Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
జుట్టు ఆరోగ్యానికి ఉల్లిపాయ.. ఉసిరి..నిమ్మ
జుట్టు ఊడిపోతుందని, పలుచబడిపోతుందని, మెరుపు కోల్పోతుందని బాధపడని వాళ్లని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. కాలుష్యం, ఒత్తిడి, పోషకాహారలేమి... ఇటువంటి పలు కారణాల ప్రభావం మాత్రం జుట్టు మీదే భారీగానే చూపెడుతోంది. వీటి నుండి తప్పించుకుని జుట్టును సంరక్షించుకునేందుకు వంటింటిని దాటి పోనక్కర్లేదు అంటున్నారు సౌందర్య నిపుణులు.
వంటింట్లో లభించే పదార్థాలతోనే మృదువైన, ఆరోగ్యకరమైన, పట్టులాంటి జుట్టును సొంతం చేసుకునేందుకు జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేందుకు అందుబాటులో ఉండే వస్తువుల్ని ఇలా వాడి చూడండి.. అవేంటంటే...

ఉల్లిరసం:
ఉల్లిలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. త్వచాల్లో ఉండే కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సల్ఫర్‌ది ప్రధాన పాత్ర. అదే జుట్టు పెరగడంలోనూ కీలకం అన్నమాట. ఇందుకు ఏం చేయాలంటే... ఎరుపు రంగు ఉల్లిపాయలు లేదా సాంబారు ఉల్లిపాయల్ని చిన్నచిన్న ముక్కలుగా తరిగి రసం తీయాలి. ఆ రసాన్ని మాడు మీద రాసుకుని పావు గంట తరువాత మైల్డ్‌షాంపూతో కడిగేయాలి.

ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసంతో జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం ద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది కెరటిన్, మాంసకృత్తుల్ని అందించి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

ఉసిరికాయ:
ఆమ్లాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జుట్టు రంగు మారకుండా కూడా చేస్తుంది. జుట్టు పెరగడానికి సహాపడుతుంది.

ఉసిరి రసం :
రెండు చెంచాల ఉసిరి రసం లేదా ఉసిరి పొడిని నిమ్మరసంతో కలిపి తలకు పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే, చిన్న వయస్సులోనే జుట్టు నెరవడానికి చెక్ పెట్టొచ్చు. ఇక జుట్టు రాలే సమస్యకు ఉసిరికాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది.

నిమ్మరసం:
నిమ్మరసం లో విటిమన్ సి, బికాంప్లెక్స్ విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండి హెయిర్ ఫాలీసెల్స్ కు పోషణను అందిస్తుంది. తలలో ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.ఇంకా జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాదు, ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తుంది నిమ్మ.

కొబ్బరినూనెలో నిమ్మరసం
కొద్దిగా కొబ్బరినూనెలో నిమ్మరసం వేసుకుని తలకు పట్టించుకోవాలి. గంటయ్యాక కడిగేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.



Click it and Unblock the Notifications
