For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు ఇలాంటి నూనెలు వాడితే - జుట్టు రాలే సమస్యలే ఉండవు..!

By Super Admin
|

జుట్టు డ్రైగా, డ్యామేజ్ అయి ఉంటే.. ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా.. ఆకర్షణీయంగా కనిపించదు. ఫెస్టివల్స్, అకేషన్స్ లో డిఫరెంట్ గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు.. డ్రై హెయిర్ చాలా సమస్యగా మారుతుంది. కాబట్టి.. ఇలాంటప్పుడు న్యాచురల్ రెమిడీస్ ప్రయత్నించడం చాలా సేఫ్.

డ్రై హెయిర్ చూడ్డానికే కాదు.. మేనేజ్ చేయడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది. పొడిబారిన జుట్టు చాలా తేలికగా బ్రేక్ అవడం, ఇతర సమస్యలు తీసుకురావడానికి కారణమవుతుంది.

అంతేకాదు.. డ్రై హెయిర్ చూడ్డానికి కూడా చాలా నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చక్కగా రెడీ అయినప్పుడు జుట్టు అందంగా, ఆకర్షణీయంగా ఉన్నప్పుడే.. మొత్తం లుక్ బావుంటుంది. కాబట్టి డ్రై హెయిర్ నివారించడానికి న్యాచురల్ ఆయిల్స్ చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

1. ఆర్గాన్ ఆయిల్

1. ఆర్గాన్ ఆయిల్

ఆర్గాన్ ఆయిల్ ఖరీదైనది. కానీ.. చాలా బెన్ఫిట్స్ కూడా.. అంతే గ్రేట్ గా ఉంటాయి. ఆర్గాన్ ఆయిల్ జుట్టులోని ప్రతి స్ట్రాండ్ కి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టు స్ట్రాంగ్ అండ్ షైనీగా కనిపించడానికి సహాయపడుతుంది. కాబట్టి డ్యామేజ్ అండ్ డ్రై హెయిర్ కి ఇదో చక్కటి ఆప్షన్. దీన్ని డైలీ హెయిర్ కేర్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో విటమిన్ బి, విటమిన్ ఇ మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.జుట్టులో కోల్పోయిన షైనింగ్ ను రీస్టోర్ చేస్తుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది

2. కొబ్బరినూనె

2. కొబ్బరినూనె

అందమైన జుట్టు పొందడానికి కొబ్బరినూనె చక్కటి ఆప్షన్. డ్యామేజ్ హెయిర్ ని , డ్రై హెయిర్ ని నివారించడానికి కొబ్బరినూనెతో స్కాల్ప్ ని, జుట్టుని మసాజ్ చేసి.. రాత్రంతా అలానే వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ కె మరియు ఇతర ఫ్యాటీ యాసిడ్స్ తలకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు సాప్ట్ గా మరియు స్ట్రాంగ్ గా మారుతుంది. కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ హెల్తీ అండ్ హైడ్రేటెడ్ హెయిర్ ను అందిస్తుంది.

3. రోజ్మెరీ ఆయిల్ :

3. రోజ్మెరీ ఆయిల్ :

రోజ్మెరీ ఆయిల్లో ఐరన్, క్యాల్షియం మరియు విటమిన్ బి పుష్కలంగా ఉన్నాయి . ఇవి జుట్టు పొడవుగా మరియు బలంగా పెరిగేలా చేస్తాయి. ఇది హెయిర్ ఫోలిసెల్స్ ను ఉద్దీపన చేసి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు గ్రే హెయిర్ ను నిరోధిస్తుంది. మరియు జుట్టు మంచి మెరుపును మరియు నునుపుదనాన్ని పొండానికి సహాయపడుతుంది.ఈ నూనెలో విటమిన్ బి మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. రోజ్మెర్రీ ఆయిల్ తెల్ల జుట్టును నివారిస్తుంది.

4.అవొకాడో ఆయిల్

4.అవొకాడో ఆయిల్

అవొకాడో ఆయిల్లో ఎక్కువ మొత్తంలో లెసిథిన్, విటమిన్ ఎ, డి, ఇ, బి6 మరియు అమినో యాసిడ్స్ కలిగి ఉంటాయి . ఇవి హెయిర్ రూట్స్ కు బలోపేతం చేస్తుంది మరియు హెయిర్ స్ట్రక్చర్ ను మెయింటైన్ చేస్తుంది.నేచురల్ గానే జుట్టు ప్రకాశవంతమైనదిగా పొందడానికి, ఇది ఒక గ్రేట్ నేచురల్ ఆయిల్. అవొకాడో-కొబ్బరినూనె-రోజ్మెరీ ఆయిల్ మాస్క్ ను వేసుకోవడం వల్ల కేశాలు ప్రకాశవంతంగా ఉంటాయి. అందుకు ఒక టేబుల్ స్పూన్ అవొకాడో ఆయిల్ మరియు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె , 10-20చుక్కల రోజ్మెరీ ఆయిల్ ను మిక్స్ చేసి మూడూ బాగా కలిసేలా కలగలిపి తలకు పట్టించి, అరగంట అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

5. జోజోబ ఆయిల్ :

5. జోజోబ ఆయిల్ :

మరో ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ జోజోబ హెయిర్ ఆయిల్. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ పురాత ఆయుర్వేదిక్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం మాత్రమే కాదు, హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. నేచురల్ షైనింగ్ ను ఇస్తుంది. జోజోబ ఆయిల్లో విటమిన్ ఎ, డి మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఆ నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ స్ట్రాంగ్ గా మారి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. చుండ్రు నివారిస్తుంది. అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది.

6. ఆలివ్ ఆయిల్

6. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఎక్కువగా ఉండటం వల్ల స్కాల్ప్ కి పోషణ అందిస్తుంది. అలాగే జుట్టుని బలంగా, హెల్తీగా మారుస్తుంది. అలాగే.. వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి.. వారానికి కనీసం ఒకసారి.. ఆలివ్ ఆయిల్ మసాజ్ చేస్తే.. హెల్తీ హెయిర్ పొందుతారు. అలాగే డ్రై అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

7. దానిమ్మ నూనె:

7. దానిమ్మ నూనె:

దానిమ్మ నూనె, మరో ఇండియన్ హెర్బల్ నూనె. పాలిశ్యాచురేటెడ్ ఆయిల్స్ కు పవర్ హౌస్ వంటిది. ఈ నూనెను తలకు అప్లై చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏవిధంగా ఉపయోగించాలి: కొన్ని చుక్కల దాన్ని నూనెను తలకు అప్లై చేసి, అందులో కొద్దిగా కొబ్బరి నూనెను మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ కాంబినేషన్ నూనె జుట్టు రాలడంతో పాటు ఇతర సమస్యలను కూడా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

English summary

Natural Oils For Dry And Damaged Hair

Using natural oil on damaged hair can help to add moisture to the locks and also prevent the appearance of dandruff flakes on the scalp.Massaging your scalp with natural oil helps to make your hair look lustrous and shiny. Without any expensive use of cosmetics or chemical ingredients, natural oils can help to boost hair growth easily.
Desktop Bottom Promotion