For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కోకోనట్ వాటర్ సొల్యూషన్స్ తో హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది

ఈ కోకోనట్ వాటర్ సొల్యూషన్స్ తో హెయిర్ గ్రోత్ మెరుగవుతుంది

|

పొడవైన అలాగే ఆరోగ్యకరమైన జుట్టు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. అటువంటి శిరోజాలని పొందాలని మగువలు ముచ్చట పడుతూ ఉంటారు. అయితే, జుట్టును పొడవుగా పెంచుకోవడమంత సులభమైన పని మాత్రం కాదు. ముఖ్యంగా ఈ రోజుల్లో, అనేక కారణాలు జుట్టు ఎదుగుదలకు అవాంతరాలుగా ఏర్పడుతున్నాయి. వాతావరణ కాలుష్యంతో పాటు లైఫ్ స్టయిల్ సమస్యల వంటివి శిరోజాల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.

హెయిర్ ఫాల్, స్ప్లిట్ ఎండ్స్, బ్రేకేజ్ వంటివి శిరోజాల ఎదుగుదల మందగించడానికి కారణాలు. ఈ సమస్యను నివారించేందుకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన పదార్థం కొబ్బరి నీళ్లు. కొబ్బరి నూనె ఏ విధంగా శిరోజాల సంరక్షణకు తోడ్పడుతుందో అదే విధంగా కొబ్బరి నీళ్లు కూడా శిరోజాల సంరక్షణకు అమితంగా తోడ్పడతాయి.

Coconut Water Solutions For Hair Growth That Actually Work

కొబ్బరి నీళ్లలో ఉండే హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ వలన బ్రేకేజ్ సమస్యలు తొలగిపోతాయి. తద్వారా, హెయిర్ ను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ ను పొందాలనుకుంటే కొబ్బరి నీళ్లతో ప్రయోజనం పొందవచ్చు. డాండ్రఫ్ వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య అధికమవుతుంది. కొబ్బరి నీళ్లు డాండ్రఫ్ ని తగ్గించి హెయిర్ గ్రోత్ ను పెంపొందించేందుకు తోడ్పడతాయి.

హెయిర్ ఫాల్ ని తగ్గించుకుని హెయిర్ గ్రోత్ ను మెరుగుపరిచేందుకు కొబ్బరి నీళ్లను ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లు:

కొబ్బరి నీళ్లు:

కొబ్బరి నీళ్లు స్కాల్ప్ ని హైడ్రేట్ చేసేందుకు తోడ్పడతాయి. తద్వారా, శిరోజాలకు పోషణనిస్తాయి.

పదార్థాలు:

అర కప్పు కొబ్బరి నీళ్లు

ఎలా వాడాలి:

1. మొదటగా స్కాల్ప్ ని కొబ్బరి నీళ్లతో సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయడం ప్రారంభించండి.

2. ఈ పద్దతిని అయిదు నుంచి పది నిమిషాల పాటు కొనసాగించండి.

3. హెయిర్ మొత్తానికి అంటే రూట్స్ నుంచి టిప్స్ వరకు కొబ్బరి నీళ్ళను మసాజ్ చేయండి.

4. ఇరవై నిమిషాల పాటు అలాగే వదిలేయండి.

5. ఇరవై నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో అలాగే మైల్డ్ షాంపూ తో హెయిర్ ను రిన్స్ చేయండి.

6. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు.

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు కోకోనట్ వాటర్

ఆపిల్ సిడర్ వినేగార్ మరియు కోకోనట్ వాటర్

స్కాల్ప్ లోని పీహెచ్ ని బాలన్స్ చేయడంతో పాటు స్కాల్ప్ పై పేరుకుపోయిన డర్ట్ ను అలాగే జిడ్డును తొలగించేందుకు ఈ సొల్యూషన్ తోడ్పడుతుంది.

పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్

1 కప్పు కొబ్బరి నీళ్లు

ఎలా వాడాలి:

1. ఆపిల్ సిడర్ వినేగార్ ని ఒక కప్పు కొబ్బరి నీళ్లలో డైల్యూట్ చేయండి.

2. మొదటగా మీ హెయిర్ ను సల్ఫేట్ ఫ్రీ షాంపూతో వాష్ చేయండి.

