For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యాచురల్ గా అప్పర్ లిప్ హెయిర్ తొలగించే సింపుల్ చిట్కాలు

|

పెదాలు అందంగా ఉంటే, ఆ ముఖ సౌందర్యం మరింత అందంగా కనిపిస్తుంది. అదే పైపెదవి మీద సన్నని మీసం లాంటి హెయిర్ ఉన్నట్లైతే, అవి బయటకు కనబడుతుంటే, ఆ పెదాలకు లిప్ స్టిక్ వేసినా, అందవిహీనంగా మారిపోతుంది. అందమైన ముఖంలో పెదాల మీద సన్నగా వెంట్రుకలు కనబడుట వల్ల పురుషులవలే కనబడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం వివిధ రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. అప్పర్ లిప్ హెయిర్ అనేది చాలా మంది మహిళల్లో ఒక సాధారణ సమస్యగా మారింది. కాబట్టి, ఎట్టువంటి నొప్పి లేకుండా నేచురల్ గా అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించడం ఎలా? ఈ సమస్య నుండి ఎలాంటి నొప్పి లేకుండా...ఖరీదైన ప్రొడక్ట్స్ ఉపయోగించకుండా అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి హోం రెమెడీస్ ను సరైన సమయంలో సరైన పద్దతిలో ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందువల్ల, ఈ క్రింద తెలిపిన వివిధ రకాల టిప్స్ ద్వారా అప్పర్ లిప్ హెయిర్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ టిప్స్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తే, అప్పర్ లిప్ హెయిర్ ను చాలా సున్నితంగా తొలగించుకోవచ్చు .

అప్పర్ లిప్ హెయిర్

హార్మోనులు లేదా జన్యుసంబంధిత లేదా ఈ రెండిటి కాంబినేషన్ వల్ల కూడా మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి ముఖ్య కారణాలు. సాధారణంగా 5-10శాతం మహిళల్లో ఈ సమస్య ఉంటుంది. అయితే వీటి మీద పరిశోధనలు కూడా జరుపుతున్నారు కానీ, ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి, మనం నేచురల్ గా మన ఇంట్లో ఉండే వస్తువులతో అవాంఛిత రోమాలను ఎలా తొలగించుకోవాలో చూద్దాం...

పసుపు -గుడ్డు తెల్లసొన:

పసుపు -గుడ్డు తెల్లసొన:

గుడ్డులోని తెల్లసొన మంచి హోం రెమెడీ ఇది అప్పర్ లిప్ హెయిర్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ఇది చర్మంను స్మూత్ చేసి మంచి ఫలితాలను అందిస్తుంది. . ఒక ఎగ్ వైట్ తీసుకొని అందులో ఒక టీస్పూన్ పసుపు చేర్చాలి. ఈ రెడింటిని చేసి స్టిక్కీ పేస్ట్ లా అయిన తర్వాత అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.. మెరుగైన ఫలితం కోసం ఈ థెరఫిని వారంలో రెండు సార్లు వేసుకోవాలి. ఒక నెలలోపు , పెదాల మీద హెయిర్ పెరగకుండా నివారించబడుతుంది

పెరుగు, పసుపు, శెనగపిండి:

పెరుగు, పసుపు, శెనగపిండి:

ఈ రెమెడీ రెండు విధాలుగా పనిచేస్తుంది. అప్పర్ హెయిర్ రిమూవ్ చేస్తుంది. అదేవిధంగా ఆ ప్రదేశంలో చర్మం తెల్లగా మార్చుతుంది. అందుకోసం రెండు స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల పసుపు తీసుకోవాలి. అందులోనే 2 టీస్పూన్ల శెనగపిండిని మిక్స్ చేయాలి. ఈ మూడు పదార్థాలను మిక్స్ చేసి అప్పర్ లిప్ మీద అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత మర్ధన చేసి డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కార్న్ ఫ్లోర్ అండ్ మిల్క్ :

కార్న్ ఫ్లోర్ అండ్ మిల్క్ :

ఈ బేసిక్ అండ్ సింపుల్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా అప్పర్ లిప్ హెయిర్ ను తొలగిస్తుంది.

అందుకోసం అరటీస్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని, అరకప్పు పాలలో వేసి మిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసిన తర్వాత అప్పర్ లిప్ మీద ప్యాక్ వేయాలి. డ్రైగా మారిన 20 నిముషాల తర్వాత మాస్క్ తొలగించి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పొటాటో జ్యూస్ :

పొటాటో జ్యూస్ :

పొటాటో జ్యూస్ చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి తర్వాత శుభ్రం చేస్తుంది. ఫలితంగా అప్పర్ లిప్ హెయిర్ ను తొలగించుకోవచ్చు. అందుకోసం రెండు టేబుల్ స్పూన్ల పెసరపిండి, ఒక బంగాళదుంప, ఒక టీస్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, వాటర్ తీసుకుని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదాల మీద అప్లై చేయాలి. పూర్తిగా డ్రైగా మారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

తేనె మరియు నిమ్మరసం:

తేనె మరియు నిమ్మరసం:

తేనె వాక్స్ లా పనిచేస్తుంది. అప్పర్ లిప్ మీద సన్నని హెయిర్ ను తొలగిస్తుంది. నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. నల్లగా ఉన్న చర్మంను తెల్లగా మార్చుతుంది. అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుని అందులో అరటేబుల్ స్పూన్ నిమ్మరసం జోడించాలి. ఈ మిశ్రమాన్ని పెదాల మీద అప్లై చేసి డ్రైగా మారిన తర్వాత తడి బట్టతో తుడిచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలను రెగ్యులర్ గా పాటిస్తుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది.

English summary

Ways To Remove Upper Lip Hair Naturally in Telugu

Ways To Remove Upper Lip Hair Naturally, While body hair can be managed in a number of ways, one part that needs special attention is, upper lip. Upper lip hair can easily drown your other facial features.
Story first published: Thursday, June 15, 2017, 17:40 [IST]
Desktop Bottom Promotion