Latest Updates
-
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.!
చిన్న వయసులో బట్టతలను నివారించే పవర్ ఫుల్ రెమెడీస్
గతంలో వయస్సైన వారిలో బట్టతల కనిపించేది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులో జుట్టు నెరవడం, తెల్ల జుట్టు కలవారిని చూస్తున్నాం. 40 ఏళ్ళ వచ్చిందంటే చాలు, జుట్టు రాలే సమస్యలు, జుట్టు పల్చబడుతున్నది చాలా మంది వాపోతుంటారు.
అయితే, ఇప్పుడు 20ఏళ్ళ వారు కూడా ఇదే మాట చెబుతున్నారు. జుట్టు రాలే సమస్యతో బట్టతల వస్తోందని చింతిస్తున్నారు. దీన్నే ప్రీమెచ్యుర్ బాల్డ్ నెస్ అని పిలుతారు. ఇది బాధాకరమైన విషయమే. చిన్న వయస్సులోనే బట్టతల వల్ల అందం, ఆకర్షణ రెండూ కోల్పోతారు.

వయస్సు అయ్యే కొద్ది హెయిర్ ఫాలీసెల్స్ వీక్ గా మారడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టు కాంతిని కోల్పోతుంది. కొత్త హెయిర్ ఫాలీసెల్స్ ను ఉత్పత్తి చేయడంలో విఫలం అవుతుంది. అయితే ఇరవైలో బట్టతల అనేది నార్మల్ కాదని గుర్తించాలి.
టెస్టోస్టెరాన్ ఉత్పత్తి పెరగడం వల్ల డిహెచ్ టి హార్మోన్ తగ్గిపోతుంది. ఈ హార్మోన్ కొత్త జుట్టు పెరగకుండా హెయిర్ ఫాలిసెల్స్ ను నివారిస్తుంది.

కోకనట్ మిల్క్ :
కోకోనట్ మిల్క్ లో విటమిన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇవి హెయిర్ ఫోలీసెల్స్ ను హెల్తీగా ఉంచుతుంది, దాంతో జుట్టు రాలడం తగ్గిస్తుంది.
కావల్సిన వస్తువులు:
- 1 కప్పు కొబ్బరి పాలు/ కొబ్బరి నూనె
పద్దతి:
1) కోకనట్ మిల్క్ లేదా కొబ్బరి నూనెను తలకు నేరుగా అప్లై చేయచ్చు. ఒక గంట సేపు ఉంచితే చాలు.
2) ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
3) మీరు కొబ్బరి పాలను రోజవారి ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల కనీసపు ప్రయోజనాలను పొందుతారు .

వెనిగర్ :
వెనిగర్ లో పొటాషియం, ఇతర ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. చుండ్రు నివారిస్తాయి.
కావల్సిన వస్తువులు:
- 4టేబుల్ స్పూన్ల వెనిగర్
పద్దతి:
1) మీరు రోజూ ఉపయోగించే షాంపుకు ఒక టీస్పూన్ వెనిగర్ కలపి 15 నిముషాలు పక్కనుంచాలి.
2) తర్వాత ఈ షాంపుతో తలస్నానం చేయాలి. అలాగే ఈ రెమెడీని వారంలో రెండు మూడు సార్లు ఫాలో అవ్వొచ్చు.

విటమిన్ ఇ:
విటమిన్ ఇ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది హెయిర్ ఫాలీసెల్స్ ను ఉత్పత్తి చేస్తుంది.
కావల్సిన వస్తువులు:
- విటమిన్ ఇ క్యాప్స్యుల్స్
పద్దతి:
1) విటమిన్ ఇ క్యాప్య్సూల్స్ ను కట్ చేసి, అందులోని నూనెను నేరుగా తలకు అప్లై చేయాలి.
2) విటమిన్ ఇ క్యాప్స్యూల్ దొరకనప్పుడు మన్నికైన ఏ నూనెనైనా తలకు వాడవచ్చు.

ఉసిరికాయ:
సహజంగా ఉసిరికాయలో ఉండే విటమిన్ సి పదార్థం జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది.
కావల్సిన వస్తువులు:
- 1 టేబుల్ స్పూన్ ఉసిరికాయ గుజ్జు
- 1 టీస్పూన్ నిమ్మరసం
పద్దతి:
1) ఒక బౌల్ తీసుకుని అందులో ఈ రెండు పదార్థాలను కలుపుకోవాలి.
2) ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, షవర్ క్యాప్ పెట్టుకోవాలి.
3) 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా 15 రోజులకొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్ జ్యూస్ :
బీట్ రూట్ లో క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి, సి లు, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన కూరగాయ. . ఇవి జుట్టు పెరుగుదలకు సహాయం చేసి, జుట్టురాలడం తగ్గించి, బట్టతలను నివారిస్తుంది.
కావల్సిన వస్తువులు:
- 1 బీట్ రూట్ తురుము
- 3 టేబుల్ స్పూన్ల గోరింటాకు
- నీళ్ళు సరిపడా
పద్దతి:
1) బీట్ రూట్ ను తురుము కోవాలి. అందులో నుండి రసం తియ్యాలి.
2) దీనికి కొద్దిగా హెన్నా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. .
3) ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి, 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. వారంలో ఒకసారి దీన్ని ప్రయత్నించండి.

ఆరోమ థెరఫీ:
చిన్న వయస్సులో బట్టతలను నివారించడానికి టీట్రీ ఆయిల్, రోజ్మెర్రీ ఆయిల్, మెంతులు ఉపయోగపడుతాయి. ఈ నూనెలను రెగ్యులర్ గా తలకు అప్లూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా బాదం,కొబ్బరి, ఆముదం నూనెలు కూడా తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

ధూమపానం మానేయాలి:
జుట్టు రాలడానికి ముఖ్య కారణం స్మోకింగ్.మీకు సిగరెట్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఈ ట్రీట్మెంట్ మీ జుట్టు రాలకుండా నివారిస్తుంది. స్మోకింగ్ వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. దాంతో జుట్టు రాలుతుంది.

ప్రోటీనులు ఎక్కువ తీసుకోవాలి:
జుట్టు పెరుగుదలకు ప్రోటీనులు సహాయపడుతాయి. సరైన ప్రోటీనులు అందలేదంటే, కొత్త వెంట్రుకలు మెలవవు. అందువల్ల రెగ్యులర్ గా తినే ఆహారాలలో చికెన్, గుడ్డు, చేపలు, బీన్స్, లెగ్యుమ్స్, క్వినా వంటి ప్రోటీన్ ఫుడ్స్ ను ఎక్కువగా చేర్చుకోవాలి



Click it and Unblock the Notifications