For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యంగ్ స్టర్స్ లో తెల్ల జుట్టును నివారించే 13 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

యంగ్ స్టర్స్ లో తెల్ల జుట్టును నివారించడానికి కొంత మంది నిపునులు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే అప్పటి వరకూ ఆగకుండా... నేచురల్ గా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్...

|

సహజంగా వయస్సైన వారిలో తెల్ల జుట్టు కనబడుతుంది. కానీ ఈ మద్యకాలంలో యంగ్ స్టర్స్ లో కూడా జుట్టు తెల్లబడటం గమనిస్తుంటారు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, స్ట్రెస్ వంటి ఎన్నో కారణాలు జుట్టు తెల్లబడేలా చేస్తున్నాయి.

యంగ్ స్టర్స్ లో తెల్ల జుట్టును నివారించడానికి కొంత మంది నిపునులు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే అప్పటి వరకూ ఆగకుండా... నేచురల్ గా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఈ నేచురల్ హోం రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎఫెక్టివ్ గా పనిచేసి, తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతాయి. మరి యంగ్ స్టర్స్ లో తెల్ల జుట్టును నల్లగా మార్చే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం..

 పొట్లకాయ :

పొట్లకాయ :

పొట్టకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరి నూనెలో నానబెట్టాలి. నాలుగు, ఐదు గంటలు నానబెట్టిన తర్వాత వడగట్టి, గాలి చొరకవడని డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఇక ఈ నూనెను రెగ్యులర్ గా తలకు అప్లై చేసి , మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు క్రమంగా తగ్గుతుంది.

సొరకాయ:

సొరకాయ:

సొరకాయ జ్యూస్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె మిక్స్ చేసి, తలకు పూర్తిగా అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు తగ్గుతుంది.

ఉల్లిపాయ పేస్ట్ :

ఉల్లిపాయ పేస్ట్ :

తలస్నానం చేయడానికి అరగంట ముందు ఉల్లిపాయను పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను హెయిర్ రూట్స్ కు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పచ్చిపాలు:

పచ్చిపాలు:

వారానికొక సారి పచ్చి పాలను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా పాలను అప్లై చేయడం వల్ల కేశాలకు పోషణ అందుతుంది. క్రమంగా తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.

బ్లాక్ టీ :

బ్లాక్ టీ :

రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీని నీళ్లల్లో వేసి మరిగించాలి. 10 బాయిల్ చేసిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లార్చనివ్వాలి. తర్వాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. షాంపుతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ వాటర్ ను తలారా పోసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగు :

పెరుగు :

పెరుగు, హెన్నా పౌడర్ రెండూ సమంగా తీసుకోవాలి. రెండింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ పెప్పర్ :

బ్లాక్ పెప్పర్ :

అరకప్పు పెరుగు తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్, ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. మూడు బాగా మిక్స్ అయ్యే వరకూ కలపాలి. తర్వాత లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే తెల్ల జుట్టు పెరగకుండా నివారించుకోవచ్చు.

ఆమ్లా జ్యూస్:

ఆమ్లా జ్యూస్:

ఉసరికాయను పురాత కాలం నుండి సౌందర్య పోషనకు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు సంరక్షణలో ఉసిరి కూడా ఒక భాగమేజ అందువల్ల ఉసిరికాయను జ్యూస్ గా చేసి, ఈ మిశ్రమాన్ని తలకు రెగ్యులర్ గా అప్లై చేయాలి.

జామ ఆకులు:

జామ ఆకులు:

జామ ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను నేరుగా తలకు అప్లై చేయాలి. 10-20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

అల్లం, పాలు:

అల్లం, పాలు:

అల్లంను మెత్తగా పేస్ట్ చేసి, ఈ పేస్ట్ కు కొద్దిగా పాలు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు పూర్తిగా అప్లై చేసి, మసాజ్ చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

 కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి. 10 నిముషాలు మరిగించిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వడగట్టి , డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. వారంలో మూడు నాలుగు సార్లు ఈ నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది.

హెన్నా, మస్టర్ ఆయిల్ :

హెన్నా, మస్టర్ ఆయిల్ :

జుట్టు పొడవు, ఒత్తును బట్టి, హన్నా పౌడర్, మస్టర్డ్ ఆయిల్ తీసుకుని, బాయిల్ చేయాలి. హెన్నా పూర్తిగా బర్ట్న్ అయ్యే వరకూ వేడి చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. ఇలా నెలకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

బట్టర్ :

బట్టర్ :

స్వచ్చమైన బట్టర్ (వెన్న) లేదా నెయ్యి ని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తెల్ల జుట్టును నివారిస్తుంది.

అలోవెర జెల్, నిమ్మరసం:

అలోవెర జెల్, నిమ్మరసం:

అలోవెర లీప్ నుండి జెల్ ను వేరుగా చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టును నివారించడంలో ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ.

English summary

Top 14 Home Remedies to Prevent Grey Hair

Early grey hair is surely distressing. Even though grey hair is something that everyone deals with at some point of time or the other, it can be quite a pain to see that first strand come up, especially if it comes before you expect it to. Thankfully, you can try out some of the home remedies to delay and get rid of the signs of premature greying of hair.
Story first published: Monday, January 9, 2017, 13:31 [IST]
Desktop Bottom Promotion