ఒక్క రోజులో చుండ్రుకు గుడ్ బై చెప్పే ఆనియన్ ట్రీట్మెంట్..!

Posted By:
Subscribe to Boldsky

చుండ్రు అనేది ఒక సాధారణ వెంట్రుకల రుగ్మత. చుండ్రు ... చిరకాల సమస్య. ఎంతో మంది నిత్యం దీనితో చికాకు పడటమే కాదు.. పైకి చెప్పుకోలేని న్యూనత కూడా అనుభవిస్తుంటారు. చుండ్రు చాలా మందిలో ఉంటుంది.

సాధారణంగా మన శరీరంలో చర్మకణాలు పాతవి పోతూ... కింది నుంచి కొత్తవి స్తుంటాయి. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉండే ప్రక్రియ. తల మీద కూడా చర్మం కణాలు కొత్తవి వస్తూ, పాతవి పోతూనే ఉంటాయి. ఈ ప్రక్రియ 3-4 వారాలు పడుతుంది. మనం స్నానం చేసినపుడు పాతవి రాలిపోతుంటాయి. కాబట్టి వీటి గురించి మనం అంతగా పట్టించుకో కూడా. కానీ కొన్నిసార్లు రకరకాల సమస్యల వల్ల తల మీద కణాలు త్వరత్వరగా పాతవైపోతూ... కొత్తవి వచ్చేస్తుంటాయి. దీంతో అక్కడ మృతకణాలు పేరుకుపోయి, అవి పొట్టు పొట్టుగా వూడి వస్తుంటాయి. ఇదే 'చుండ్రు' .

తల మీద వెంట్రుకలు, చమురు గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పొట్టుకు చమురు కూడా తోడై తలంతా మరింత చికాకుగా తయారవుతుంది. అందుకే చుండ్రులో ప్రధానంగా రెండు రకాలుంటాయి. అవి 1.పొడి రకం. వీరికి పొడి పొడిగా పొట్టు రాలుతుంది. 2. చమురు రకం.... పొట్టుకు చమురుకూడా తోడై తల త్వరగా జిడ్డుగా తయారవుతుంది.

చండ్రు అనేది మన శారీరక సహ ప్రక్రియల్లో భాగంగా వచ్చే సమస్య కాబట్టి అందరికీ దీన్ని పూర్తిగా పోగొట్టటం సాధ్యపడకపోవచ్చు. కాకపోతే ఒకప్పటి కంటే ఇపుడు చండ్రు తగ్గించుకునేందుకు మార్కెట్ లో మంచి మెడికేటెడ్ షాంపూలు, ట్రీట్మెంట్లు అందుబాటులోకి వచ్చాయి. రోజు విడిచి రోజు యాంటీ డాండ్రఫ్ షాంపూలతో తలస్నానం చేస్తూ ఉండాలి.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, గాఢమైన షాంపూలు, క్రీములకు దూరంగా ఉండాలి. తలకు అపుడపుడు సూర్య రశ్మి తగలటం మంచింది. తాజా పండ్లు, మంచి పోషకాహారం తీసుకోవాలి. పొడి రకం చుండ్రు ఉన్న వాళ్లు చలికాంలో, మిగతా సీజన్లలో కూడా తలకు నూనె రాసుకోవచ్చు. చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు వీటితో పాటు ఈ ఆనియన్ ట్రీట్మెంట్ ఫాలో అయితే మంచి చుండ్రుకు ఒక్క రోజులో గుడ్ బై చెప్పవచ్చు..

ఉల్లిపాయ రసం :

ఉల్లిపాయ రసం :

ఉల్లిపాయలో వుండే పోషకాలు చుండ్రు సమస్యను తగ్గించి.. జుట్టును సంరక్షిస్తుంది. అయితే నేరుగా ఆనియన్ కాకుండా అందులో కొన్ని ఇతర పదర్థాలతో కలిపి రెమెడీస్ తయారుచేసుకొని పట్టించుకోవాలి. మరెలా తయారుచేస్తారో తెలుసుకుందాం...

ఉల్లిపాయ రసం : ఇందులో ఆర్ధోడాక్స్ అనే పదార్ధం వుంటుంది. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. అలాగే తలలో వున్న బ్యాక్టీరియాను నివారించి.. తెల్లగా రాలే పొట్టు సమస్య నుంచి దూరంగా వుంచుతుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయను కట్ చేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. తలకు పట్టించి 30నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

మెంతులు :

మెంతులు :

మెంతులను నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

అలోవెర :

అలోవెర :

కలబంద రసానికి కొద్ది ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వల్ల తలను చాలా కూల్ గా చేస్తుంది. దురదను నివారిస్తుంది.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

దుంపలను నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి వేళ్ళతో బాగా మసాజ్ చేయాలి.

నిమ్మరసం :

నిమ్మరసం :

ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించుకోవాలి. ఇలా చేస్తే తలలో దుర్వాసన నివారించబడుతుంది. తలలో దురద దూరమవుతుంది.

తేనె :

తేనె :

ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించుకోవాలి. అనంతరం 10నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె :

ఒక చెంచా నిమ్మరసం, 5చెంచాల కొబ్బరినూనె, 3చెంచాల ఉల్లిపాయరసం తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

గుడ్డు :

గుడ్డు :

1 లేదా 2 గుడ్లను తీసుకొని, అందులో కొద్దిగా నిమ్మ, ఉల్లిపాయ రసాలు మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

ఆపిల్ జ్యూస్ :

ఆపిల్ జ్యూస్ :

రెండు చెంచాల ఆపిల్ జ్యుస్ లో 2చెంచాల ఉల్లిపాయ రసం మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

వెనిగర్ :

వెనిగర్ :

ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. అది చుండ్రును నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తర్వాత తలకు మసాజ్ చేయాలి.

మందారాకులు

మందారాకులు

మందారాకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తీరుతంది. కుదుళు బలంగా అవుతాయి.

పుదీనా ఆకు

పుదీనా ఆకు

పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి.. కాసిన్ని నీళ్లు కలిపి మాడుకు పట్టించాలి. గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.

English summary

How to use onion and its juice for dandruff in Telugu | How Can Onion Juice Help Reduce Dandruff,

Here we are going to discuss about onion juice as one of the effective home treatments to curb the problem of dandruff. Yes, onion for dandruff is the most wonderful natural remedy you can rely upon.
Story first published: Saturday, August 26, 2017, 16:50 [IST]