Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
జామ ఆకులు మీ శిరోజాలకు ప్రయోజనం కలిగిస్తాయా?
జామ ఆకులు మీ శిరోజాలకు ప్రయోజనం కలిగిస్తాయా?
"మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే!" మరి మీ పెరట్లో జామ చెట్టు ఉందా? అడిగినా, అడగకపోయినా, జామ ఆకులు మీ కేశాల యోగక్షేమాలు చూసుకుంటాయని మీకు తెలుసా? మీ ఇంట్లో జామ చెట్టు ఉంటే మీరు శిరోజ సమస్యల పరిష్కారానికి ఇంకెక్కడకి పరిగెత్తనవసరం లేదు. జామ ఆకులు మీ జుట్టు రాలడాన్ని అరికెట్టి, పెరుగుదలను ప్రోత్సహించి, ఒత్తుగా మారుస్తుంది.
జామ ఆకులలో వివిధ జీవక్రియాత్మక(bioactive) పదార్థాలైన ఫ్లావనాయిడ్లు, టానిన్లు,యూజెనాల్, సపోనిన్ మరియు ట్రైటెనాయిడ్స్ ఉంటాయి. ఇవి కేశాలకు ఆరోగ్యాన్ని మరియు ప్రయోజనాలను అందిస్తాయి.

జామ ఆకులు కేశ సంరక్షణకు ఏవిధంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఈ క్రింది వివరణలోకి వెళ్ళండి.

కేస సంరక్షణలో జామ ఆకులు కలుగజేసే ప్రయోజనాలు:
• జామఆకుల్లోని యాంటీమైక్రోబియల్, యాంటీఆక్సిడెంట్ , యాంటిఇన్ఫ్లమేటరీమరియు అనాల్జెసిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి మాడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కనుక మాడు మీద దురద చుండ్రు వంటి సమస్యల చికిత్సలో ఇవి బాగా ఉపయోగపడతాయి.
• విటమిన్ బి మరియు సి సమృద్ధిగా ఉన్నందున, ఇవి వెంట్రుకలకు అవసరమైన పోషణను అందించి, ఎదిగేట్టు చేస్తాయి. ఇవి జుట్టుకు మెరుపునిచ్చి, పరిమాణాన్ని పెంచుతాయి.
• జుట్టుకు తేమనందించి పొడిబారకుండా చేస్తాయి. ఇవి జుట్టును మృదువుగా, మెరిసేటట్టు చేస్తాయి.
• జామఆకుల్లోని విటమిన్ సి సమృద్ధిగా ఉన్నందున, జుట్టు త్వరగా ఎదగడానికి ఉపయోగపడే, కొల్లాజన్ ఉత్పత్తి మరియు పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.
• జామఆకుల్లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడి, జుట్టుకు నష్టం కలుగకుండా చేస్తాయి.
• జామఆకుల్లోని లైకోపీన్ జుట్టును సూర్యుని యొక్క హానికారక అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది.
• జామఆకులు జుట్టుపై పేరుకున్న మురికి, మట్టి ని తొలగించి మీ జుట్టు యొక్క కుదుళ్ళు పూడుకుపోకుండా చేస్తాయి. దీనివలన చుండ్రు, జిడ్డు సమస్యలు తలెత్తవు.
• పగిలిన చిగుళ్ల పరిష్కారానికి జామ ఆకుల మాస్కు అద్భుతమైన చికిత్స.

కేశ సంరక్షణ కోసం జామ ఆకులను ఏ విధంగా వినియోగించాలి?
జామ ఆకుల వలన కేశాలకు కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారు కదా! ఇక మీ దైనందిన కేస సంరక్షణకు వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలుసుకుందాం!

తయారీ విధానం:
• ఒక కుండలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టండి.
• నీరు మారుగుతున్నప్పుడు దానిలో జామ ఆకులు వేయండి.
• ఇరవై నిమిషాల పాటు మరగనిచ్చి జామ ఆకులను వడకట్టండి.
• ఈ ద్రావణాన్ని చల్లారనివ్వండి.