3. ఆ తరువాత, ఆపిల్ సిడర్ వినేగార్ మరియు కొబ్బరి నీళ్ల మిశ్రమాన్ని శిరోజాలకు అప్లై చేయండి. అయిదు నుంచి పది నిమిషాల పాటు అలాగే ఉంచండి.

4. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయండి.

5. మెరుగైన ఫలితాల కోసం ఈ రెమెడీను వారానికి ఒకసారి పాటించండి.

నిమ్మ మరియు కొబ్బరి నీళ్లు:

నిమ్మ మరియు కొబ్బరి నీళ్లు:

నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మరసం కొలాజిన్ ప్రొడక్షన్ ను పెంపొందించుతుంది. తద్వారా, హెయిర్ గ్రోత్ ను మెరుగుపరుస్తుంది.

పదార్థాలు:

పావు కప్పు కొబ్బరి నీళ్లు

ఎలా వాడాలి:

1. నిమ్మరసాన్ని కొబ్బరి నీళ్లతో కలపండి.

2. ఈ మిశ్రమంతో స్కాల్ప్ పై సర్క్యూలర్ మోషన్ లో ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి.

3. ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని శిరోజాలపై అప్లై చేయండి. వెచ్చటి టవల్ తో హెయిర్ ను కవర్ చేయండి.

4. పదిహేను నుంచి యిరవై నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత తేలికపాటి, సల్ఫేట్ ఫ్రీ షాంపూతో రిన్స్ చేయండి.

5. ఈ రెమెడీను వారానికి ఒకసారి పాటించండి.

తేనె మరియు కొబ్బరి నీళ్లు:

తేనె మరియు కొబ్బరి నీళ్లు:

తేనెలో హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. ఇవి హెయిర్ ను డేమేజ్ నుంచి రక్షిస్తాయి.

పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ తేనె

పావు కప్పు కొబ్బరి నీళ్లు

ఎలా వాడాలి:

1. ఒక టేబుల్ స్పూన్ తేనెను పావు కప్పు కొబ్బరి నీళ్లలో డైల్యూట్ చేయండి.

2. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయండి.

3. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని హెయిర్ మొత్తానికి అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచండి.

4. మీ హెయిర్ ను వెచ్చటి టవల్ తో కవర్ చేయండి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయండి.

5. ఈ రెమెడీను వారానికి రెండు సార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలను పాటించవచ్చు.

అలోవెరా మరియు కొబ్బరి నీళ్లు

అలోవెరా మరియు కొబ్బరి నీళ్లు

ఈ మిశ్రమం ఫ్రిజ్జీ మరియు డేమేజ్డ్ హెయిర్ ను మేనేజ్ చేయడానికి తోడ్పడుతుంది. హెయిర్ ను మృదువుగా చేస్తుంది. స్కాల్ప్ కు బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగయ్యేలా చేస్తుంది.

పదార్థాలు:

2 టీస్పూన్ల అలోవెరా

పావు కప్పు కొబ్బరి నీళ్లు

2 టీస్పూన్ల జజోబా ఆయిల్

ఎలా వాడాలి:

1. పై పదార్థాలని ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోండి.

2. తేలికపాటి షాంపూతో హెయిర్ ను వాష్ చేసిన తరువాత కండిషనర్ ను అప్లై చేయండి.

3. హెయిర్ ను వాష్ చేసిన తరువాత శిరోజాలపై తడిని టవల్ తో తుడుచుకుని కోకోనట్ వాటర్ మిశ్రమాన్ని హెయిర్ పై స్ప్రే చేసి అలాగే ఉండనివ్వండి.

4. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్ లో భద్రపరచి మరలా ఉపయోగించవచ్చు.

5. ఈ రెమెడీను వారానికి రెండు లేదా మూడు సార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

English summary

Coconut Water Solutions For Hair Growth That Actually Work

Long and healthy hair is always attractive and is something that every women long for. One best ingredient that can come to rescue for these problem is coconut water. When mixed with ingredients like aloe vera, honey etc., it helps in increased hair growth.Hair fall, split ends, breakage, etc., adds on to the slow growth of hair.
Desktop Bottom Promotion