జుట్టు ఎదుగుదల కి శిఖాకాయి పొడి ని వాడే ఉత్తమ విధానాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

శిఖాకాయి పొడి భారత దేశం యొక్క ఒత్తైన మరియు పొడవైన జుట్టుకి గల రహస్యం. చాలా శతాబ్దాలు గా ఇది మొత్తం జుట్టు బాగుచేయటానికి మరియు పెరుగుదలకి వాడబడుతుంది.

ఈ జుట్టుని పరిరక్షించు పదార్థంలో ప్రొటీన్లు, అనామ్లజనకాలు మరియు ఇతర పధార్థాలు అధికంగా ఉండుట వలన జుట్టు పెరుగుదల కి తోడ్పడతాయి.

ఇలా వివిధ ప్రయోజనాలు ఉండటం వల్లన,ఇది పొడవు జుట్టు రావడానికి అందరికి ఇష్టమైన జుట్టుని సంరక్షించే పదార్థం అయింది. ఈ ఆధునిక కాలం లో, ఎన్నో లెక్కలేనన్ని జుట్టు ని సంరక్షించు పదార్థాలు ఉన్నప్పటికీ,చాల మంది యువతులు ఇంకా జుట్టు పెరుగుదల కోసం ఈ శిఖాకయనే వాడడానికి ఇష్టపడుతున్నారు. మీరింకా ఈ ప్రాచిన పద్ధతి ని ప్రయత్నించకపోతే, ఇంకా సమయం ఏమి మించిపోలేదు.బజారు నుంచి కొనుక్కునే రసాయనాలు కలిగిన పదార్థాలకి స్వస్తి చెప్పండి మరియు మీ జుట్టు పెరుగుదలకి ఈ ప్రాకృతిక పదార్థాన్ని వాడండి.

 Top Ways To Use Shikakai Powder To Boost Hair Growth

ఈ రోజు, బోల్డ్ స్కై లో,మీరు కోరుకునే పొడవైన కేశాల కోసం సమర్ధవంతమైన విధానాలన్నిటిని మీరు వాడుకునే విధంగా జత చేసి మీ దగ్గరకు తీసుకువచ్చాం. శిఖాకాయిని సమానమయిన ప్రయోజనాలున్న కొబ్బరి నూనె, పెరుగు మరియు ఇతర పధార్థాలతో కలపడం వల్లన మరింత మెరుగైన ప్రభావం మరియు ఫలితాలు తొందరగా వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గమనిక:తల మీద మొత్తం రాసే ముందు ,ఈ మిశ్రమాలన్నిటి తో తల మీద ముందే కొంచెం పరీక్ష చేసుకోవాలి.

 ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

ఒక చెంచా శిఖాకాయి పొడి ని మూడు చెంచాల కొబ్బరి నూనె తో కలపాలి.

ఆ వచ్చిన మిశ్రమాన్ని మీ తల మొత్తం మీద రాయండి.

రాసాక ఒక గంట ఉండనీయండి

తరువాత ఒక తేలికయిన షాంపు వాడి, గోరువెచ్చని నీల్ల తో కడిగేయాలి.

రెండు వారాలకి ఒకసారి ఇలా చేసి మంచి జుట్టు పెరుగుదల ని పొందండి.

శిఖాకాయి పొడి ని ఉసిరి నూనెతో కలిపి:

శిఖాకాయి పొడి ని ఉసిరి నూనెతో కలిపి:

ఎలా వాడాలి:

ఒక చెంచా శిఖాకాయి పొడిని రెండు చెంచాల ఉసిరి నూనె తో కలిపి ఒక మిశ్రమం చేయాలి.

ఆ మిశ్రమాన్ని తల మొత్తం మీద రాయాలి.

కనీసం ఒక గంటయినా ఎండనివ్వాలి.

తరువాత మీ తలని ఒక తేలికపాటి షాంపు మరియు గోరు వెచ్చని నీళ్ళ తో కడిగేయాలి.

జుట్టు పెరుగుదల కోసం ఈ చిట్కా నెలకి ఒకసారి వాడాలి.

