బ్లో డ్రైయర్ ని వాడేటప్పుడు ఈ కామన్ మిస్టేక్స్ ను అవాయిడ్ చేయండి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

హెయిర్ స్టైలింగ్ టూల్స్ లో బ్లో డ్రైయర్ కి ఉండే స్థానం ప్రత్యేకమైనదని ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. దీనిని, మనలో చాలా మంది రెగ్యులర్ గా వాడతారు. ఈ గ్రూమింగ్ అప్లయిన్స్ ని వివిధ ఏజ్ గ్రూప్స్ కి చెందిన మహిళలు ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు.

బ్లో డ్రైయర్ అనేది కేవలం మీ శిరోజాలలోని తడిని ఆరనివ్వడానికే పరిమితం కాలేదు. ఇది శిరోజాలను మృదువుగా అలాగే మేనేజబుల్ గా చేస్తుంది. అయినప్పటికీ, మిగతా హెయిర్ స్టైలింగ్ టూల్స్ లాగానే, హెయిర్ డ్రైయర్ వలన కూడా శిరోజాల సౌందర్యానికి ముప్పు కలదు. దీని సరైన విధానంలో వాడకపోతే బ్లో డ్రైయర్ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను అనుభవించి రావచ్చు.

బ్లో డ్రైయర్ ని సరిగ్గా వాడకపోతే శిరోజాలపై దుష్ప్రభావం కలిగే అవకాశం ఉంటుందని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. హెయిర్ ని డేమేజ్ చేసి హెయిర్ ని పలచన చేస్తుంది. అలాగే, ఈ మిస్టేక్స్ వలన హెయిర్ బ్రేకేజ్ కూడా ఏర్పడవచ్చు.

Common Blow Dryer Mistakes You Might Be Making

ఒకవేళ, బ్లో డ్రైయర్ ని వాడటం వలన ఎటువంటి మిస్టేక్స్ ఏర్పడతాయో, ఆ మిస్టేక్స్ గురించి మీకు అవగాహన లేకపోతే కంగారు పడకండి. ఈ రోజు బోల్డ్ స్కై లో మీకు బ్లో డ్రైయర్ వలన సాధారణంగా కలిగే 7 మిస్టేక్స్ గురించి వివరించబోతున్నాము. ఈ మిస్టేక్స్ వలన కలిగే నష్టాలనేవి తిరిగి పూడ్చలేనివి.

బెస్ట్ బ్లో డ్రైయింగ్ రిజల్ట్స్ కోసం మీరు బ్లో డ్రైయర్ ని ఏ విధంగా వాడకూడదో తెలుసుకోవడం మంచిది. తద్వారా, సరైన విధంగా బ్లో డ్రైయర్ ని వాడటం వలన శిరోజాల ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నవారవుతారు. ఈ ఆర్టికల్ ని చదివి మరిన్ని విషయాలను తెలుసుకోండి.

1. తడిజుట్టుపై

1. తడిజుట్టుపై

ప్రపంచవ్యాప్తంగా హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్ అందరూ సూచించే విషయమిదే. బ్లో డ్రైయర్ ని వాడే ముందు తడి జుట్టుని గాలికి ