For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న వయస్సులో తెల్ల జుట్టు సమస్యకు ఇంట్లోనే పరిష్కారం..!

By Mallikarjuna
|

ఈ రోజుల్లో 20 ఏళ్ళ వయస్సున్న వారిని గమనించినా వారిలో తెల్ల జుట్టు కనబడుతుంది. గతంలో అయితే తెల్ల జుట్టు కేవలం 50ఏళ్ళు వయస్సు పైబడ్డవారిలోనే చూసే వాళ్ళం కానీ ఇప్పుడు అతి తక్కువ చిన్న వయస్సులో ఈ పరిస్థితిని చూస్తున్నాము. ఈ పరిస్థితినే ప్రీమెచ్యుర్ గ్రేయింగ్ హెయిర్ అని అంటారు.

చిన్న వయస్సులోనే జుట్టు నెరవడానికి అనేక కారణాలున్నాయి. అనారోగ్య కారణాలు, మెలనిన్ కోల్పోవడం, పోషకాహార లోపం, అలవాట్లు, పొల్యూషన్ ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లజుట్టుకు అనే కారణాలున్నాయి. కారణం ఏదైనా తెల్ల జుట్టు కనబడితే వయస్సైన వారిలా అందాన్ని తగ్గించి పూపుతుంది. ప్రస్తుత ఉన్న వయస్సు కంటే ఇంకా తగ్గించి చూపుతుంది.

remedies for premature greying of hair

ఇలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతుంటే కనుక, వెంటనే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. చిన్న వయస్సులో తెల్ల జుట్టు సమస్యలను నివారించుకోవడానికి కొన్ని ప్రభావిత హోం రెమెడీస్ బోల్డ్ స్కై ఈ రోజు మీముందు ఉంచుతోంది. ఇది మీలో తెల్ల జుట్టు నివారించడానికి సహాయపడుతాయి. ఆలస్యం చేయకుండా ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుని, ఇక ముందు తెల్ల జుట్టు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ఈ హోం రెమెడీస్ జుట్టుకు పోషణ ఇస్తుంది మరియు జుట్టు తెల్లగా మారకుండా మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది. బ్యూటీ స్టోర్స్ లో హెయిర్ డైలు కొని తెచ్చుకోవడానికి కంటే ముందు ఈ సింపుల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించి చూడండి..

తెల్ల జుట్టును నివారించడానికి హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా..

గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్ గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

1. ఆమ్లా

1. ఆమ్లా

ఆమ్లా (ఉసిరికాయ)ఒక పురాతన హోం రెమెడీ. అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, అలాగే మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఎలా ఉపయోగించాలి:

2-3 టేబుల్ స్పూన్ల ఆమ్లా నూనెను తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి . ఒక గంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. తలకు గోరువెచ్చని నీళ్ళు మాత్రమే ఉపయోగించాలి. వారంలో కనీసం 2-3సార్లు ఇలా చేస్తే తెల్ల జుట్టు శాశ్వతంగా దూరం అవుతుంది.

2. హెన్నా

2. హెన్నా

గోరింటాకు న్యాచురల్ హెయిర్ డైలా పనిచేస్తుంది. హెన్నా జుట్టు మొదళ్ళ నుండి సమస్యను నివారిస్తుంది. ఇంకా జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

ఎలా ఉపయోగించాలి:

హెన్నా ప్యాక్ ను తయారుచేసుకుని తలకు పూర్తిగా అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయాలి.

3. సేజ్ లీవ్స్

3. సేజ్ లీవ్స్

ఎలా ఉపయోగించాలి:

కొన్ని సేజ్ లీవ్స్ ను కొబ్బరి నూనెలో వేసి బాయిల్ చేయాలి. తర్వాత వడగట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతి వేళ్ళతో తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 25 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఉత్తమ ఫలితాలకోసం తిరిగి ఇదే ప్రొసెస్ ను మూడు రోజులకొకసారి రిపీట్ చేయాలి.

4. చామంతి టీ:

4. చామంతి టీ:

జుట్టును నల్లగా మార్చడంలో చామంతి టీ గ్రేట్ రెమెడీ,. అంతే కాదు ఇది జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. తెల్ల జుట్టును క్రమంగా తగ్గిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

షాపంు చేసిన తర్వాత చామంతీ టీ డికాషన్ ను తలారా పోసుకోవాలి. ఇందులో పంచదార కలపకూడదు. చామంతి టీని తలకు పోసుకున్న అరగంట తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్రొసెస్ ను వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. బంగాళదుంప తొక్క

5. బంగాళదుంప తొక్క

బంగాళదుంపలో స్ట్రార్చ్ అధికంగా ఉంటుంది, ఇది జుట్టు సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. .

ఎలా ఉపయోగించాలి:

ఒక గిన్నెలో బంగాళదుంపల తొక్కలను వేసి 5 నిముషాలు ఉడికించాలి. తర్వాత స్టౌ మీద నుండి క్రిందికి దింపి, చల్లారనివ్వాలి, ఈ నీటిని తలకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

చిన్నవయస్సులోనే జుట్టు నెరవడానికి కారణమేమి? చిన్నవయస్సులోనే జుట్టు నెరవడానికి కారణమేమి?

6. బ్లాక్ టీ :

6. బ్లాక్ టీ :

బ్లాక్ జుట్టు పోషణకు గ్రేట్ రెమెడీ,తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఇంకా, జుట్టుకు పోషణను అందిస్తుంది, గ్లాసీ లుక్ ను ఇస్తుంది

ఎలా ఉపయోగించాలి:

పంచదార కలపని బ్లాక్ టీని తలకు పూర్తిగా అప్లై చేయాలి. అరగంట తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి.

7. కరివేపాకు:

7. కరివేపాకు:

తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో మరో ఎక్సలెంట్ రెమెడీ కరివేపాకు, ఇది మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తెల్లజుట్టును నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

గుప్పెడు కరివేపుకును ఆలివ్ ఆయిల్లో వేసి తక్కువ మంట మీద 5 నిముషాలు వేడి చేయాలి. గోరువెచ్చగా చల్లారిన తర్వాత తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

8. ఉల్లిపాయ రసం:

8. ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసంలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్ తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తలకు ఉపయోగిస్తుంటే, తెల్ల జుట్టు సమస్యతో పాటు ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

రెగ్యులర్ గా చేసినట్లే తలస్నానం చేయాలి. తలకు ఫ్రెష్ ఆనియర్ జ్యూస్ ను అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Treat Premature Greying Of Hair By Using These Home Remedies

Natural remedies are the best to cure premature greying of hair. Read to know more about the ingredients that help to reduce greying of hair.
Desktop Bottom Promotion