For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలబందతో జుట్టుకు కలిగే ఉపయోగాలు

మీ జుట్టుకి ప్రతిరోజూ కాలుష్యం,స్టైలింగ్ టూల్స్ ,ఉత్పత్తుల వచ్చే సమస్యలను చూసి ఎన్నిసార్లు చిరాకు పడివుంటారు? లేదా జుట్టు ఆరోగ్యంగా లేదని ఎన్నిసార్లు బాధపడివుంటారు? అయితే మీ జుట్టు సమస్యలు మొత్తం తీరి

By Deepthi
|

కవర్ పేజీ మోడల్స్ ను చూసినప్పుడల్లా వారి అందమైన, మెరిసే జుట్టును చూసి మీరు ఎన్నో సార్లు అసూయపడి ఉంటారు. మీ జుట్టుకి ప్రతిరోజూ కాలుష్యం,స్టైలింగ్ టూల్స్ ,ఉత్పత్తుల వచ్చే సమస్యలను చూసి ఎన్నిసార్లు చిరాకు పడివుంటారు? లేదా జుట్టు ఆరోగ్యంగా లేదని ఎన్నిసార్లు బాధపడివుంటారు? అయితే మీ జుట్టు సమస్యలు మొత్తం తీరిపోతాయి. కలబంద మీ చెంత ఉంటే అందమైన కురులు మీ సొంతం.

కలబంద (ఆలోవెరా) అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది. అది కూడా ఎక్కువ ఖరీదు లేకుండానే. ఆలోవెరా పోషకలాభాలు 75 యే ఉన్నా, ఈ మొక్కలో 100 కి పైగా సూక్ష్మపోషకాలున్నట్లు తేలింది. ఆలోవెరా మీ జుట్టుకి అసలు ఏం చేస్తుందని మీకు సందేహం రావచ్చు. ఇది మీ జుట్టుకి వాడదగిన అద్భుతమైన పదార్థాల్లో మేటిది. ఇది మరీ అతిశయోక్తిలా అన్పించచ్చు కానీ నిరూపించబడ్డ వాస్తవాలను మర్చిపోలేం.

how to use aloe vera for hair growth

కణాలను బాగు చేస్తాయి

1. ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగుచేస్తాయి. ఇలా కుదుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి,త్వరగా జుట్టుపెరిగేలా చేస్తుంది.
2. ఆలోవెరాను జుట్టుకి రాయటం వలన జుట్టు వెంటనే మృదువుగా,మెత్తగా మారుతుంది. మృదువైన జుట్టుతో హెయిర్ స్టైలింగ్ సులభమౌతుంది, జుట్టును వదులుగా కూడా ఉంచుకోవచ్చు.
3. జుట్టు ఊడిపోవటం ఆపాలంటే,సహజంగా ఒత్తైన జుట్టు పెరగటానికి దీన్ని వాడండి.
4. ఆలోవెరా వాపు వ్యతిరేక లక్షణాలు మీ తల మాడుకి మంట,వాపు నుంచి ఉపశమనం ఇస్తాయి.
5. దీనిలోని ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును,పొట్టుగా ఊడిపోవటాన్ని నివారించి,నయం చేస్తుంది.

how to use aloe vera for hair growth

కలబందను ఎలా వాడుకోవాలో తెలుసా?

6. ప్రొటియోలైటిక్ ఎంజైములతో పాటు, ఆలోవెరా (కలబంద)లో ఉండే ఎక్కువ ప్రొటీన్,విటమిన్లు, ఖనిజలవణాలు మీ జుట్టు కుదుళ్ళకి మంచి పోషణనిస్తాయి.
7. ఆలోవెరా మీ జుట్టును మంచిగా కండీషన్ చేసి, పోషకాలు,హైడ్రేషన్ స్థాయిలను నిలుపుతుంది.
ఆలోవెరాలో మంచి విషయం ఏంటో తెలుసా? దీన్ని మీ ఇంట్లోనే వంటింట్లో లేదా బాల్కనీలో పెంచుకోవచ్చు. అలా రసాయనాలు కలుపుతారనే బెంగ ఉండదు. ఇంకా అందులో జుట్టుకి సంబంధించిన లాభాలు ఎన్నో దాగున్నాయి.
ప్రాథమిక వాస్తవాలు తెలుసుకున్నాం కాబట్టి మీ హెయిర్ రొటీన్లో ఎలా ఆలోవెరాను వాడుకోవచ్చో తెలుసుకుందాం.

మ్యాజిక్ ప్యాక్

సమాన పరిమాణాల్లో కొబ్బరినూనె, ఆలోవెరాను కలపటం వలన మ్యాజిక్ ప్యాక్ తయారవుతుంది. ఇలా బలమైన,మృదువైన,ఒత్తైన జుట్టు వస్తుంది.వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను రాసుకుని ఎంతసేపైతే అంత వదిలేయండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై నెమ్మదిగా మసాజ్ చేస్తూ చివర్ల వరకూ రాయండి. ముఖ్యంగా చివర్ల ఎక్కువగా రాయండి. ఎందుకంటే అక్కడే జుట్టు ఎక్కువగా పాడవుతుంది. సరిగ్గా తల అంతా పట్టించాక, షవర్ క్యాప్ పెట్టుకొని ఒక గంట అలా వదిలేశాక కడిగేయండి. ఈ అద్భుతమైన కండీషనింగ్ రెసిపి మీ జుట్టు ఆరోగ్యాన్ని తలపై తేమ పోకుండా చేసి కాపాడుతుంది.

జుట్టుకు కొత్త అందం

ఈ మాస్క్ మీ జుట్టును మెయింటేన్ చేయటం వలన ఎక్కువసార్లు ట్రిమ్ కూడా చేయించక్కర్లేదు. చాలామంది ఆలోవెరాను కమిలిన చర్మానికి చిట్కాగా వాడతారు కానీ ఆలోవెరా (కలబంద) జుట్టుకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించి చాలా మంది సానుకూల ఫలితాలను పొందారు. మంచి జుట్టు, రసాయనాలు లేకుండా మెరిసే జుట్టు కావాలని ఎవరికి ఉండదు? అందుకని మీ కోసం ప్రకృతి అందిస్తున్న రెండు హెయిర్ రిపేర్ పదార్థాలు .. ఆలోవెరా ఇంకా కొబ్బరినూనె. ఈ రెండింటి ద్వారా జుట్టుకు కొత్త అందం వస్తుంది.

English summary

Benefits Of Aloe Vera For Hair

Aloe vera for hair is the most widely recommended natural hair repair therapy, as this medicinal plant is said to contain many nourishing agents that are helpful for hair growth.
Desktop Bottom Promotion