Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
మంగళవారం తలస్నానం చేయడం మంచిది కాదా?
హిందూమతం ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలతో నిండినది. ముఖ్యంగా హిందూమతంలో ఆచారాలను అత్యంత ప్రవిత్రంగా పాటిస్తారు. ప్రతిరోజు వయస్సును బట్టి చేసే కొన్ని ఆచారాలతోపాటు అభ్యాసాలు ఉన్నాయి. ఇవి తరతరాలు నుంచి వస్తున్నాయి. ఉదాహరణకు గురువారం, శనివారాల్లో మగవాళ్లు షేవింగ్, కటింగ్ చేసుకోకూడదంటారు పెద్దవాళ్లు. ఇలా చేస్తే ఏదో కీడు జరుగుతుందని వారి నమ్మకం.

శనివారం రోజు జుట్టు కత్తిరించినట్లయితే..శని దేవుని సతి ప్రభావం తగ్గుతుందని కొందరి నమ్మకం. గురువారం తలస్నానం చేయోద్దని...బట్టలు ఉతకొద్దని మహిళలు అంటుంటారు. మతపరంగా ఎక్కువమంది మహిళలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.
అయితే హిందూమతంలో తలస్నానం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఆ అపోహలకు సమధానాలు తెలుసుకోవాలంటే ఈ స్లయిడ్ షో పై క్లిక్ చేయండి...

మంగళవారం...
ఈ రోజుల్లో కూడా మన ఇండ్లల్లో ఎన్నో ఆచారాలను పాటిస్తున్నారు. మంగళవారం రోజు తలస్నానం చేయొద్దని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇది అనాదికాలంగా వస్తున్న ఓ నమ్మకం. మంగళవారం నాడు తలస్నానం చేస్తే మార్స్ ద్వారా ప్రభావితమైనవారికి మరింత వర్తిస్తుందట. అందుకే మంగళవారం తలస్నాం చేయడానికి ఎక్కువ మంది నిరాకరిస్తుంటారు.

బుధవారం...
బుధవారం నాడు తలస్నానం చేయొద్దని ఒక బాలుడి తల్లి చెబుతోంది. బుధవారం రోజు తలస్నానం చేస్తే...ఆమె పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటోంది. అంతేకాదు...కొత్త వివాహం అయిన స్త్రీ బుధవారం రోజు తలస్నానం చేస్తే పండంటి బిడ్డ కలుగుతాడని నమ్ముతారు. ఇది ఎంత వరకు నిజమే తెలియదు.

గురువారం....
గురువారం నాడు తలస్నానం చేసినట్లయితే ఆర్థిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి. ఇంట్లో నుంచి లక్ష్మీ బయటకు వెళ్తుందనే ఒక అపోహ కూడా ఉంది. అంతేకాదు గురువారం రోజు ఒక మహిళ తలస్నానం చేస్తే ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో తెలిపే కథలు కూడా ఉన్నాయి. గురువారం నాడు తలస్నానం చేసిన మహిళ క్రమంగా తన ఆస్తులను కోల్పోయిందట. అంతేకాదు గురువారం నాడు బట్టలు ఉతకడం కూడా అరిష్టమని భావిస్తారు.

శనివారం...
శనివారం తలస్నానం చేస్తే మిశ్రమ ఫలితాలున్నాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. శనివారం నాడు తలస్నానం చేస్తే మంచిదట. సాడేసతి యొక్క ప్రభావాన్ని తగ్గించడంతోపాటు..మహాభోగములు కలిసి వస్తాయి. అయితే శనివారం రోజు మహిళలు కూడా తలస్నానం చేయడం బెట్టర్.



Click it and Unblock the Notifications
