ఉద్యోగం చేసే మహిళలు ఖచ్చితంగా వాడాల్సిన హెయిర్ ప్రొడక్ట్స్!

By: Mallikarjuna
Subscribe to Boldsky

భారతీయ మహిళలకు పొడవాటి జుట్టు,కురచ జుట్టు, రింగు రింగుల జుట్టు, నిగారించి నిటారు జుట్టు, చీకాకు కలిగించి చిక్కుబడి జుట్టు ఇలా వివిధ రకాల జుట్టు రకాలను కలిగి ఉంటారు. గతంలో, పురాత కాలం నుండి అమ్మాయిలకు జుట్టు పెంచుకోవడాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవారు, అమ్మలు, అమ్మమ్మలు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని, సలహాలనిచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది

ఈ రోజుల్లో చక్కగా వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ ట్రెండ్ పట్టణాలలో కొనసాగుతోంది. ఆఫీసులు, పనికి తగినట్లు హెయిర్ స్టైల్స్ ను మార్చుకుంటున్నారు. ఇంకా వాతావరణంలో మార్పుల వల్ల జుట్టు సమస్యల గురించి ఎక్కువ ఫిర్యాదులొస్తాయింటి. అందమైన జుట్టు పొందడానికి హెయిర్ సలూన్స్ లో గంటలు గంటలు గడుపుతూ హెయిర్ ట్రీట్మ్ంట్ తీసుకోవడం, లేదా ఏవో కొద్దిగా ఇంటిచిట్కాలను అనుసరిస్తూ, జుట్టులో గొప్ప మార్పులు రావాలని కోరుకుంటారు .

hair care

కొన్ని ప్రాంతాల్లో కేవలం జుట్టుకు నూనె, షాంపు మాత్రమే వాడుతుంటారు. మేకప్ స్టోర్స్ లో లేదా ఆన్ లైన్ బ్యూటీ వెబ్ సైట్స్ లో వివిధ రకాల జుట్టుకు సంబంధించి ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నారు. అయితే వీటిని తిరిగి రెండోసారి ఎప్పటికి కొనరు, ఉపయోగించరు. గతంలో కేవలం జుట్టుకు నూనె, సహజసిద్దమైన షాంపులో అందమైన జుట్టును పొందేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం మార్కెట్లోనికి వివిధ రకాల హెయిర్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చు. అందమైన జుట్టును బహుమతిగా పొందడానికి ఇటువంటి ఇన్ స్టాంట్ గా లభించే వాటి మీద ఆధారపడుతున్నారు.

జుట్టు ఆరోగ్యానికి కొబ్బరినూనె ? ఆల్మండ్ ఆయిల్ ? ఏది మంచిది ?

ముఖ్యంగా పనిచేసే ఉద్యోగినులకు జుట్టు సంరక్షణ బాధ్యతలు చాలా అవసరం. వాతావరం, కాలుష్యం నుండి మహిళల జుట్టు కాపాడుకోవడానికి వివిధ రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వారికి నచ్చిన బ్రాండ్స్ ఎన్నో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మరి భారతీయ అమ్మాయిలు ఎలాంటి జుట్టు సంరక్షణ, నిర్వహన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవాలో చూద్దాం..

హెయిర్ కండీషనర్

హెయిర్ కండీషనర్

జుట్టు సంరక్షణలో కేవలం హెయిర్ ఆయిల్, షాంపు మాత్రమే కాదు, హెయిర్ కండీషనర్ కూడా జోడించాలి. షాంపుతో తలస్నానం చేయునప్పుడు హెయిర్ కండీషనర్ ఉపయోగించడంలో హెయిర్ స్టైల్ ను చాలా అందంగా, సింపుల్ గా మెయింటైన్ చేయవచ్చు. మీరు ఎంపిక చేసుకునే షాంపు బ్రాండ్ కు సంబంధించిన హెయిర్ కండీషనర్ కూడా ఎంపిక చేసుకోవాలి. అందుకు నిపుణులు సలహా తీసుకోవడం మంచిది.

హెయిర్ వాక్స్

హెయిర్ వాక్స్

చాలా మంది మహిళలు జుట్టు చాలా పల్చబడుతోందని, చిందరవందరగా తయారవుతోందని ఫిర్యాదులు చేస్తుంటారు. అలాంటి వారు ప్రారంభం నుండి హెయిర్ వాక్స్ ను అప్లై చేస్తే తప్పకుండా మార్పులు గమనిస్తారు. హెయిర్ వాక్స్ హెయిర్ ను కంట్రోల్ చేస్తుంది. జుట్టుకు కాంతిని అందిస్తుంది. కొద్దిగా హెయిర్ వాక్స్ మంచి ఫలితాన్నిఅ అందిస్తుంది.

అబ్బాయిల్లో హెయిర్ ఫాల్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్

డ్రైహెయిర్ షాంపు

డ్రైహెయిర్ షాంపు

జుట్టు జిడ్డుగా కనిపించిందంటే జుట్టు, ముఖం నిర్జీవంగా కనబడుతాయి. ఇలాంటి సమయంలో ఎన్నిసార్లని తలస్నానం చేస్తారు. ఇలాంటి వారు డ్రై షాంపును నేరుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు అందంగా కనబడుతుంది.

