ఆపిల్ సైడర్ వెనిగర్ తో నిగనిగలాడే జుట్టును పొందే విధానాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

నిగనిగలాడే జుట్టు మీ అందాన్ని పెంచి మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.అదే, నిస్తేజంగా మరియు జీవం లేని జుట్టు మీ ఆకారాన్ని కూడా పాడుచేస్తుంది.

అందరు అమ్మాయిలలో ఇప్పుడు సహజంగా ఉన్న జుట్టు సమస్య ఇది.అందుకే ఇప్పుడు అన్ని మార్కెట్లలో లెక్కలేనన్ని జుట్టుని మెరిసేలా చేసే ఉత్పత్తులు ఉన్నాయి.

రాత్రిపూట జుట్టు విషయంలో ఎప్పటికీ చేయకూడని పొరపాట్లు..!!

జుట్టుని మెరిసేలా చేసే వాణిజ్య ఉత్పత్తులకి డిమాండ్ ఉందని ఒప్పుకుంటున్నపట్టికీ, వాటిల్లో పలురకాల రసాయనాలు కలుపుతారనేది ఒప్పుకోవాల్సిన నిజం.మీకు, మీ జుట్టుని ఆ రసాయన ఉత్త్పత్తులతో తడపడం ఏ మాత్రం ఇష్టం లేకున్నా ప్రాకృతిక పదార్థాలకు మారిపోవాలి.

జుట్టుకి అందాన్ని, మెరుపుని ఇవ్వడానికి చాలా పదార్థాలు వాడచ్చు, కానీ అందం విషయంలో చాలా ప్రజాదరణ పొందింది ఆపిల్ సైడర్ వెనిగర్.

ఈ పధార్థం, నిస్తేజంగా మరియు పాడైపోయిన జుట్టుని అధ్బుతంగా మార్చే ఎసిటిక్ యాసిడ్ వంటి జుట్టుని బాగుచేసే వివిధ మూలకాలకు నెలవు.అందుకనే నిగనిగలాడే జుట్టు కోసం , దీన్ని మీ రోజూ బ్యూటీ దినచర్య లో భాగం చేయండి.

కొలాజెన్ ఫుడ్స్ తో నిగనిగలాడే చర్మ సౌందర్యం సొంతం

ఇక్కడ ఆపిల్ సైడర్ వెనిగర్ ని వాడి సహజంగా మెరిసే జుట్టు పొందటం కోసం కొన్ని పద్ధతుల్ని రాశాం, చూడండి.

1) ఆపిల్ సైడర్ వెనిగర్ + మయోన్నైస్

1) ఆపిల్ సైడర్ వెనిగర్ + మయోన్నైస్

1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని, రెండు చెంచాల మయోన్నైస్ తో కలపాలి. ఆ క్రీము లాంటి పధార్థాన్ని మీ జుట్టు మీద రాయండి.షాంపూ తో తల స్నానం చేసే 20-25 నిమిషాల ముందు వరకు ఉంచండి.మృదువైన, మెరుపైన జుట్టు కోసం ఈ మిశ్రమం తో నెలకొకసారి చికిత్స చేయండి .

2) ఆపిల్ సైడర్ వెనిగర్ + తెల్ల గుడ్డు సొన

2) ఆపిల్ సైడర్ వెనిగర్ + తెల్ల గుడ్డు సొన

1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని, రెండు చెంచాల తెల్ల గుడ్డు సొనతో కలపాలి. ఆ పదార్థాన్ని మీ జుట్టు మీద ఒక 15 నిమిషాలు ఉండనివ్వండి.తరువాత గోరు వెచ్చని నీళ్ళతో మరియు షాంపూ తో కడిగేయాలి. నిగనిగలాడే కురుల కోసం ఈ ప్రక్రియని నెలకొకసారి చేయాలి.

3) ఆపిల్ సైడర్ వెనిగర్ + నిమ్మ రసం

3) ఆపిల్ సైడర్ వెనిగర్ + నిమ్మ రసం

1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని, రెండు చెంచాల నిమ్మరసం తో కలపాలి. ఆ మిశ్రమాన్ని కుదుళ్ళకు తాకేలా రాసి షాంపూ మరియు గోరు వెచ్చని నీళ్ళు తో కడిగే ముందు ఒక 15 నిమిషాల దాకా ఉంచాలి.ఇలా ప్రతి రోజూ చేస్తే మెరిసే జుట్టు మీ సొంతం.

