For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెనిగర్ తో మీ వెంట్రుకలను బలంగా మార్చుకోవచ్చని తెలుసా...

జుట్టు సంరక్షణ కోసం సూచించదగిన అనేక రకాల సహజ సిద్దమైన పదార్థాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. సరైన అవగాహన ఉన్న నేపధ్యంలో మీ జుట్టు సమస్యలకు మీరే వైద్యునిగా మారగలరు. ఇటువంటి సహజ సిద్దమైన పదార్ధాలలో ఆపిల్ స

|

మన జుట్టు తరచుగా అధికమైన దుమ్ము, ధూళి, సూర్యరశ్మి, మరియు కాలుష్యానికి గురవుతుంటుంది. వీటితో పాటు జీవన శైలి ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు, కూడా సమస్యా కారకాలుగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు కూడా జుట్టు మీద ప్రభావాలను చూపిస్తుంటాయి. ఉదాహరణకు టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ల నుండి కాన్సర్ వరకు ప్రతి ఆరోగ్య సమస్య జుట్టు మీద ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి.

క్రమంగా కొంత కాలానికి జుట్టు ఆరోగ్యం మందగించడం, జీవం కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. తద్వారా జుట్టు బలహీనంగా మారి, దెబ్బతినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫలితంగా కుదుళ్ళు దెబ్బతిని, పొడి జుట్టుకు దారితీస్తుంది. అటువంటి సమస్యల నుండి మన జుట్టును రక్షించుకోవడానికి, కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరిగా ఉంటుంది. గోరువెచ్చని నూనెతో మసాజ్లను అనుసరించడంతోపాటు, జుట్టుకు అవసరమైన పోషకాలను(సప్లిమెంట్స్ లేదా ఆహారం ద్వారా) అందివ్వడం, మరియు సంరక్షణను పాటించే క్రమంలో భాగంగా జుట్టును బలోపేతం చేసే మాస్క్స్ వేయడం, ఆహార జీవన శైలి ప్రణాళికలను అనుసరించడం కూడా తప్పనిసరి.

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair

జుట్టు సంరక్షణ కోసం సూచించదగిన అనేక రకాల సహజ సిద్దమైన పదార్థాలు మనకు అందుబాటులోనే ఉంటాయి. సరైన అవగాహన ఉన్న నేపధ్యంలో మీ జుట్టు సమస్యలకు మీరే వైద్యునిగా మారగలరు. ఇటువంటి సహజ సిద్దమైన పదార్ధాలలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒకటి. పులియబెట్టిన ఆపిల్ రసం నుండి తయారు చేయబడిన ఆపిల్ సైడర్ వెనిగర్ కేవలం ఆహార పదార్దాలలో మాత్రమే కాకుండా, చర్మం మరియు జుట్టు సమస్యలను నివారించడానికి కూడా ఉపయోగించబడే ప్రయోజనాల శ్రేణిని కలిగి ఉంది.

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair

జుట్టు సమస్యల నివారణ కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ మూలంగా చేకూరే ప్రయోజనాలు :
ఆపిల్ సైడర్ వెనిగర్ యొక్క అద్భుతమైన ప్రయోజనాలు మరియు మీ జుట్టు సంరక్షణలో దోహదపడుతుందనడానికి గల ప్రధాన కారణాల జాబితా :

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair
మీ జుట్టు చర్మం యొక్క pH స్థాయిలని నిర్వహిస్తుంది :

మీ చర్మం యొక్క pH బ్యాలెన్స్ను నిర్వహించడానికి ఒక టోనర్ ఉపయోగించడం ఎంత అవసరమో, అదేవిధంగా మీ జుట్టు చర్మం (స్కాల్ప్) భాగాన PH సమతుల్యత కోసం కూడా టోనర్ అవసరం ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ పిహెచ్ బ్యాలెన్స్ను పునరుద్ధరించడానికి మరియు నిర్వహించడానికి సహజ సిద్దమైన టోనర్ వలె పనిచేస్తుంది. అంతేకాకుండా, మీ చర్మం యొక్క సున్నితమైన ఆమ్ల తత్వాలను క్రమబద్దీకరించడానికి మరియు ఆరోగ్యకరంగా పోషకాలతో నింపడానికి కూడా ఇది సహాయపడుతుంది.

