స్ట్రెయిట్ హెయిర్ ఎల్లప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. ఇంకా, ఈ ట్రెండ్ ఎప్పటికీ పాతది కాదని భరోసాగా చెప్పవచ్చు. మీకు తెలుసా ఇప్పటికే లెక్కలేనంతమంది తమ జుట్టుని స్ట్రయిట్ గా చేసేందుకు ఖరీదైన విధానాలను పాటిస్తున్నారు.
కొంతమంది తమ జుట్టుని మృదువుగా సాఫ్ట్ గా కనిపించడానికి ప్రతిరోజు స్ట్రైట్ర్నెర్స్ ని ఉపయోగించే మహిళలు కూడా వున్నారు. మరొక వైపు, శాశ్వతంగా జుట్టు స్ట్రెయిట్ గా వుండాలనికోరుకునే వాళ్ళు వున్నారు. ఈ ప్రక్రియ బ్యూటీ సలోన్ లో వివిధ రకాల స్ట్రిగ్టెనింగ్ ప్రొడక్ట్స్ మరియు వేడి స్టైలింగ్ పరికరాల సహాయంతో చేస్తారు.
సాధారణంగా పెర్మనెంట్ స్ట్రిగ్టెనింగ్ 2-3 సెషన్లలో జరుగుతుంది. ఇందులో ఉపయోగించే ఖరీదైన ఉత్పత్తులు మరియు పరికరాల కారణంగా, మీ జుట్టును స్ట్రెయిట్ గా చేసే ఈ చికిత్స లో తప్పనిసరిగా మీ పర్సులు కాళీ అవవచ్చు.
అయినప్పటికీ వేలాదిమంది మహిళలు ఈ చికిత్స కోసం వెళతారు, ఎందుకంటే ఇది ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. కానీ పెర్మనెంట్ స్ట్రిగ్టెనింగ్ విషయానికి వచ్చినప్పుడు, ఇది ఎక్కువగా కంటికి సంబంధిన విషయంగా చెప్పవచ్చు.
మిగిలిన ఇతర చికిత్సల మాదిరిగానే, ఇది కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగివుంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ వారి జుట్టుని స్ట్రిగ్టెనింగ్ చేసుకోవాలనుకునే ముందు దానివలన కలిగే కొన్ని దుష్ప్రభావాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
ఒకవేళ అవి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! ఇక్కడ మేము మీకోసం కవర్ చేశాము. ఇవాళ్టి బోల్డ్ స్కై లో జుట్టుని స్ట్రిగ్టెనింగ్ చేసుకోవడంవలన వలన కలిగే కొన్ని సాధారణ దుష్ప్రభావాల గురించి తెలియజేశాము.
మీ జుట్టు అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి స్టైలింగ్ అవసరం కావచ్చు. కానీ దీనివలనమీ జుట్టు ఆరోగ్యానికి మరియు ఎలాంటి నష్టం లేకుండా సమానంగా చూసుకోవడం కూడా ముఖ్యం.
స్ట్రైట్యినింగ్ వలన కలిగే దుష్ప్రభావాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.
1. హెయిర్ ఫాల్(జుట్టు రాలడం)
పెర్మనెంట్ హెయిర్ స్ట్రిగ్నింగ్ వలన కలిగే అత్యంత సాధారణమైన సైడ్ ఎఫెక్ట్ విపరీతంగా జుట్టురాలిపోవడమని చెప్పవచ్చు. ఇది బలహీనమైన జుట్టు కుదుళ్ళ వల్ల జరుగుతుంది. మరియు కఠినమైన రసాయనాలు అలాగే జుట్టు నిఠారుగా సెషన్ సమయంలో ఉపయోగించే హీటింగ్ పద్ధతుల ద్వారా మీ జుట్టు కుదుళ్ళు బలహీనపడటం వలన మరియు తీవ్రమైన జుట్టు పతనానికి
కారణం అవుతుంది.
2. అధికంగా జుట్టు పొడిబారడం
జుట్టు స్ట్రిగ్నింగ్ ప్రక్రియ వలన మీ జుట్టును పొడిగా మరియు జీవంలేనిదానిగా కనిపించవచ్చు. ఇది జుట్టును నిఠారుగా ఉంచటానికి హానికరమైన రసాయనాలను దీర్ఘకాలిక వేడి ని ఉపయోగించడం వలన కలిగే ఫలితం.
3. అలెర్జీ
జుట్టు స్ట్రిగ్నింగ్ లో అలెర్జీ రావడం అనేది మరొక ముఖ్యమైన దుష్ప్రభావం. మీ జుట్టు ఆకృతిని మార్చడానికి ఉపయోగించే ఉత్పత్తులు సాధారణంగా కఠినమైన రసాయనాలతో నిండి ఉంటాయి. మరియు ఈ రసాయనాలు అసహ్యకరమైన అలెర్జీలు కారణం కావచ్చు. అందువల్ల, జుట్టు స్ట్రిగ్నింగ్ ప్రయోజనం కోసం అధిక-నాణ్యత ఉత్పత్తులను ఎంచుకోవడం ముఖ్యం.
