మీ రెగ్యులర్ షాంపులో ఉప్పు కలిపి వాడితే, మీకున్న జుట్టు సమస్యలన్నీ మాయం

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఈరోజుల్లో, ఉప్పు తినడానికి కాక ఇతర విషయాలకి వాడటం చాలా ఫ్యాషన్ అయిపోయింది. కానీ, ఉప్పు వాడకం కేవలం ట్రెండీ మాత్రమే కాదు, వాస్తవికం కూడా. ఈ సహజ ఖనిజలవణం అనేక రకాలుగా మన జీవితాలకి సాయపడుతూ, జీవితాన్ని కొంచెం సులభతరం చేస్తోంది. పైగా, మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఇది పూర్తిగా సహజమైన పదార్థం.

మీ అందాల ఉత్పత్తులకి ఉప్పును జతచేయటం వలన మీ జుట్టు, చర్మంపై అద్భుత ప్రభావాలు చూపిస్తుంది

డ్రై షాంపూ గురించి విన్నారా..? జుట్టును కళగా..ఒత్తుగా కనబడేలా చేస్తుంది..!

Put Salt In Your Shampoo Before Showering

మీరు ఉప్పును(సోడియం క్లోరైడ్) అనేక ఉత్త్పత్తులలో వాటి పనితీరును పెంచడానికి జతచేయవచ్చు. ఉదాహరణకి, మీకు జిడ్డు జుట్టు ఉంటే, ఇంకేదీ పనిచేయకపోతే, మీ సమస్యకి ఉప్పు పరిష్కారం. మీరు చేయాల్సిందల్లా 2 నుంచి 3 చెంచాల ఉప్పును షాంపూలో కలిపి, బాగా గిలకొట్టి, మీ జుట్టును దానితో కడగండి. కేవలం రెండు సార్లు వాడకంలోనే మంచి ఫలితాలు చూడవచ్చు!

Put Salt In Your Shampoo Before Showering

మీరు ఉప్పును శరీర స్క్రబ్ గా కూడా వాడవచ్చు. సముద్రలవణం తెచ్చుకోవటం మర్చిపోకండి. దాని తయారీ ఎలానో చూద్దాం. అరకప్పు కొబ్బరి నూనె, 2చెంచాల సముద్ర ఉప్పుతో కలపండి. మీకు ఇంకా కావాలంటే మరింత వేసుకోండి. అన్నిటినీ కలిపి ఆ మిశ్రమాన్ని డబ్బాలో పోసుకోండి. కొబ్బరినూనె గట్టిపడటానికి చల్ల ప్రదేశంలో ఆ డబ్బాను ఉంచుకోండి. మీ చవకైన,సహజమైన శరీర స్క్రబ్ వాడకానికి తయారు.

Put Salt In Your Shampoo Before Showering

ఈ సహజమైన లవణం మరో అద్భుత ఉపయోగం ఇది పాదాల మృతచర్మాన్ని సమర్థవంతంగా తొలగిస్తుంది. సరిసమాన భాగాలలో ఆలివ్ నూనె మరియు ఉప్పును కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకి రుద్దండి. దీన్ని వారానికి రెండుసార్లు వినియోగిస్తే, పగిలిన పాదాలకి గుడ్ బై చెప్పండి.

Put Salt In Your Shampoo Before Showering

సహజచిట్కాగా ఉప్పు

మీకు ఎప్పుడన్నా కాగితం కోసుకుపోయిందా? అది చాలా నెప్పి పుట్టి,చిరాకుగా అన్పిస్తుంది కదూ? మీకు ఎప్పుడన్నా ఇలా కోసుకుపోతే ఇలా చేయండి.రెండు చెంచాల ఉప్పును గ్లాసు నీళ్ళలో వేయండి. ఆ మిశ్రమాన్ని గాయంపై కొంచెం వేసి ఉంచండి.కొంచెం గుచ్చుకున్నట్లు అన్పిస్తుంటే, చిట్కా పనిచేస్తున్నట్లు.

కెమికల్ షాంపూ ఉపయోగించకుండా.. జుట్టు శుభ్రం చేసుకునే ఎఫెక్టివ్ రెమిడీస్..!!

Put Salt In Your Shampoo Before Showering

మీకెప్పుడూ తలనొప్పులు వస్తూనే ఉంటే, ఒక చెంచాడు ఉప్పును గ్లాసు నీళ్ళలో వేసి, దాన్ని తాగండి. 10 నుంచి 15 నిమిషాలలో మీ తలనెప్పి తగ్గుతుంది.

గమనిక ; మీకు రక్తపోటు ఉంటే, జాగ్రత్త, మీ ఉప్పు వాడకంపై దృష్టిపెట్టాలి. లేకపోతే అధిక రక్తపోటుకి దారితీస్తుంది. కాకపోతే పైభాగాలకి ఉప్పు వాడటం వలన ఏ దుష్ప్రభావం ఉండదు.

English summary

Put Salt In Your Shampoo Before Showering, This Simple Trick Sloves One Of The Biggest Hair Problems!

If you put salt in your shampoo you will solve one of the biggest hair problems. Read on to know more...
Story first published: Thursday, November 16, 2017, 18:00 [IST]