ఎలా వాడాలి?:
• మీ జుట్టును షాంపూతో శుభ్రపరచుకోండి.
• జుట్టు బాగా ఆరిన తరువాత, పాయలుగా విడదీసి, జామ ఆకుల ద్రావణాన్ని రాయండి.
• మీ మాడులోకి ఇంకేటట్టు పది నిమిషాల పాటు మర్దన చేసుకోండి. మీ జుట్టు మొత్తానికి ఈ ద్రావణాన్ని పట్టించండి.
• రాసుకునేటప్పుడు జట్టు మొదళ్ళు మరియు చిగుళ్లపై దృష్టి సారించండి.
• రెండు గంటల పాటు ఆరనివ్వండి.
• గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి

గమనిక:
1. ఈ ద్రావణమే కండీషనర్ గా పనిచేస్తుంది కనుక, వేరేగా కండీషనర్ వాడవలసిన అవసరం లేదు.
2. వాడటానికి ముందుగా ద్రావణాన్ని చల్లారనిచ్చి వాడండి.

లాభాలు:
ఈ పద్ధతిని పాటించడం వలన మీ జుట్టు పెరుగుదల మెరుగవ్వడమే కాకుండా ఒత్తైన, మృదువైన మరియు మెరిసే కురులు మీ సొంతమవుతాయి.
జుట్టు యొక్క పగిలిన చిగుళ్ల చికిత్సకు మాస్కు వలె వాడవచ్చు:
• జామ ఆకులు కొద్దిగా నీరు కలిపి, కాస్తంత బరకగా ముద్ద చేయండి.
• ఈ మాస్కుతో మాడును రుద్దుకుంటు జుట్టంతా పట్టించండి.
• జుట్టు మొదల్లా నుండి చిగుళ్ల వరకు మాస్కు జుట్టంతా పట్టేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

లాభం:
ఈ మాస్కు, మీ జుట్టు యొక్క పగిలిన చిగుళ్ల సమస్య పరిష్కారానికి అద్భుతంగా పనిచేస్తుంది..

ఎలా వాడాలి?:
దీనిని ప్రతిదినం జుట్టు మరియు మాడుపై స్ప్రేలా చల్లుకుంటే, జుట్టుకు తేమను అందిస్తుంది.
కండీషనర్ వలే పనిచేస్తుంది:
మీరు ఇంట్లో తయారు చేసిన కండీషనర్ కు కొద్దిగా పైన చెప్పబడిన జామ ఆకుల టీని కలపండి. దీనిని వాడటం వలన మీ జుట్టుకు అవసరమైన తేమ లభిస్తుంది. అంతేకాక, దీని వలన జరిగే అదనపు లాభం ఏమిటంటే, జామ ఆకులల్లోని పోషకాలు మీ జుట్టుకు అందుతాయి.

టీ వలె తాగండి:
జామ ఆకులను కేశ సంరక్షణ కొరకు పై పూతగా వాడటమే కాకుండా, ఈ ఆకులతో తయారు చేసిన టీని తాగడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు అందించడమే కాక లోపల నుండి వెంట్రుకలను ధృడపరచి ఆరోగ్యవంతంగా ఎదిగేట్టు చేస్తుంది.
మనం ప్రతిరోజు తాగే గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ వాలే క్రమం తప్పకుండా తీసుకుంటే చాలా మేలు చేస్తుంది. మాడు మీద స్ప్రే వలే పైపైన వాడటమే కాకుండా, టీ రూపంలో తాగితే మంచి ఫలితం ఉంటుంది.
జుట్టు ఎదుగుదలకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాక, జామ ఆకుల్లో, డయేరియా, హృద్రోగ ప్రమాదం, మధుమేహం, స్ట్రోక్, కేన్సర్ మరియు ఊబకాయం వంటి వివిధ రకాల వ్యాధులు, రుగ్మతలను నివారించే ఎన్నో ఇతర ఔషధ గుణాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications