For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలే సమస్యలకు, ఇంట్లోనే మందార నూనె తయారీ !

మనలో చాలా మంది హెయిర్ ఫాల్, చిట్లిన జుట్టు, పొడి జుట్టు, ఆయిల్ హెయిర్, చుండ్రు, చిక్కుబడిన జుట్టు , డ్యామేజ్ అయిన జుట్టు ఇలా పలు రకాల జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు.

|

మనలో చాలా మంది హెయిర్ ఫాల్, చిట్లిన జుట్టు, పొడి జుట్టు, ఆయిల్ హెయిర్, చుండ్రు, చిక్కుబడిన జుట్టు , డ్యామేజ్ అయిన జుట్టు ఇలా పలు రకాల జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలన్నింటికి మార్కెట్లో దొరికే వివిద రకాల ప్రొడక్ట్స్ , హెయిర్ ఆయిల్స్, మాస్కులు ప్రయత్నించి ఉంటారు. అయితే ఈ అన్ని కామన్ ప్రొబ్లెమ్స్ ను ఇంట్లోనే నేచురల్ పద్ధతిలో నివారించుకోవచ్చు.

అనేక జుట్టు సమస్యలను మందారంతో నివారించుకోవచ్చు. ఎర్రమందారం..ముద్దమందారం ఎంత అందంగా ముదురాకుపచ్చని రెమ్మల మధ్య దాగి ఉంటుంది. మందారంలో ఎన్నో రంగులు, ఆకారాలు, రకాలు, సొగసులు ఉన్న ముద్దమందారం అందం, రంగు ముందు మరే పువ్వు సాటిరాదు. అటువంటి మందారంను సహజ సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు.

జుట్టు రాలే సమస్యలకు, ఇంట్లోనే మందార నూనె తయారీ !

మందార ఆకులు, ఎండిన పువ్వులు రెండూ ఎంతో ఉపయోగం. సౌందర్య పోషణలో మందార ఆకులు, పూలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మందారంలో ఉండే విటమిన్ సి, అమినోయాసిడ్స్, విటమిన్ ఎ, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ వల్ల జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. మందారాలతో మెత్తటి కురులను మీ సొంతం చేసుకోవచ్చు.

ఎర్రమందారం..ముద్దమందారంతో అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్..!! ఎర్రమందారం..ముద్దమందారంతో అన్ని రకాల జుట్టు సమస్యలకు చెక్..!!

హైబిస్కస్ ఆయిల్ ను నేరుగా జుట్టుకు అప్లై చేయవచ్చు. లేదా రెగ్యులర్ గా వాడే ఇతర నూనెలతో కలిపి హెయిర్ మాస్క్ లు వేసుకోవచ్చు. ఈ నూనెలను ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోచ్చు. హైబిస్కస్ హెయిర్ ఆయిల్స్ ను ఏవిధంగా తయారుచేసుకోవాలి, ఎలా వాడాలో తెలుసుకుందాం..

జుట్టు రాలే సమస్యలకు, ఇంట్లోనే మందార నూనె తయారీ !

1. మందారం, కొబ్బరి నూనె
ఈ కాంబినేషన్ నూనెను తయారుచేసుకోవడం చాలా సులభం. అందుకు కొబ్బరి నూనె, మందారం పువ్వులు ఉంటే చాలు. నిల్వ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ అవసరం అవుతుంది.
కావల్సిన పదార్థాలు:
20 మందారం పువ్వులు
500గ్రాముల కొబ్బరి నూనె
ఒక పాన్

తయారు చేయు విధానం:
1. ఒక పాన్ లో కొబ్బరి వేసి, తక్కువ మంట మీద వేడి చేయాలి.
2. కొబ్బరి నూనె 5 నిముషాలు వేడి అయ్యాక అందులో 10-15 మందారం పువ్వులను వేయాలి.
3. కొబ్బరి నూనెతో పాటు మందారం పువ్వులు బాయిల్ అవుతుంది.
4. కొబ్బరి నూనె డార్క్ ఎల్లో లేదా డార్క్ రెడ్ కలర్లోనికి మారుతుంది.
5. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి, మిగిలిన పువ్వులను కూడా ఆ నూనెలో వేయాలి.
6. ఇలా వేడి చేసిన నూనెను రాత్రంతా అలాగే చల్లార్చాలి.
7. ఈ హైబిస్కస్ నూనెను గ్లాస్ జార్ లోనికి వడగట్టుకుని, నిల్వ చేసుకుని, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి.

జుట్టు రాలే సమస్యలకు, ఇంట్లోనే మందార నూనె తయారీ !