4. వెట్రుకలు వేడికి బర్న్ అవవచ్చు
సుదీర్ఘమైన వేడి మీ జుట్టు వెంట్రుకలని తగలబెట్టగలదు మరియు వాటిని చాలా కఠినమైనవిగా మార్చవచ్చు. ఇది జుట్టు స్ట్రిగ్నింగ్ చేయడం వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లో చాలా మంది మహిళలు
ఫిర్యాదు చేసే విషయం.
5. పెళుసైన జుట్టు
జుట్టు స్ట్రిగ్నింగ్ ప్రక్రియలో ఉపయోగించే రెండు- రసాయనాలు మరియు వేడి వలన మీ జుట్టు చాలా పెళుసుగా మారవచ్చు. మరియు పెళుసైన జుట్టు చూడటానికి చాలా వికారంగా మరియు అనారోగ్యకరమైన దిగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా నిరోధించడానికి, మీరు మీ వెంట్రుక సంరక్షణ పద్దతిలో సీరం ని వాడవచ్చు. ఇది మీ టెస్సెస్ మరియు జుట్టును హైడ్రేషన్కు పెంచుతుంది.
6. డల్నెస్ (బలహీనంగా మారడం)
డల్నెస్ పొందడమనేది జుట్టు స్ట్రిగ్నింగ్ వలన కలిగే మరొక సైడ్ ఎఫెక్ట్. ఈ ప్రక్రియలో మీ స్కాల్ప్ మరియు జుట్టులో వుండే నూనెని పీల్చేసుకుంటుంది, తద్వారా మీ జుట్టు నిస్తేజంగా మరియు జీవం లేనిదిగా కనిపిస్తుంది. అయినప్పటికీ, రెగ్యులర్ ఆయిల్ ట్రీట్మెంట్ మీ జుట్టుకి సహజమైన
షైన్ మరియు అందం తిరిగి పొందడంలో సహాయపడుతుంది.
7. తిరిగి పెరుగుదల లేకపోవడం
అనేక జుట్టు సంరక్షణ నిపుణులు జుట్టు స్ట్రిగ్నింగ్ మీ జుట్టు పెరుగుదల మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయని నమ్ముతారు. ఈ ప్రక్రియలో ఉపయోగించిన రసాయనాలు మరియు జుట్టు ద్వారా జుట్టుకు సంబంధించిన ఫోలికల్స్ కి నష్టాన్ని కలిగించవచ్చును. దీనివలన జుట్టు తిరిగి పెరగక పోవచ్చు.
8. కట్యుల్ డామేజ్
జుట్టు స్ట్రిగ్నింగ్ కోసే వెళ్లే ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన మరొక ముక్యమైన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, మీరు అందంగా కనిపించడానికి సహాయపడే కట్యుల్ డామేజ్ అయి తిరిగి వాటిని పొందలేరు.ఈ రకమైన నష్టం వివిధ వికారమైన పరిస్థితులకు దారి తీస్తుంది మరియు మీ జుట్టు బలహీనమైనదిగా మరియు అనారోగ్యకరమైనవిగా కనిపిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
Related Articles
ఆఫీస్ పార్టీలో మిమ్మల్ని హైలైట్ చేసే ఈ క్విక్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్స్ ను ప్రయత్నించండి
స్మెల్లీ హెయిర్ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? ఈ హోంరెమెడీస్ ను ప్రయత్నించండి మరి.
నేచురల్ వేస్ లో హెయిర్ డై చేసుకోవడమెలా?
ఒక నెలలోనే హెయిర్ గ్రోత్ ను పెంపొందించడమెలా?
ఆముదం నూనెను వాడితే జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు
డాండ్రఫ్ సమస్య వేధిస్తోందా? అయితే, ఈ ఆపిల్ సిడర్ వినేగార్ రెమెడీస్ తో ప్రయోజనం పొందండి
ఈ హోంమేడ్ హెయిర్ మాస్క్స్ తో నిగనిగలాడే శిరోజాలను సొంతం చేసుకోండి
గ్రే హెయిర్ సమస్యకు ఈ సింపుల్ హ్యక్స్ తో పరిష్కారం పొందండి!
చర్మ కేశ సంరక్షణకు వేపాకులతో గృహ చికిత్స
రెడ్ వైన్ వలన కలిగే హెయిర్ కేర్ బెనిఫిట్స్
వేసవిలో మీ కేశ సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మృధువైన ఆరోగ్యకర జుట్టుకై సూచించబడిన నూనెలు ఇవే
చర్మ మరియు కేశ సంరక్షణ కొరకు కరివేపాకుతో గృహవైద్యం