హెయిర్ వాల్యూమైజర్

హెయిర్ వాల్యూమైజర్

భారతీయ మహిళలకు జుట్టు రాలే సమస్యలు ఎక్కువ. జుట్టు రాలడానికి నీళ్లు లేదా కాలుష్యం అని సాకులు చెబుతుంటారు, ఈ కారణాల వల్లే జుట్టు ఎక్కువ రాలుతోందని చెబుతుంటారు. జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవాలంటే సమయం పడుతుంది. అయితే వెంటనే మంచి ఫలితం పొందాలంటే, హెయిర్ వాల్యుమైజర్ ను పెంచుతుంది. స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకుని, తలస్నానం తర్వాత స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా , అందంగా కనబడుతుంది. చిక్కు లేకుండా నివారిస్తుంది.

హెయిర్ సెరమ్

హెయిర్ సెరమ్

అమినో యాసిడ్స్, సిలికాన్, మరియు సిరామిడ్, హెయిర్ సెరమ్ వంటి భారతీయ మహిళ జుట్టకు బాగా పనిచేస్తాయి. దీన్ని నేరుగా తడి జుట్టుకు అప్లై చేయాలి. హెయిర్ సెరమ్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ రూట్స్ నుండి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ సెరమ్ ను ఉపయోగిస్తే కండీషనర్ వాడకూడదు.

హెయిర్ మాస్క్ మరియు క్రీములు

హెయిర్ మాస్క్ మరియు క్రీములు

జుట్టు కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, హెయిర్ రూట్స్ కోసం ఎంత ఖర్చు చేస్తారు.జుట్టుకు షాంపు , క్రీమలు ఉపయోగించేటప్పుడు జుట్టు మొదళ్ళకు పూర్తిగా చేరకపోవచ్చు. కాబట్టి, వాటి స్థానంలో హెయిర్ మాస్కులు లేదా హెయిర్ క్రీములను నేరుగా జుట్టుకు మొదళ్ల నుండి ఉపయోగించాలి.ఇది జుట్టు ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. హెర్బల్ హెయిర్ మాస్క్ లు హెయిర్ క్రీములు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వర్షాకాలంలో కంపల్సరీ పాటించాల్సిన హెయిర్ కేర్ టిప్స్..!

హెయిర్ స్ప్రే

హెయిర్ స్ప్రే

ఇంటి నుండి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు, ఎక్కువ సమయం బయట గడపాల్సి వచ్చినప్పుడు జుట్టు స్టైల్ గా వేసుకోవాలనుకుంటారు. అందంగా వేసుకుంటారు. అయితే బయట వెళ్ళిన తర్వాత జుట్టు అంతా చిందరవందరగా, మ్యానేజ్ చేయడానికి వీలు కాకుండా చేస్తుంది. కాబట్టి, హెయిర్ బన్, ప్లెయింట్, పోనీటైల్, వేసుకోవడానికి ముందు హెయిర్ స్ప్రేను అప్లై చేయాలి. పనిచేసే ఉద్యోగిణులకు హెయిర్ స్ప్రే ఒక ఉత్తమమైన ప్రొడక్ట్.

హెయిర్ పౌడర్

హెయిర్ పౌడర్

పౌడర్ చర్మం, శరీరానికి మాత్రమేనా, జుట్టుకు అవసరం లేదా? హెయిర్ పౌడర్ వల్ల జుట్టుకు మంచి ఆరోమా వాసన వస్తుంది. అయితే తలకు అప్లై చేయడానికి టాల్కం పౌడర్ కాకుండా ఒక మన్నికైన పౌడర్ ను కొనాలి. జుట్టుకు పౌడర్ ను తక్కువగా ఉపయోగించాలి. ఏదైనా కార్యాలకు మాత్రమే ఉపయోగించాలి.

హెయిర్ బట్టర్

హెయిర్ బట్టర్

జుట్టుకు నూనె పెట్టడం, తలస్నానం చేయడం ఒకటే సరిపోదు. జుట్టుకు తగినంత తేమను అందివ్వడానికి బట్టర్ ను, మంచి సువాసన కలిగిన బట్టర్ ను అప్లై చేయాలి. హెయిర్ బట్టర్ ను అప్లై చేసిన తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. వెన్నను జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది

హెయిర్ జెల్

హెయిర్ జెల్

హెయిర్ జెల్ కేవలం మగవారికి మాత్రమే అనుకుంటారు. కానీ, దీన్ని మహిళలు కూడా అప్లై చేసుకోవాలి. హెయిర్ స్ట్రెయిట్ గా మారుతుంది. అయితే హెయిర్ జెల్ కొన్న తర్వాత ఒకసారి ప్యాచ్ టెస్ట్ గో ట్రైయల్ చేసిన తర్వాత, పూర్తిగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల రెండవ సారి ఎంత అవసరం అవుతుందన్న విషయం తెలుస్తుంది

English summary

Must-have Hair Products For Every Working Woman In India

Women can now increase their list of hair care products beyond oil or shampoo for best results.
Subscribe Newsletter