For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాంపు, కండీషనర్స్ పక్కన పెట్టి, ఈ హెయిర్ ప్యాక్స్ ప్రయత్నించండి!

|

షాంపుతో తలస్నానం చేసి కండిషనర్‌ పెట్టుకుంటే చాలు జుట్టుకు ఇంకేం చేయనక్కర్లేదు అనుకుంటున్నారా... అయితే మీ చేతులారా దాన్ని దెబ్బతీస్తున్నట్టే. వాస్తవానికి పండగ, ఫంక్షన్‌... వేడుక ఏదైనా సరే ప్యాక్‌లు వేసుకుని ముఖచర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కదా. అలానే జుట్టు విషయంలో కూడా జాగ్రత్తపడితే పట్టులాంటి మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుంది.

ఎండ, కాలుష్యం వంటి కారణాల వల్ల నిర్జీవంగా మారిపోయిన జుట్టుకు హెయిర్‌ మాస్క్‌ వేసి పోషణ ఇవ్వచ్చు. హెయిర్ మాస్క్ లు నిర్జీవంగా ఉండే వెంట్రుకలు మృదువుగా, మెరిసేలా చేస్తాయి. ఇవి వెంట్రుకల చివర తెగుళ్ళును, జుట్టు మధ్యలో తెగిపోవటం వంటి సాధారణ సమస్యలను సమర్థవంతంగా నివారిస్తాయి.

hair packs

గుడ్లు, పెరుగు, అవకాడో మరియు ఇతరేతర సహజ ఔషదాల ద్వారా హెయిర్ మాస్క్ లను తయారు చేయవచ్చు మరియు ఇవి సహజంగా వెంట్రుకల సమస్యలను తొలగిస్తాయి. ఈ నేచురల్ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జుట్టు రాలడం తగ్గించే, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

ఎగ్ హెయిర్ ప్యాక్:

ఎగ్ హెయిర్ ప్యాక్:

గుడ్డులో పచ్చసొనకు కొద్దిగా కోకనట్ మిల్క్, విటమిన్ ఇ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది తలలో డ్రైనెస్, చుండ్రు నివారిస్తుంది. తలకు ప్యాక్ వేసుకుని ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే, తలలో పిహెచ్ బ్యాలెన్స్ అవుతుంది.

ఒక్క నెలలో జుట్టు ఒత్తుగా..పొడవుగా పెరగడానికి సహాయపడే 11 బెస్ట్ హెయిర్ ఆయిల్స్ఒక్క నెలలో జుట్టు ఒత్తుగా..పొడవుగా పెరగడానికి సహాయపడే 11 బెస్ట్ హెయిర్ ఆయిల్స్

ఆనియన్, గార్లిక్ హెయిర్ ప్యాక్ :

ఆనియన్, గార్లిక్ హెయిర్ ప్యాక్ :

జుట్టు పెరగడానికి ఉల్లి, వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయ, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. డ్రై హెయిర్ ఉన్నట్లైతే కొద్దిగా ఆముదం కూడా మిక్స్ చేసి తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

శెనగపిండి మరియు తేనె ప్యాక్ :

శెనగపిండి మరియు తేనె ప్యాక్ :

రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండిలో తేనె కలపాలి. మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ను తలకు పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకుంటే నిగనిగలాడే ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది. రాలిపోయిన జుట్టు తిరిగి పెరుగుతుంది

బొప్పాయితో హెయిర్ ప్యాక్

బొప్పాయితో హెయిర్ ప్యాక్

బొప్పాయిని మెత్తగా పేస్ట్ చేసి తలకు ప్యాక్ వేసుకోవాలి. అవసరం అయితే బొప్పాయి పేస్ట్ కు కొద్దిగా కోకనట్ మిల్క్, ఆముదం కలిపి తలకు ప్యాక్ వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు మంచి పోషణ అందుతుంది. ఒట్టు పెరగడానికి సహాయపడుతుంది.

కొబ్బరి నూనె + కరివేపాకు వేడి చేసి తలకు అప్లై చేస్తే: అద్భత లాభాలుకొబ్బరి నూనె + కరివేపాకు వేడి చేసి తలకు అప్లై చేస్తే: అద్భత లాభాలు

అరటి మయోనైజ్ :

అరటి మయోనైజ్ :

అరటి పండు పేస్ట్, మయోనైజ్ ఫర్ఫెక్ట్ హెర్ ప్యాక్. అరటిపండు పేస్ట్ కు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనె లేదా విటమిన్ ఇ ఆయిల్ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. 45 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే డ్యామేజ్ అయినా, డ్రై జుట్టు సమస్యలను తగ్గించి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది,.

English summary

Quick Hair Packs For Hair Growth

Take a quick look at hair packs for hair growth, which can be prepared in minutes.
Desktop Bottom Promotion