జుట్టు పొడిబారడానికి పది కారణాలివే

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

జట్టు పొడిబారిన, కాస్త ఎండిపోయినట్లు కనిపించినా దాంతో వేగడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే. ఇది పాడైనట్టు కన్పించడమే కాక, ఇలాంటి జుట్టుతో హెయిర్ స్టైల్స్ కూడా కష్టమే. స్ట్రెయిట్ లేదా రింగులు ఏదైనా మీ వెంట్రుకలు పొడిగా ఉంటే మొత్తం మీ జుట్టు అందాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యను చాలామంది యువతులు ఎదుర్కొంటూనే ఉన్నారు.

జుట్టు తేమ లేకుండా పొడిబారినట్లు ఎందుకు మారుతుందనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీంతో మీరు దాన్ని మెరుగ్గా బాగుచేయగలరు. పొగిబారిన జుట్టుకు ముఖ్యంగా పది కారణాలుంటాయి. అందులో మీ కారణం ఏమిటో కనుక్కుని మళ్ళీ మీ జుట్టును ఆరోగ్యంగా, మెత్తగా, మృదువుగా మార్చుకోండి.

1. ఆరోగ్యపరమైన సమస్యలు

1. ఆరోగ్యపరమైన సమస్యలు

మీ జుట్టు స్థితి మీలో అనారోగ్యాన్ని సూచిస్తుండవచ్చు. నిపుణులు కొన్ని ఈటింగ్ డిజార్డర్స్ తో బాధపడేవాళ్ళు, హైపోథైరాయిడిజమ్ వంటి వాటితో బాధపడేవారు పొడి జుట్టు బారిన పడతారు.

2. వేడితో స్టైల్ చేసే పరికరాల అధిక వాడకం

2. వేడితో స్టైల్ చేసే పరికరాల అధిక వాడకం

వేడితొ స్టైల్ చేసే పరికరాలు వాడడం వల్ల కూడా జుట్టు పొడిగా మారుతుంది. అంటే స్టెయిట్నర్స్ ,కర్లింగ్ ఐరన్స్ మొదలైనవి క్రమం తప్పకుండా వాడటం వలన మీ జుట్టులో తేమను హరించి పొడి మరియు పగిలిపోయేలా చేస్తాయి. వీటి వాడకం తగ్గించండి లేదా హీట్ ప్రొటెక్టంట్ స్ప్రే వాడి జుట్టును డ్యామేజీ నుండి కాపాడుకోండి.

3. రసాయనాలు కలసిన ఉత్పత్తుల వాడకం

3. రసాయనాలు కలసిన ఉత్పత్తుల వాడకం

రసాయనాలు కలిసున్న జుట్టు సంరక్షణ ఉత్పత్తులు వాడటం వల్ల కూడా జుట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అవి మీ జుట్టుపాయలను ఎండిపోయినట్టుగా, పొడిబారినట్లుగా తయారు చేస్తాయి. అలాగే జుట్టు ఎక్కువగా ఊడిపోయే అవకాశం కూడా ఉంది.

4. నూనె రాసుకోకపోవటం

4. నూనె రాసుకోకపోవటం

మీ జుట్టుకి నూనె రాసుకోవటం వల్ల కూడా జుట్టు పొడిబారుతుంది. సహజ నూనెలైన కొబ్బరినూనె మరియు ఆలివ్ నూనెలో అనేక పోషకాలు, విటమిన్లుండి మీ జుట్టును ఆరోగ్యంగా, తేమగా, మెత్తగా ఉంచుతాయి.

5.వాతావరణ కారణాలు

5.వాతావరణ కారణాలు

కొన్ని పర్యావరణ కారణాలు కూడా మీ జుట్టు కుదుళ్ళను పాడుచేసి , వెంట్రుకలను పొడిగా పగిలిపోయేలా చేస్తాయి. సూర్యకిరణాల ప్రభావం, కలుషితమైన గాలి మొదలైనవి మీ జుట్టు పొడిగా మారేందుకు కారణం అవుతాయి.

6. అలా స్నానం చేయడం వల్ల

6. అలా స్నానం చేయడం వల్ల

స్నానం ఒక్కొక్కరు ఒక్కోరకంగా చేస్తారు. మీరు స్నానం చేసే తీరు కూడా మీ జుట్టుపై ప్రభావం చూపుతుంది. మీ జుట్టును వేడినీరుతో కడగటం లేదా షాంపూను అలా తలపై ఎక్కువసేపు వదిలేయటం వల్ల జుట్లు పొడిగా మారుతుంది. మీ జుట్టును గోరువెచ్చని నీరుతో కడిగి షాంపూను ఎక్కువసేపు ఉంచుకోకండి.

7. రసాయన ట్రీట్మెంట్లు

7. రసాయన ట్రీట్మెంట్లు

క్రమం తప్పకుండా జుట్టుకి రంగులు వాడటం కూడా జుట్టును పాడుచేస్తుంది. దీనివల్ల మీ జుట్టు పొడిగా, పగిలిపోయినట్లుగా కన్పించేలా చేస్తుంది. ఈ రసాయన ట్రీట్మెంట్లు చూడటానికి అసహ్యంగా ఉండేట్లు జుట్టును మార్చేస్తాయి.

8. ఎక్కువ లేదా తక్కువ కడగటం

8. ఎక్కువ లేదా తక్కువ కడగటం

ఎక్కువగా లేదా తక్కువగా తలను కడగటం కూడా పొడి, పగిలిపోయే జుట్టుకు మరో కారణం. ఎక్కువగా కడగటం వలన సహజమైన నూనెలు, తేమ పోతాయి. మరోవైపు తక్కువ కడగటం వలన మీ జుట్టులో కలుషితాలు,మురికి పెరిగిపోయి మీ జుట్టును పొడిగా పగిలిపోయేట్టు చేస్తుంది.

9. తడి జుట్టుతో పొరపాట్లు

9. తడి జుట్టుతో పొరపాట్లు

స్నానం చేశాక తలతో ఏం చేస్తారన్నదానిపై మీ జుట్టు స్థితి ఆధారపడి వుంటుంది. తడిజుట్టును ముడి ఏదా అదేపనిగా దువ్వటం వలన మీ జుట్టు కుదుళ్ళు పాడయి, తేమ పోయిఎండిపోయి,పగిలిపోయినట్లుగా కన్పిస్తుంది.

10. జుట్టును అదేపనిగా దువ్వటం

10. జుట్టును అదేపనిగా దువ్వటం

ముందు చెప్పిన కారణాలలాగానే, అధికంగా దువ్వటం వలన సహజమైన తేమ పోయి చాలా పొడిగా, పగిలిపోయినట్లు అయిపోతుంది. అదేకాక, జుట్టు ఊడిపోవటం పెరిగి, సన్నబడిపోతుంది. అందుకే రోజుకి రెండుసార్ల కన్నా దువ్వటం మంచిది కాదు.

English summary

10 Common Causes of Hair Breakage

జట్టు పొడిబారిన, కాస్త ఎండిపోయినట్లు కనిపించినా దాంతో వేగడం చాలా కష్టమని అందరికీ తెలిసిందే. ఇది పాడైనట్టు కన్పించడమే కాక, ఇలాంటి జుట్టుతో హెయిర్ స్టైల్స్ కూడా కష్టమే. స్ట్రెయిట్ లేదా రింగులు ఏదైనా మీ వెంట్రుకలు పొడిగా ఉంటే మొత్తం మీ జుట్టు అందాన్ని తగ్గించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యను చాలామంది యువతులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
Story first published: Wednesday, January 17, 2018, 17:30 [IST]
Subscribe Newsletter