For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ శీతాకాలంలో చుండ్రుని తొలగించడానికి మార్గాలు

  By Ashwini Pappireddy
  |

  ఈ శీతాకాలంలో చుండ్రుని తొలగించడానికి మార్గాలు. ఈ సంవత్సరం అన్ని విధాలుగా వింటర్ సిద్ధంగా ఉంది. మరి మీరు సీజన్ కి అనుగుణంగా అన్ని విధాలుగా రెడీ గా వున్నారా? సమాధానం తప్పనిసరిగా "అవును" అయి ఉండాలి, ఎందుకంటే పర్యావరణానికి అనుగుణంగా మానవ శరీరం మార్పు చెందుతుందని చాలా మందికి తెలియదు. కానీ శీతాకాలంలో ముఖ్యంగా మన జుట్టు యొక్క పరిస్థితికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

  శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు..!

  Ways To Tackle Dandruff This Winter

  చుట్టూ వున్న గాలిలో తేమ తక్కువగా ఉండటం వలన మీ స్కాల్ప్ బట్టతలాగా మారడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇది ఇంకా చుండ్రు మరియు దురదకి దారితీస్తుంది. శీతాకాలంలో చర్మ సంరక్షణ మాత్రమే కాదు, జుట్టుకు సంరక్షణ కూడా చాలా అవసరం. శీతాకాలంలో చర్మం పగుళ్ళు ఏర్పడినట్లు గానే తలలో కూడా హ్యుమిడిటి ఎక్కవై జుట్టు తేమగా ఉండటం వల్ల ఫంగస్, బ్యాక్టీరియా చేరడం వల్ల చుండ్రు పెరుగుతుంది.

  శీతాకాలంలో చుండ్రును పరిష్కరించడానికి కొన్ని ఉత్తమ మార్గాలు ఉన్నాయి. చుండ్రు ఎక్కువైన సందర్భాల్లో దుస్తుల మీద, మీ భుజాలపై రాలడాన్ని కూడా మీరు గమనించవవచ్చు. చుండ్రు సమస్య వల్ల తలలో దురద, చీకాకు కలిగిస్తుంది. శీతాకాలంలో చుండ్రు నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్ లో చుండ్రు నివారించడానికి కొన్ని పర్ఫెక్ట్ హోం రెమెడీస్ ఉన్నాయి. శీతాకాలంలో జుట్టు సంరక్షణ చిట్కాల సహాయంతో, ఈ సమస్య ను ఖచ్చితంగా పరిష్కరించవచ్చు.

  జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, వింటర్లో ఖచ్చితంగా చేయకూడని 10 పనులు

  చుండ్రుని అరికట్టడానికి మరియు ఈ శీతాకాలంలో చుండ్రును దూరంగా ఉంచడానికి ఇక్కడ కొన్ని ఉత్తమ మార్గాలు ఉన్నాయి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనె లేదా మీరు ఉపయోగించే ఇతర నూనెల ను ఉపయోగించవచ్చు. వేప, పెరుగు, వెల్లుల్లి, మొదలైనవి సాపేక్షంగా ఈ శీతాకాలంలో చుండ్రును నివారించడానికి ఒక ఉత్తమ మార్గం.మరింత తెలుసుకోవడానికి చదవడం కంటిన్యూ చేయండి.

  హాట్ ఆయిల్ మసాజ్

  హాట్ ఆయిల్ మసాజ్

  చుండ్రు సమస్యతో భాదపడుతున్న ఎవరికైనా పనిచేసే ఉత్తమ ట్రిక్ హాట్ ఆయిల్ తో మసాజ్ చేసుకోవడం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆ నూనె గోరువెచ్చగా ఉండాలి. ఎక్కువ ఒత్తిడిని ఇవ్వకుండా మీ వేళ్ళ కొనతో మీ చర్మంపై నూనెను మసాజ్ చేయండి.చమురు ఒకవేళ చల్లారినట్లైతే దానిని మళ్లీ వేడి చేయండి. ఒక టవల్ తో మీ జుట్టు ,మొత్తం చుట్టుకొని, వీలైతే కాసేపు లేదా రాత్రంతా అలానే వదిలివేయండి. ఒక తేలికపాటి షాంపూ మరియు కండీషనర్ ఉపయోగించి మీ జుట్టుని వాష్ చేయండి. దీనిని వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు చేయవచ్చు.

  టీ ట్రీ ఆయిల్

  టీ ట్రీ ఆయిల్

  టీ ట్రీ ఆయిల్ చలికాలంలో చుండ్రును నివారించడానికి ఒక ఉత్తమమైన మార్గం, టీ ట్రీ ఆయిల్ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించడం అవసరం ఎందుకంటే ఇది అత్యంత ప్రభావవంతమైనది.

  ఏమైనప్పటికీ, దీనిని ఒక్కదానినే డైరెక్ట్ గా ఉపయోగించకూడదు మరియు 1: 2 నిష్పత్తిలో కొబ్బరి నూనె వంటి క్యారియర్ నూనెతో కలిపి వాడాలి. నిద్రపోయే ముందు ఈ ఆయిల్ తో మసాజ్ చేయండి మరియు ఉదయం తేలికపాటి షాంపూ తో కడగండి.

