డాండ్రఫ్ సమస్య వేధిస్తోందా? అయితే, ఈ ఆపిల్ సిడర్ వినేగార్ రెమెడీస్ తో ప్రయోజనం పొందండి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

క్రానిక్ లేదా పెర్సిస్టెంట్ డాండ్రఫ్ అనేది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వలన తలెత్తుతుంది. ఈ బాధాకరమైన స్థితి అనేది స్కాల్ప్ యాక్నేకి అలాగే హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.

క్రానిక్ డాండ్రఫ్ ని తో ఇబ్బంది పడేవారు స్కాల్ప్ లో ఫ్లెకీనెస్ తో పాటు తీవ్రమైన దురదను కూడా ఎక్స్పీరియెన్స్ చేస్తారు. ఈ కండిషన్ ను సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే అనేకరకాలైన హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లెమ్స్ మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి.

hair care tips

స్కాల్ప్ కండిషన్ అనేది సాధారణంగా మారిపోయింది కాబట్టి మార్కెట్ లో అనేకరకాలైన యాంటీ డాండ్రఫ్ ప్రోడక్ట్స్ అనేవి లభ్యమవుతున్నాయి. అయితే, నిజానికి ఇటువంటి ప్రోడక్ట్స్ అనేవి అంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు.

అందువలన, ఈ మధ్యకాలంలో చాలా మంది మార్కెట్ లో లభ్యమయ్యే యాంటీ డాండ్రఫ్ ప్రోడక్ట్స్ ని వాడే బదులు సమర్థవంతమైన హోమ్ రెమెడీస్ పై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ఆపిల్ సిడర్ వినేగార్ రెమెడీస్ పై ఆధారపడుతున్నారు. ఇది ఎసిడిక్ నేచర్ కలిగి ఉండడం వలన డాండ్రఫ్ ని కలిగించే ఫంగస్ ని నశింపచేయడానికి తోడ్పడుతుంది. అలాగే, దీనిని తరచూ వాడుతూ ఉంటే డాండ్రఫ్ ప్రాబ్లెమ్ త్వరగా తగ్గుముఖం పడుతుంది.

ఇక్కడ, కొన్ని ప్రభావవంతమైన ఆపిల్ సిడర్ వినేగార్ హోమ్ రెమెడీస్ ను వాడటం ద్వారా క్రానిక్ డాండ్రఫ్ ని ఎలా అరికట్టవచ్చో తెలుసుకుందాం.

నీళ్లతో:

నీళ్లతో:

ఎలా వాడాలి:

- ఒక టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ని ఓక మగ్గుడు డిస్టిల్డ్ వాటర్ లో కలపాలి.

- ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఈ సొల్యూషన్ తో హెయిర్ ని రిన్స్ చేయాలి.

- ఆ తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను రిన్స్ చేసుకోండి.

ఫ్రీక్వెన్సీ

వారానికి రెండు సార్లు ఈ హోంమేడ్ సొల్యూషన్ తో స్కాల్ప్ ను అలాగే హెయిర్ ను ట్రీట్ చేస్తే డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది.

నిమ్మరసంతో:

నిమ్మరసంతో:

ఎలా వాడాలి:

- అర టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ మరియు రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంతో ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.

- ఈ బ్లెండ్ ను స్కాల్ప్ పై అప్లై చేసి మీ ఫింగర్ టిప్స్ తో స్కాల్ప్ ను మసాజ్ చేయాలి.

- 15 నుంచి 20 నిమిషాల తరువాత హెయిర్ ను గోరువెచ్చటి నీటితో అలాగే మీ రెగ్యులర్ షాంపూతో వాష్ చేసుకోవాలి.

ఫ్రీక్వెన్సీ:

వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించడం ద్వారా డాండ్రఫ్ సమస్య తగ్గిపోతుంది అలాగే ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది.

బేకింగ్ సోడాతో:

బేకింగ్ సోడాతో:

ఎలా వాడాలి:

- అర టీస్పూన్ బేకింగ్ సోడాలో ఒక టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ను అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ ను కలపాలి.

- ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేసి ఫింగర్ టిప్స్ తో కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

- ఆ తరువాత తేలికపాటి షాంపూతో స్కాల్ప్ ను హెయిర్ ను వాష్ చేసుకోవాలి.

ఫ్రీక్వెన్సీ:

ఈ అద్భుతమైన రెమెడీను వారానికి రెండు సార్లు పాటించడం ద్వారా డాండ్రఫ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

అలో వెరా జెల్ తో:

అలో వెరా జెల్ తో:

ఎలా వాడాలి:

- రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ లో అర టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ను కలపాలి.

- ఇలా తయారైన బ్లెండ్ ను స్కాల్ప్ పై అప్లై చేసి 20 - 25 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

- ఆ తరువాత గోరువెచ్చటి నీటితో అలాగే మీ రెగ్యులర్ షాంపూతో వాష్ చేయాలి.

ఫ్రీక్వెన్సీ:

వారానికి ఒకసారి ఈ రెమెడీను పాటిస్తే క్రానిక్ డాండ్రఫ్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఎలా వాడాలి:

- రెండు టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో అర టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ను కలపాలి.

- ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేయాలి.

- 30 నిమిషాల పాటు ఈ మిశ్రమం స్కాల్ప్ పై అలాగే ఉండాలి. ఆ తరువాత మీ రెగ్యులర్ షాంపూతో స్కాల్ప్ ను శుభ్రపరుచుకోండి.

ఫ్రీక్వెన్సీ:

ఈ సమర్థవంతమైన ఆపిల్ సిడర్ వినేగార్ రెమెడీని వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే ఈ క్రానిక్ డాండ్రఫ్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

చమోమైల్ టీ:

చమోమైల్ టీ:

ఎలా వాడాలి:

- అర కప్పు తీపిలేని చమోమైల్ టీలో ఒక టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ను కలపాలి.

- మీ హెయిర్ ను ఈ మిశ్రమంతో రిన్స్ చేయాలి.

- 20 నిమిషాల తరువాత మీ రెగ్యులర్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోండి.

ఫ్రీక్వెన్సీ:

ఈ సూపర్ ఎఫెక్టివ్ రెమెడీతో మీ హెయిర్ ను ప్యాంపర్ చేసుకుంటే డాండ్రఫ్ సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.

English summary

Apple Cider Vinegar Remedies For Chronic Dandruff

Dandruff could be a serious problem faced by many women. Those who suffer from chronic dandruff experience flakiness and severe itchiness on the scalp. Get rid of dandruff problems forever by blending apple cider vinegar with water, baking soda or lemon juice and applying the mixture on your scalp.Treat dandruff problems with apple cider vinegar; a miraculous remedy!
Story first published: Monday, April 9, 2018, 16:30 [IST]