రు ఉన్నప్పుడు విపరీతంగా గోకడం జరుగుతుంది. అలాంటి సమయంలో తల మీద చర్మంపై ఉండే మొటిమలు పగలవచ్చు. ఆ సమయంలో కోతలు వచ్చే అవకాశం ఉంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం కోతలను తగ్గించటంలో సహాయపడుతుంది.

4. మెరిసే జుట్టు

4. మెరిసే జుట్టు

ఆలివ్ నూనె తో అల్లం రసంను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట లేదా రాత్రంతా ఆలా వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.

5. పొడి జుట్టు

5. పొడి జుట్టు

పొడి జుట్టు కోసం ఆర్గాన్ నూనెలో అల్లం రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట అయ్యాక షాంపూ మరియు కండీషనర్ తో శుభ్రం చేసుకోవాలి. ఆర్గాన్ నూనె పొడిగా మారిన జుట్టు మరియు దెబ్బతిన్న జుట్టుకు పోషణను అందిస్తుంది.

English summary

How To Use Ginger For Your Hair

Ginger has many health benefits. Here is how you can use it for your hair.
Desktop Bottom Promotion