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair


జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్ మీ చర్మం తేమను కోల్పోవడాన్ని నిరోధిస్తుంది. తద్వారా మీ జుట్టు యొక్క మూలాలను బలపరచి, ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. క్రమంగా మీ జుట్టుకు సహజ సిద్దమైన నిగారింపు వచ్చేలా ప్రోత్సహిస్తుంది.

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair


జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది :

ఆపిల్ సైడర్ వెనిగర్, మీ జుట్టు మీద పేర్కొన్న మృత చర్మ కణాలను తొలగించి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. క్రమంగా ప్రభావవంతంగా జుట్టు రాలిపోవడాన్ని నిరోధించి, ఎటువంటి నష్టం కలుగకుండా పోషకమయం చేస్తూ మీ జుట్టుకు సంరక్షణను అందిస్తుంది.

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair

దురద నుండి చర్మానికి ఉపశమనం అందిస్తుంది :

కఠినమైన, రసాయనాలతో కూడిన షాంపూలు మరియు కండీషనర్ల వాడకం, మన జుట్టును అధికంగా నష్టపరుస్తాయి. మీరు జుట్టు సంరక్షణ కోసం సహజ సిద్దమైన మార్గాన్ని ఎంచుకున్న ఎడల, మీరు బలమైన మరియు ఆరోగ్యవంతమైన జుట్టును తిరిగి పొందగలుగుతారు. ఆపిల్ సైడర్ వెనిగర్ దురద నుండి జుట్టు చర్మానికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మరియు పోషకాలతో కూడుకుని ఉన్నందువలన కుదుళ్ళకు బలాన్ని చేకూరుస్తుంది.

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair

చుండ్రుతో పోరాడుతుంది :

మీరు చుండ్రు సమస్యలను తరచుగా ఎదుర్కొంటున్న ఎడల, ఆపిల్ సైడర్ వెనిగర్ మీకు ఎంతగానో సహాయపడగలదు. చుండ్రు వలన కలిగే బ్యాక్టీరియాను పోగొట్టడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావవంతమైనదిగా చెప్పబడుతుంది.

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair
ఇంటి వద్ద ఆపిల్ సైడర్ వెనిగర్తో షాంపూ చేసుకునే విధానం ?
కావలసిన పదార్ధాలు : 4 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్,నీరు, షాంపూ, కండిషనర్,
పాటించాల్సిన విధానం: మీ జుట్టును పూర్తిగా తేలికపాటి సల్ఫేట్ రహిత షాంపూ ఉపయోగించి తలస్నానం చేయండి. ఆపై కండీషనర్ ఉపయోగించండి. కండీషనర్ కొద్ది నిమిషాల పాటు ఉండనిచ్చిన తర్వాత తలస్నానం చేయండి. ఇప్పుడు కొంత ఆపిల్ సైడర్ వెనిగర్ను నీటితో కలిపి, మీ మొదళ్ళ నుండి కుదుళ్ళ వరకు జుట్టు చర్మంతో సహా మసాజ్ చేయండి.
5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair

తర్వాత సుమారు 15 నిముషాల పాటు ఉండనిచ్చిన తర్వాత, మోస్తరు నీటితో మీ జుట్టును శుభ్రం చేయండి. తర్వాత టవల్తో తుడిచి, గాలి తగిలేలా జుట్టును ఆరనివ్వండి. మీ రోజువారీ జుట్టు సంరక్షణా విధానాల్లో భాగంగా యాపిల్ సైడర్ వెనిగర్ను తరచుగా వినియోగిస్తూ, మీ జుట్టు సమస్యలకు స్వస్తి చెప్పండి.


ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార,హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair

5 Reasons Why Apple Cider Vinegar Is A Must For Healthy Hair
Desktop Bottom Promotion