4) ఆపిల్ సైడర్ వెనిగర్ + కొబ్బరి నూనె

4) ఆపిల్ సైడర్ వెనిగర్ + కొబ్బరి నూనె

1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని, రెండు చెంచాల కొబ్బరి నూనె తో కలపాలి.ఆ మిశ్రమాన్ని తల మొత్తం పట్టించాలి.ఒక 20 నిమిషాలు ఎండనిచ్చి తరువాత షాంపు మరియు గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి.ఇలా ఆపిల్ సైడర్ వెనిగర్ ని తళతళ లాడే జుట్టు కోసం వాడండి.

5) ఆపిల్ సైడర్ వెనిగర్ +అలోవెర

5) ఆపిల్ సైడర్ వెనిగర్ +అలోవెర

1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని, రెండు చెంచాల అలోవెర తో కలపాలి.ఆ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి, గోరు వెచ్చని నీళ్ళతో కడిగే ఒక 15 నిమిషాల ముందు దాక ఉండనివ్వాలి.మెరిసే జుట్టు కోసం, ఈ ఇంట్లో తయరుచేసిన చిట్కా వారానికొకసారి వాడాలి.

6) ఆపిల్ సైడర్ వెనిగర్ + అవోకాడో

6) ఆపిల్ సైడర్ వెనిగర్ + అవోకాడో

అవోకాడోని బాగా మెదిపి ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ తో కలపాలి.ఆ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి, గోరు వెచ్చని నీళ్ళు మరియు షాంపూతో కడిగే ఒక 20 నిమిషాల ముందుదాక ఉండనివ్వాలి.ఈ మిశ్రమాన్ని నెలకొకసారి వాడితే నమ్మశక్యం కాని ఫలితాలు వస్తాయి.

7) ఆపిల్ సైడర్ వెనిగర్ + జెలటిన్

7) ఆపిల్ సైడర్ వెనిగర్ + జెలటిన్

1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని, 1 చెంచా జెలటిన్ తో కలపాలి.ఆ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి, గోరు వెచ్చని నీళ్ళు మరియు షాంపూతో కడిగే ఒక 15 నిమిషాల ముందు దాక ఉండనివ్వాలి. నెలకొకసారి వాడి మంచి మెరిసే జుట్టు ని పొందండి.

8) ఆపిల్ సైడర్ వెనిగర్ + పెరుగు

8) ఆపిల్ సైడర్ వెనిగర్ + పెరుగు

1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ని, 3 చెంచాల పెరుగు తో కలపాలి.ఆ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించాలి.అది మీ జుట్టు మీద అధ్భుతాలు చేసే వరకు సమయం ఇచ్చి గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయండి.ఈ ఇంటి చిట్కా మీ జుట్టుని నిగనిగలాడేలా మరియు అందంగా తయారు చేస్తుంది.

9) ఆపిల్ సైడర్ వెనిగర్ + అరటిపండు

9) ఆపిల్ సైడర్ వెనిగర్ + అరటిపండు

పండిన అరటిపండుని బాగ చిదిపి ఒక 1/2 చెంచా ఆపిల్ సిడేర్ వినేగర్ తో కలపాలి. ఆ మిశ్రమాన్ని తల మొత్తం రాసి, గోరు వెచ్చని నీళ్ళతో కడిగే ముందు 20 నిమిషాల వరకు ఉంచాలి.మీ నిస్తేజమైన జుట్టుకి ఈ మిశ్రమం వాడి కోరిన జుట్టు ని పొందండి.

10) ఆపిల్ సైడర్ వెనిగర్ + తేనె

10) ఆపిల్ సైడర్ వెనిగర్ + తేనె

3 చెంచాల తేనె ని 1/2 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ తో కలపాలి.ఈ వచ్చిన మిశ్రమాన్ని తల మొత్తం పట్టించి ఒక 20 నిమిషాలు ఎండనివ్వాలి.అది అయిపోయాక, మీ జుట్టుని షాంపూ మరియు గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయచ్చు.ఈ పదార్థాన్ని రెండు వారలకి ఒక సారి వాడి సెలబ్రిటీల లాంటి జుట్టు పొందండి.

English summary

Ways To Get Glossy Hair With Apple Cider Vinegar

Using apple cider vinegar can actually make your hair look glossy naturally. Read to know the different ways you can use apple cider vinegar for hair.