  పెరుగు మరియు నిమ్మకాయ

  పెరుగు మరియు నిమ్మకాయ

  పెరుగు మరియు నిమ్మకాయ నిమ్మరసం యొక్క ఆమ్ల స్వభావం పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది మరియు చుండ్రును తొలగిస్తుంది. పెరుగు జుట్టుకు మృదువైన ఆకృతిని ఇస్తుంది మరియు శీతాకాలంలో అనుసరించడానికి ఒక పరిపూర్ణ జుట్టు సంరక్షణ చిట్కా.

  ఇది ఒక ఆరోగ్యకరమైన స్కాల్ప్ మరియు జుట్టును నిర్వహించడానికి గొప్ప కాంబోగా పనిచేస్తుంది. దీనికి మీరు చేయవలసిందల్లా కేవలం ½ కప్పు పెరుగు లో 5 టీస్పూన్ల నిమ్మ రసంను కలపాలి. 20 నిమిషాల వరకు ఆరబెట్టి మరియు శుభ్రం చేయండి. దీనిని 2-4 రోజుల రెగ్యులర్ వ్యవధిలో కొనసాగించండి.

  వేప

  వేప

  చుండ్రు సమస్యకు వేప మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని వేప ఆకులను రుబ్బి మరియు దానికి ఒక టేబుల్స్పూన్ తేనెను జోడించండి. మీ స్కాల్ప్ మీద మందపాటి పేస్ట్ ని అప్లై చేసుకొని మరియు 20 నిముషాల పాటు ఉండనివ్వండి.తరువాత సాధారణ నీటితో దానిని కడిగేయండి. ఒక షాంపూ ఉపయోగించి తర్వాత వేప నీటితో మీ జుట్టును శుభ్రం చేయడం సులభమైన మార్గం.

  వెనిగర్

  వెనిగర్

  దురదగా వున్న స్కాల్ప్ కి వెనిగర్ ని వుపయోగించి చికిత్స చేయవచ్చు. ఈ ప్రయోజనం కోసం తెల్ల వెనీగర్ లేదా ఆపిల్ సైడర్ వెనీగర్ను ఉపయోగించవచ్చు. దీనికోసం మీరు వెనిగర్ ని నీటి తో సమాన పరిమాణంలో కలపండి, దానిని మీ స్కాల్ప్ కి అప్లై చేసి అరగంట తరువాత సాధారణముగా కడగాలి.

  వింటర్ హెయిర్ కేర్ టిప్స్ అండ్ ట్రీట్మెంట్

  కలబంద

  కలబంద

  విస్తృతమైన ఔషధ లక్షణాలను ఈ కలబంద తలపై స్మూతినింగ్ ప్రభావాన్ని ఇస్తుంది. కలబంద ఆకు నుండి రా జెల్ను తీసుకోండి మరియు స్కాల్ప్ మొత్తం అప్లై చేయండి.

  కొంత సమయం వరకు దానిని వదిలివేయండి మరియు ఒక మెడికేటెడ్ షాంపూతో శుభ్రం చేయండి. చలికాలంలో చుండ్రును అధిగమించడానికి ఇది ఉత్తమ మార్గం, ఇది మంటను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

  వెల్లుల్లి

  వెల్లుల్లి

  మీరు వెల్లుల్లి నుండి వచ్చే వాసన వలన దానిని మీరు నిరాకరించవచ్చు. కానీ అది యాంటీ ఫంగల్ అని తెలుసా మరియు ఇది చుండ్రును ఎలా నయం చేయగలదు?

  రెండు లేదా మూడు వెల్లుల్లి పాయాలని తీసుకొని బాగా పేస్ట్ లాగా చేసి, వాసనను పోగొట్టడానికి దానికి తగినంత లేదా ఒక టీస్పూన్ తేనెను జత చేయండి. ఇలా కలిపిన ఆ పేస్ట్ ని స్కాల్ప్ మొత్తం అప్లై చేయాలి మరియు తరువాత కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం అప్పుడప్పుడూ పునరావృతం చేయండి.

  థైమ్

  థైమ్

  థైమ్ అంటువ్యాధులతో ఒక గొప్ప మార్గం లో పోరాడుతుంది. 4 ఎండిన థైమ్ ఆకులు మరియు 2 కప్పుల నీటిని కలపి బాగా వేడి చేయండి. నీటిని సగానికి తగ్గించేంత వరకు మీరు దాన్ని వేయించాలి.తడిగా వున్న స్కాల్ప్ పై కంకషన్ ఉపయోగించండి. మీరు దానిని కాసేపు వదిలేసి కాసేపు తరువాత కేవలం సాదా నీటితో శుభ్రం చేసుకోవచ్చు.

  English summary

  Ways To Tackle Dandruff This Winter

  There are certain best ways to tackle dandruff this winter. In extreme cases, it might seem like a snowfall on the shoulders too. But with the help of hair care tips during winter, the problem certainly can get solved.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more