For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరగటానికి ఆలోవెరా, తేనె మాస్క్

|

మనందరం జుట్టు పొడవుగా పెరగటానికి ఎప్పుడూ అడ్డదారులను వెతుకుతూనే ఉంటాం. ఏది ఏమైనా ఇంటి సహజ చిట్కాల ప్రభావాన్ని మాత్రం ఏవీ కాదనలేవు.

జుట్టు ఊడిపోవటం పెరగటానికి కొన్ని కారణాలు ప్రొటీన్ లేకపోవటం, ఎండలో ఎక్కువ తిరగటం, కాలుష్యం, మన జీవనవిధానం, కొన్ని సార్లు హార్మోనల్ సమస్యలు కావచ్చు.

Aloe Vera And Honey Mask For Hair Growth

కారణం ఏదైనా, తీవ్రంగా జుట్టు ఊడిపోవటం పీడకలలాంటిది. అయితే మరి దీన్ని ఎలా ఆపవచ్చు? ఇదిగో ఇక్కడ ఒక సింపుల్ ఇంటి చిట్కా చెప్పబడింది. ఈ ఆలోవెరా, తేనె మాస్క్ జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించి, జుట్టు పెరిగేలా సాయపడుతుంది.

మీరు ఈ చిట్కాను ఇంట్లోనే సులభంగా తయారుచేసి,వాడుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం.

మీకు కావాల్సినవి ఏంటి?

మీకు కావాల్సినవి ఏంటి?

1/2కప్పు ఆలోవెరా జెల్

2చెంచాల పచ్చితేనె

1 చెంచా కొబ్బరినూనె

కొన్నిచుక్కల లావెండర్ నూనె

ఎలా తయారుచేయాలి?

ఎలా తయారుచేయాలి?

1.మొదటగా ఆలోవెరా ఆకును తెరచి అందులోంచి జెల్ ను తీయండి. మీ దగ్గర తాజా ఆలోవెరా ఆకు లేకపోతే మార్కెట్లో దొరికే రెడీమేడ్ జెల్ ను వాడవచ్చు.

2.తర్వాత శుభ్రమైన బౌల్ ను తీసుకుని అందులో ఆలోవెరా జెల్, కొబ్బరినూనె, పచ్చితేనెను వేయండి.

3.అన్ని పదార్థాలను కలిపి మెత్తటి పేస్టులా తయారుచేయండి.

4.ఈ మిశ్రమంలో లావెండర్ సుగంధ నూనెను జతచేసి మొత్తం బాగా కలపండి.

5.లావెండర్ ఈ హెయిర్ మాస్క్ కు అదనపు సువాసనను ఇస్తుంది, వాడకపోయినా ఫర్వాలేదు.

6.ఈ ఆలోవెరా మిశ్రమాన్ని ఎయిర్ టైట్ డబ్బాలో దాచుకుని తర్వాత వాడుకోవచ్చు.

ఎలా వాడాలి?

ఎలా వాడాలి?

1.మొదటగా సల్ఫేట్ ఫ్రీ షాంపూతో తలస్నానం చేయండి.

2.ఒక చెంచా ఆలోవెరా మాస్క్ ను తీసుకుని జుట్టుకి, మాడుకి పట్టించండి. నెమ్మదిగా ,గుండ్రంగా తిప్పుతూ మీ జుట్టును మసాజ్ చేయండి.

3.సులభంగా తలకి రాసుకోటానికి జుట్టును రెండు భాగాలుగా చేసి మాస్క్ ను ఒక్కో పాయకి విడిగా పట్టించండి, అలా మాస్క్ కుదుళ్ళ నుంచి వెంట్రుకల చివర్ల వరకూ పడుతుంది.

4.కొన్నిసార్లు మసాజ్ చేసాక,మీ జుట్టును షవర్ క్యాప్ తో కప్పి గంటపాటు ఉంచండి.

5.తర్వాత మామూలు నీళ్ళతో కడిగేయండి.

6.దీనికి తప్పక సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడటం మర్చిపోవద్దు, అది జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది.

ఎంత తరచుగా దీన్ని వాడాలి?

ఎంత తరచుగా దీన్ని వాడాలి?

ఈ చిట్కాను మీరు వారానికి 2-3 సార్లు వాడి వేగంగా, మెరుగైన ఫలితాలు చూడవచ్చు. ఈ మాస్క్ తో పాటు తలంటుకోటానికి సల్ఫేట్ ఫ్రీ షాంపూని తప్పక వాడండి.

ఆలోవెరా లాభాలు

ఆలోవెరా లాభాలు

ఈ పురాతన చిట్కా ఆలోవెరా అనేక అందానికి సంబంధించిన సమస్యలకి పరిష్కారంగా ఉంటూ వస్తోంది. చర్మంపై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో, జుట్టు సంరక్షణలో కూడా అంతే చక్కగా పనిచేస్తుంది.

ఆలోవెరాలో ఉండే పదార్థాలు జుట్టుకి లోపల నుంచి తేమనిచ్చి, జుట్టును హైడ్రేట్ చేయటంలో సాయపడతాయి. అమినోయాసిడ్లు, విటమిన్ ఎ,సి,ఇ లు జుట్టు పాయలను రిపేర్ చేసి, జుట్టు పెరుగుదలలో సాయపడతాయి.

వీటితోపాటు, ఆలోవెరా రక్తప్రసరణని పెంచి మాడును చల్లబర్చటంతో జుట్టు ఎదగటంలో సాయపడుతుంది.

పచ్చితేనె లాభాలు

పచ్చితేనె లాభాలు

పచ్చితేనె దాని ఉపశమన, తేమ గుణాలకి ప్రసిద్ధి. ఇది కేవలం తల మాడుకి పోషణనివ్వటమే కాదు, జుట్టు పెరిగేలా కూడా చేస్తుంది. పచ్చి తేనెలో ఉండే ఎంజైములు, విటమిన్లు, ఖనిజలవణాలన్నీ వేగంగా జుట్టు పెరగటంలో సాయపడతాయి.

కొబ్బరినూనె లాభాలు

కొబ్బరినూనె లాభాలు

కొబ్బరినూనె జుట్టును పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు తల మాడుపై పేరుకున్న అదనపు పదార్థాలను తొలగించేస్తాయి. ఇది రెగ్యులర్ గా వాడితే జుట్టు కుదుళ్లని లోతుగా కండీషన్ చేసి, జుట్టును వేగంగా పెరిగేలా చేస్తుంది.

English summary

Aloe Vera And Honey Mask For Hair Growth

Whatever be the reason, severe hairfall is no less than a nightmare. So how do we stop this? Here is a simple homemade aloe vera and honey mask that helps in reducing hair fall and boosts hair growth. You can prepare this remedy and use this easily sitting back at home. Let's see how.
Story first published: Sunday, July 22, 2018, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more