శిఖాకాయి పొడి ని గ్రీన్ టీ తో కలిపి:

శిఖాకాయి పొడి ని గ్రీన్ టీ తో కలిపి:

ఎలా వాడాలి:

ఒక చెంచా శిఖాకాయి పొడిని రెండు చెంచాల గ్రీన్ టీ తో కలిపి ఒక మిశ్రమం చేయాలి.

ఆ మిశ్రమాన్ని తల మొత్తం మీద రాయాలి.

అలా ఒక గంట వరకు పెట్టుకున్నాక, ఒక తేలికపాటి షాంపు మరియు గోరు వెచ్చని నీళ్ళ తో కడిగేయాలి.

పొడవైన జుట్టు కోసం ఈ పద్దతి ని రెండు వారాలకి ఒకసారి ప్రయత్నించాలి.

శిఖాకాయి పొడిని గుడ్డు తెల్ల సొనతో కలిపి:

శిఖాకాయి పొడిని గుడ్డు తెల్ల సొనతో కలిపి:

ఎలా వాడాలి:

రెండు చెంచాల శిఖాకాయి పొడిని ఒక గుడ్డు తెల్ల సొనతో కలపాలి.

దాన్ని తల మీద పోసి, ఒక 40-45 నిమిషాలు ఉంచాలి.

తరవాత జుట్టు ని మీ ఇష్టమైన షాంపు మరియు గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి.

జుట్టు పెరగడానికి ప్రతీ రెండు వారాలకి ఒకసారి ఈ పద్దతి ని వాడాలి.

శిఖాకాయి పొడిని ఉల్లిపాయ రసంతో కలిపి:

శిఖాకాయి పొడిని ఉల్లిపాయ రసంతో కలిపి:

ఎలా వాడాలి:

ఒక చెంచా శిఖాకాయి పొడిని 3 చెంచాల ఉల్లిపాయ రసం తో కలపాలి.

ఆ మిశ్రమాన్ని తల మీద మొత్తం రాసి ఒక అరగంట ఉండనివ్వాలి.

తరవాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.

జుట్టు పొడవుగా మరియు బలంగా ఉండటానికి ఈ మిశ్రమాన్ని నెలకి ఒకసారి వాడాలి.

శిఖాకాయి పొడి ని ఆపిల్ రసం వెనిగర్ తో కలిపి:

శిఖాకాయి పొడి ని ఆపిల్ రసం వెనిగర్ తో కలిపి:

ఎలా వాడాలి:

ఒక చెంచా శిఖాకాయి పొడి, అర చెంచా ఆపిల్ రసం మరియు రెండు చెంచాల గులాబి నీళ్ళతో మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

ఆ మిశ్రమాన్ని తల మొత్తం రాయాలి.

తల మీద ఒక అరగంట ఎండనివ్వాలి.

ఆ తరవాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.

మంచి ఫలితాల కోసం ఈ పదార్థం రెండు వారలకి ఒకసారి వాడాలి.

శిఖాకాయి పొడిని ఆలివ్ నూనె తో కలిపి:

శిఖాకాయి పొడిని ఆలివ్ నూనె తో కలిపి:

ఎలా వాడాలి:

ఒక 1/2 చెంచా శిఖాకాయి పొడిని 2 చెంచాల ఆలివ్ నూనె తో కలపాలి.

ఆ మిశ్రమాన్ని తల మొత్తం రాయాలి.

గోరు వెచ్చని నీళ్లతో కడిగే ముందు ఒక గంట తల మీద ఉండనివ్వాలి.

జుట్టు పెరుగుదల కోసం శిఖాకాయి పొడిని వారానికి ఒకసారి వాడాలి.

English summary

Top Ways To Use Shikakai Powder To Boost Hair Growth

Top Ways To Use Shikakai Powder To Boost Hair Growth,జుట్టు పెరుగుదలకి శీకాకాయ పొడిని వాడే విధానాలు,Shikakai powder is the best-kept Indian secret for long and strong hair. It has been used since centuries for boosting hair growth and also in improving its overall state.This hair care ingredient is rich in pr
Story first published: Sunday, November 5, 2017, 18:00 [IST]