For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సమస్యలన్నింటికి పెరుగు హెయిర్ ప్యాక్ తో చెక్

ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే పెరుగుని ఉపయోగించి కురుల సంక్షణ విషయంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.

|

జుట్టు నల్లగా, ఒత్తుగా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఒక కళ ఉంటుంది. అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. అయినప్పటికీ వెంట్రుకలు రాలిపోవడం, పొడిగా తయారవడం, చుండ్రు ఇలా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది.

ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి కొన్ని సార్లు మార్కెట్లో దొరికే ఉత్పత్తులను వాడాల్సి వస్తుంది. అయితే ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే పెరుగుని ఉపయోగించి కురుల సంక్షణ విషయంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. అయితే అందు కోసం ఏం చేయాలో తెలుసుకుందా..

చుండ్రు తగ్గడానికి :

చుండ్రు తగ్గడానికి :

పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి కప్పు పెరుగు తీసుకుని పేస్ట్ మాదిరిగా అయ్యేలా ఎగ్ వీటర్ తో కలపాలి. దాన్ని మాడుకు రాసుకుని నలభై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికొకసారి పాటించడం ద్వార చుండ్రుని దూరం చేసుకోవచ్చు.

చుండ్రు సమస్య

చుండ్రు సమస్య

పెరుగులో కొద్దిగా నిమ్మరసం , కొన్ని చుక్కల తేనె కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని తలకు పూర్తిగా అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

డ్రై జుట్టును నివారిస్తుంది:

డ్రై జుట్టును నివారిస్తుంది:

వాతావరణ మార్పులు, కాలుష్య ప్రభావం వల్ల జిట్టు డ్రైగా మారుతుంది. ఫలితంగా వెంట్రుకలు తెగిపోతుంటాయి. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య తీవ్రత పెరుగుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది.

హెయిర్ కండీషనర్ గా పనిచేసి జుట్టును అందంగా కనిపించేలా చేస్తుంది.

హెయిర్ కండీషనర్ గా పనిచేసి జుట్టును అందంగా కనిపించేలా చేస్తుంది.

దీనికోసం మూడు టేబుల్ స్పూన్ల పెరుగు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, నాలుగు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జుని తీసుకుని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మైల్డ్ షాంపు ఉపయోగించి తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం హెయిర్ కండీషనర్ గా పనిచేసి జుట్టును అందంగా కనిపించేలా చేస్తుంది. పెరుగు డ్రైగా మారిన జుట్టుకి తేమనిందించి పూర్వస్థితి వచ్చేలా చేస్తుంది.

జుట్టును మెరిపిస్తుంది:

జుట్టును మెరిపిస్తుంది:

పట్టులా మ్రుదువుగా, సిల్కీగా కనిపించే కరులు కావాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండి,.

అరకప్పు పెరుగులో రెండు చెంచాల బాదం నూనె, రెండు కోడిగుడ్లు

అరకప్పు పెరుగులో రెండు చెంచాల బాదం నూనె, రెండు కోడిగుడ్లు

దీనికోసం అరకప్పు పెరుగులో రెండు చెంచాల బాదం నూనె, రెండు కోడిగుడ్లు (తెల్ల సొన మాత్రమే ) కలిపి ఈ మిశ్రమాన్ని కుదళ్ళకు , జుట్టు చివర్ల వరకూ అప్లై చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట ఆరనిచ్చిన తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

జుట్టు రాలకుండా:

జుట్టు రాలకుండా:

ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఇలా జరగడానికి వేర్వేరు కారణాలున్నాయి. అయితే పెరుగుని ఉపయోగించడం ద్వారా ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

పెరుగు తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల మెంతి పొడిని కలపాలి

పెరుగు తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల మెంతి పొడిని కలపాలి

దీనికోసం అరకప్పు పెరుగు తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల మెంతి పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని, షవర్ క్యాప్ పెట్టుకోవాలి. అరగంట ఆగిన తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టు కుదళ్లను స్ట్రాంగ్ గా చేసి రాలిపోకుండా చేస్తుంది. అలాగే చుండ్రును తగ్గిస్తుంది.

మరో ప్యాక్

మరో ప్యాక్

జుట్టు రాలకుండా పెరుగుతో తయారుచేసిన మరో ప్యాక్ ని వేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అందుకోసం గోరింటాకు, కరివేపాకు సమంగా తీసుకోవాలి. వీటిని ఎండబెట్టి పొడి చేసి మిశ్రమంగా కలుపుకోవాలి. దీనిలో నుంచి మూడు చెంచాలా పొడిని తీసుకుని మూడు చెంచాల పెరుగు కలపాలి. దీన్ని ప్యాక్ లా గవేసుకుని, అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాలను తరచూ పాటించడం ద్వారా కుదుళ్లు బలంగా తయారై కురులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది.

English summary

Super-Effective Ways To Use Curd On Hair!

Curd is one of the healthiest foods found in every kitchen, which is an excellent source of vitamins and proteins.From aiding in digestion to using it in beauty regime, curd is a versatile element which can be used by everyone. Besides cooking, curd can also play a major role on skin and hair.
Desktop Bottom Promotion