Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఉల్లిపాయ కంట్లోనీళ్ళు తెప్పించినా, బట్టతలపై తిరిగి జుట్టు పెరిగేలా చేస్తుంది..
మీ జుట్టు ఎక్కువగా రాలుతూ, బట్టతల కనబడటం మొదలవుతుందా? త్వరగా ఊడిపోతున్న మీ జుట్టుకి ఏ మందు వల్ల తేడా కనబడటంలేదా?అయితే, ఉల్లిపాయ రసం మాస్క్ ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది.
చాలా రోజుల నుంచి ఉల్లిపాయల లక్షణాల గురించి మరియు జుట్టుకి దాని వల్ల కలిగే అధ్బుతమైన ఉపయోగాల గురించి ఎంత విన్నాం అంటే, చివరికి మాకు మేమే తెలుసుకున్నాము. మేము కనుక్కున్నది ఇది.
సల్ఫర్ ప్రొటీన్ లేకపోవటం వలన జుట్టు రాలిపోతుంది.ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ యొక్క కరిగే రూపమైన మిథైల్ సఫోనీల్ మీథేన్ కెరాటిన్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది.ఈ కెరాటిన్ జుట్టు పెరగటంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలోని బ్యాక్టీరియా వ్యతిరేక గుణాలు తల మీద ఉన్న ఈస్ట్ తీవ్రతని విచ్ఛిన్నం చేస్తాయి ,చుండ్రు ని తొలగిస్తాయి, అధిక జిడ్డుని అదుపు చేస్తాయి మరియు ఏ రోగ సంక్రమణ క్రిములనైనా చంపేస్తాయి.
అదనంగా, ఉల్లిపాయల్లో ఉండే అనామ్లజనకాలు తెల్ల జుట్టు ఎదుగుదలని నివారించి, జుట్టు నల్లగా నిగనిగలాడేలాగ చేస్తాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే , ఉల్లిపాయ రసం జుట్టు మాస్క్ మీ జుట్టు కనిపించే తీరునే మార్చేస్తుంది.ఈ క్రింద, ఉల్లిపాయని వాడుతూ సహజంగా బట్ట తలని నివారించడం ఎలా అనేది పూస గుచ్చినట్లు వివరించాం చూడండి.

స్టెప్ 1:
ఒక ఉల్లిపాయ తొక్క తీయాలి.నీళ్ళతో బగా కడగాలి.చక్కగా కోయాలి.తరువాత ఒక మిక్సర్ లో వేసి మంచి గుజ్జుని తయారు చేయాలి.ఆ తరువాత అ గుజ్జు ని ఒక స్ట్రైనర్ లో వేసి వీలైనంత రసం పిండాలి.ఆ రసాన్ని పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి.

స్టెప్ 2:
రెండు చెంచాల కొబ్బరి నూనె ఒక మూకుడు లో వేసుకోవాలి.కొబ్బరి నూనె లో ఉండే లారిక్ ఆమ్లము దెబ్బతిన్న జుట్టు కణాల్ని బాగు చేసి కొత్త జుట్టు మొలవడానికి సహాయం చేస్తుంది.

స్టెప్ 3:
ఒక చెంచా ఆలివ్ నూనె, కొబ్బరి నూనె కి కలిపి రెండు నిమిషాలు తక్కువ మంట మీద వేయించాలి.తరువాత ఈ నూనె మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఆలివ్ నూనె జుట్టు లో తరచూ ఒత్తిడికి గురయ్యే కుదుళ్ళని తీసేసి తేమని ఉంచుతుంది.

స్టెప్ 4:
పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ రసాన్ని, గోరువెచ్చని నూనె మిశ్రమం లో కలపాలి.ఉల్లిపాయ దుర్వాసన పోవడానికి 3 చుక్కల నిమ్మరసం కలపాలి. ఉల్లిపాయ నూనె లోని విటమిన్-సి మీ ఇదివరకు జుట్టులా మెరిసేలా చేస్తుంది.

స్టెప్ 5:
పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన వాడి మీ జుట్టు చిక్కులన్నీ విప్పేయండి.జుట్టుని చిన్న చిన్న భాగాలు గా చేసి , మధ్యకి పట్టుకోని చివర్ల వరకు దువ్వెన తో దువ్వండి.ఇలా చేయడం వలన జుట్టులో ఏర్పడ్డ చిక్కు విడిపోతుంది.

స్టెప్ 6:
జుట్టు రాలిపోవడం ఆగడానికి ఈ మూలికల మాస్క్ ని పెట్టండి.మీ చేతి వేళ్ళతో మృదువుగా ,గుండ్రంగా, మెల్లగా మర్దన చేయండి.ఇలా చేయడం వలన మాస్క్ బాగా లోపలికి ఇంకడమే కాకుండా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది.

స్టెప్ 7:
ఆ మాస్క్ ని ఒక 45 నిమిషాలు పాటు ఉంచాలి.తరువాత దాన్ని ఏదైనా తేలికపాటి షాంపూ తో కడిగేయాలి.ఏ ఒక్క అవశేషం మిగలకుండా కడిగేలా చూసుకోవాలి.మీది జిడ్డుగా ఉండే జుట్టు అయితే కండీషనర్ ని వాడటం మానేయండి.

స్టెప్ 8:
జుట్టు రింగులు తిరగకుండా ఉండటానికి, రెండు చుక్కల కొబ్బరి నూనెని మీ అరచేతిలో తీసుకోని సున్నితంగా మీ జుట్టు చివరి భాగాలలో రాయండి.మరీ ఎక్కువ నూనె రాయకండి, ఎందుకంటే అది మీ జుట్టుని జిడ్డుగా మరియు అంటుకుంటూ ఉండేలా చేస్తుంది.

హెచ్చరిక
ఉల్లిపాయ నూనె ని మొత్తం జుట్టుకి పెట్టె ముందు, మీకు అధిక మోతాదు సల్ఫర్ పడుతుందో లేదో ముందే పరీక్షించి చూసుకోండి.

చివరి ఫలితాలు:
క్రమం తప్పకుండా 2 నెలలు వాడితే, ఈ ఉల్లిపాయ రసం జుట్టు మాస్క్, జుట్టుని పెంచడమే కాకుండా జుట్టు ని మందంగా, ఒత్తుగా మార్చి బట్టతలని పూడుస్తుంది.



Click it and Unblock the Notifications