తలలో పొట్టు రాలుతోంది, ఐతే ఈ నూనెలు వాడండి..

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఫ్లాకీ చర్మం అనేది అత్యంత సాధారణమైన మరియు అసహ్యకరమైన పరిస్థితి, చికిత్స చేయకుండా వదిలేస్తే మీ చర్మం మరియు జుట్టుకు దెబ్బతినవచ్చు.

ఈ వికారమైన పరిస్థితిలో ఫ్లక్స్ రాలిపోవడం మరియు చర్మం దురదగా ఉండటం అనేవి రెండు అత్యంత సాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు.ఇది ముఖ్యంగా పొడి చర్మం కలిగిన వ్యక్తుల మీద సాధారణంగా ప్రభావితం చేస్తుంది. కారణం సంబంధం లేకుండా, ఈ సమస్యను వెంటనే పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. చికిత్స చేయకుండా వదిలివేయడం వలన జుట్టు నష్టపోవడం, చివరనస్ప్లిట్ రావడం, మొదలైన ఇతర అసహ్యకరమైన పరిస్థితులకు దారి తీయవచ్చు.

use-these-essential-oils-to-treat-flaky-scalp

అదృష్టవశాత్తూ, మీ చర్మం ఆరోగ్యంగా మరియు పొరలు లేకుండా ఉంచడం మీరు చేయగలిగిన పని. మీ జుట్టు సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన నూనెలు ఉంటాయి.

నేడు బోల్ద్స్కీ లో, మేము కొన్ని స్కాల్ప్ కి ఉపయోగపడే ఎసెన్షియల్ నూనెలను మరియు మీరు ఈ పరిస్థితి నుండి సులభముగా బయటపడటానికి ఈ ఆయిల్స్ ని ఉపయోగించే విధానాన్ని మీతో షేర్చేయడం జరిగింది.మరి అవేంటో ఇక్కడ చదివి తెలుసుకోండి.

జుట్టుకు, చర్మానికి బాదం ఆయిల్..!! అద్భుతమైన ప్రయోజనాలు..!

గమనిక: ఇది మీ తలపై అంతా అప్లై చేయడానికి ముందే మీరు దీనిని టెస్ట్ చేసి వాడాల్సి ఉందని తెలియయజేస్తున్నాము.

1. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్

1. టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్

ఇందులోయాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా, టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ సహజమైన ఆయిల్ ఉత్పత్తిని బాలన్స్ చేయగల లక్షణాన్ని కలిగివుంది. కొబ్బరి నూనె వంటి ఫ్రెండ్లీ ఆయిల్ క్యారియర్ నూనెతో ఈ ఎసెన్షియల్ ఆయిల్ ని కొన్ని చుక్కలను కలపండి మరియు మీ చర్మం ప్రభావితమైన ప్రాంతంలో దీనిని అప్లై చేసి ప్రమాదాన్ని తగ్గించండి. ఆరోగ్యకరమైన స్కాల్ప్ మరియు లాక్ ని పొందడానికి దీనిని వారానికొకసారి మీ ఇంటివద్దనే ప్రయత్నించండి.

2. థైమ్ ఎసెన్షియల్ ఆయిల్

2. థైమ్ ఎసెన్షియల్ ఆయిల్

ఈ ఎసెన్షియల్ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇది స్కాల్ప్ కి సరైన,ప్రభావంతమైనదిగా భావిస్తారు. కేవలం దీనిని ఆలివ్ నూనె వంటి క్యారియర్ నూనెతో కలిపి వాడండి మరియు ఫలితంగా మీ స్కాల్ప్ కి చికిత్స చేయండి. మంచి ఫలితాల కోసం ఈ సమస్యను అధిగమించడానికి ఈ రెమెడియల్ బ్లెండ్ను వారానికి ఒకసారి తప్పకుండా ప్రయత్నించి చూడండి.

3. బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్

3. బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్

బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్ మీ స్కాల్ప్ లో ఒక స్మూత్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ని రెగ్యులర్ గా ఉపయోగించడం వలన ఫ్లాకీ చర్మం పోవడమే కాకుండా అది మల్లి పునరావృతం కాకుండా కాపాడవుతుంది.ఈ ఎసెన్షియల్ ఆయిల్ మరియు ఒక క్యారియర్ నూనె తో కలిపి సిద్ధం చేసుకోండి. ఇది స్కాల్ప్ కి అప్లై చేసి మరియు 15 నిమిషాలు ఉంచి తర్వాత కడిగేయండి. తక్షణ ఫలితాలను పొందటానికి నెలకు రెండుసార్లు ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి.

జుట్టుకి ఆయిల్ రాత్రంతా ఉండాలా ? గంటసేపు సరిపోతుందా ?

4. చమోమిలే ఎసెన్షియల్ ఆయిల్

4. చమోమిలే ఎసెన్షియల్ ఆయిల్

ఇది ఇన్ఫ్లమేటరీ ఎజెంట్ యొక్క గొప్ప మూలం గా చెప్పవచ్చు. చమోమిలే ఎసెన్షియల్ ఆయిల్ మీ స్కాల్ప్ యొక్క ఫ్లాకినెస్ మరియు దురదని పోగొడుతుంది.ఈ ఎసెన్షియల్ ఆయిల్ ను ఒక క్యారియర్ లేదా కలబంద జెల్తో కలిపి మీ స్కాల్ప్ కి అప్లై చేయండి. కావలసిన ఫలితాలను పొందడానికి ప్రతి వారం తప్పకుండా ఈ చికిత్సను ఉపయోగించుకోండి.

5. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

5. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మీ చర్మం లో రక్త ప్రవాహాన్ని చైతన్య పరుస్తుంది మరియు కూడా అది ఫ్లాకినెస్ ని వదిలించుకోవటం లో సహాయపడే బహుళ ప్రయోజన మార్గాలలో ముఖ్యమైన నూనె గా ప్రశంసించారు. ఈ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ని తేనె లేదా కొబ్బరి నూనె మిశ్రమం తో కలపాలి. మీ సమస్యాత్మక స్కాల్ప్ ప్రాంతంలో దీనిని అప్లై చేసి మరియు 15 నిముషాల తరువాత శుభ్రం చేయాలి. మీ చర్మం ఫ్లేక్ రహితంగా ఉండటానికి సహాయం చేయడానికి ఈ-గృహ చికిత్సను ప్రయత్నించండి.

6. క్లారీ సేజ్ ఎస్సెన్షియల్ ఆయిల్

6. క్లారీ సేజ్ ఎస్సెన్షియల్ ఆయిల్

ఎస్సెన్షియల్ ఆయిల్ మీ చర్మం లో సహజ నూనెలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మరియు ఆ ప్రాంతంలో ఫ్లేక్ రహిత చికిత్సను చేయవచ్చు. ఆలివ్ నూనె తో ఈ ఎస్సెన్షియల్ ఆయిల్ ని కొన్ని చుక్కలని కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ప్ కి అప్లై చేసి ఒక 15 నిముషాలు ఉంచి తర్వాత కడిగేయండి. మంచి ఫలితాలని పొందడానికి ఈ ఇంట్లో తయారు చేసుకున్న కంపోసిషన్ ని క్రమం తప్పకుండా వారానికొకసారి అప్లై చేయాలి.

7. ప్యాచ్యులి ఎసెన్షియల్ ఆయిల్

7. ప్యాచ్యులి ఎసెన్షియల్ ఆయిల్

ఇది చాలా ముఖ్యమైన నూనె. ఇది పొరల స్కాల్ప్ చికిత్స కోసం ఉపయోగించబడుతుంది. ఇది అన్ని రకాల వెంట్రుకల వారు ఉపయోగించవచ్చు మరియు స్కాల్ప్ ప్రాంతంలో తేమ ప్రభావం కలిగి ఉంటుంది. ప్యాచ్యులి ఎసెన్షియల్ ఆయిల్ ని అలో వేరా జెల్తో కలిపి తయారుచేయండి. దురదనివదిలించుకోవడానికి మీ జుట్టు మీద ఈ మిశ్రమాన్ని ఒక భిన్నమైన పద్ధతిలో ఉపయోగించండి.

8. యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్

8. యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్

మీ స్కాల్ప్ ఫ్లేక్-ఫ్రీ మరియు ఆరోగ్యకరమైనదిగా మారడానికి ఇది మరొక గొప్ప ఎసెన్షియల్ ఆయిల్. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ని ఆలివ్ నూనె లేదా తేనె మరియు కొబ్బరినూనెలతో కలిపి తయారుచేసుకోవాలి. మీరు మంచి ఫలితాల కోసం ఫ్లాకీ చర్మం వదిలించుకోవడానికి ఈ ఎసెన్షియల్ ఆయిల్ ని నెలలో మూడు సార్లు ఉపయోగించవచ్చు.

9. రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్

9. రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్

రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్ చుండ్రు, ఫ్లేక్ వంటి పలు చర్మపు సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన పరిహారం. ఫ్లేక్ ని తొలగించడానికి, మీరు ఈ నూనె ను ఆలివ్ నూనె మిశ్రమం తో కలిపి మీ జుట్టు కి చికిత్స చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యకరమైన స్కాల్ప్ ని పొందడానికి ఈ అద్భుతమైన నూనెను నెలకు రెండుసార్లు ఉపయోగించుకోండి.

 10. య్లాంగ్ య్లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్

10. య్లాంగ్ య్లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్

ఇది ప్రకృతిలో యాంటిసెప్టిక్ గా పిలవబడుతుంది.య్లాంగ్ య్లాంగ్ ఎసెన్షియల్ ఆయిల్ తరచుగా ఫ్లాకీ చర్మం వంటి జుట్టు సంబంధిత సమస్యలు చికిత్సకు ఉపయోగిస్తారు.కేవలం క్యారియర్ నూనెతో ఈ ముఖ్యమైన నూనె యొక్క 3-4 చుక్కలని కలపండి మరియు మీ స్కాల్ప్ లో వచ్చే దురదని దూరం చేసుకోండి. ఈ చికిత్స ని ఫ్లాకీ స్కాల్ప్ సమస్య వదిలించుకోవటం కోసం నెలకు రెండుసార్లు ప్రయత్నించవచ్చు.

English summary

use-these-essential-oils-to-treat-flaky-scalp

use-these-essential-oils-to-treat-flaky-scalp,Using certain oils can actually help to treat flaky scalp. So read to know which are the oils that can treat
Story first published: Wednesday, November 1, 2017, 12:00 [IST]
Subscribe Newsletter