రిసిపి 2: మందారం, కొబ్బరి నూనె-ఆముదం నూనె
మందారం పువ్వులతో పాటు, కొబ్బరి నూనె, ఆముదం అవసరం అవుతుంది. ఇది కూడా ఓవర్ నైట్ ప్రొసెస్. మందారం పువ్వుల్లో కొబ్బరి నూనె, ఆముదం నూనెను పోసి, కొద్దిగా మెంతులు జోడించి ఉడికించాలి.

కావల్సిన పదార్థాలు:
20 ఎండిన మందారం పువ్వులు
1/2 cup/500 ఎమ్ ఎల్ కొబ్బరి నూనె
1 టేబుల్ స్పూన్ మెంతులు
2 టేబుల్ స్పూన్ల ఆముదం
1 పాన్

తయారు చేయు విధానం:
1. స్టౌ మీద పాన్ పెట్టాలి.
2. తర్వాత కొబ్బరినూనె అందులో పోసి 5 నిముషాలు వేడి చేయాలి.
3. తర్వాత అందులోనే ఎండిన మందారం పువ్వులను వేసి వేడి చేయాలి.
4. పాన్ లో ఆయిల్ రంగు మారే సమయంలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి.
5. మెంతులు వేసిన తర్వాత మరో 5 నిముషాలు వేడి చేయాలి.
6. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి, రాత్రంతా చల్లారబెట్టాలి.
7. మరుసటి రోజు గ్లాస్ బౌల్లోకినికి వడగట్టుకుని, అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనె కలపాలి.
8. అంతే హైబిస్కస్-కోకనట్-ఆముదం నూనె కాంబినేషన్ ఆయిల్ రెమెడీ.

మందార నూనెతో అందం, యవ్వనం రెండూ సొంతమే మందార నూనెతో అందం, యవ్వనం రెండూ సొంతమే

జుట్టు రాలే సమస్యలకు, ఇంట్లోనే మందార నూనె తయారీ !

రిసిపి 3: కలబంద-మందారం-వేసనూనె
వేపనూనెలో ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల చర్మంలోని ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా నివారించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి, ఈ హైబిస్కస్ హెయిర్ ఆయిల్ తలలో దురద, వాసన, చీకాకును నివారిస్తుంది.

కావల్సిన పదార్థాలు
18-20 ఎండిన మందారం పువ్వులు
3 టేబుల్ స్పూన్ అలోవెర జెల్
5-8 మందారం ఆకులు
1/2 కప్పు వేపఆకులు
2 టేబుల్ స్పూన్ల మెంతులు
500 ml కొబ్బరి నూనె
2 టేబుల్ స్పూన్ల ఆముదం నూనె
2 టీస్పూన్ కర్పూరం పౌడర్

తయారుచేయు పద్ధతి:
1. మిక్సీలో అలోవెర జెల్, 10 ఎండిన మందారం పువ్వులు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, మీడియం మంట ఉంచి, పాన్ లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ పోయాలి.
3. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 5 నిముషాలు ఉడికించాలి.
4. తర్వాత అందులోనే కొబ్బరినూనె, ఆముదం నూనె, మేతి, కర్పూరం పౌడర్ కూడా వేసి ఉడికించాలి.
5. మొత్తం మిశ్రమాన్ని కనీసం 2 గంటల పాటు మీడియం మంట మీద ఉడికించాలి. ఇది ఉడికి, చివరిక పాన్ లో నూనె సపరేట్ అవుతుంది. ఈ నూనె రంగు వైట్ కలర్లో ఉంటుంది.
6. ఆయిల్ రెడీ అయిన తర్వాత, మిగిలిన మందారం పువ్వులను అందులో వేసి, కలియతిప్పాలి.
7. తర్వాత వేప ఆకులు, మందారం ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి కాగుతున్న నూనెలో వేయాలి.
8. మొత్తం మిశ్రమాన్ని మరో రెండు గంట పాటు ఉడికంచాలి. చివరగా నూనె తయారవుతుంది. దీన్నిరాత్రంత చల్లారనిచ్చి ఉదయం గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుని, అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవాలి.

English summary

Hibiscus Hair Oil Recipes, Benefits Of Hibiscus For Hair, Hibiscus Hair Oil Preparation, Hair Oil Preparation At Home

Vitamin C, amino acids, Vitamin A and alpha-hydroxy acids content of hibiscus makes it very good for direct application on hair.
Story first published:Wednesday, July 26, 2017, 16:11 [IST]
Desktop Bottom Promotion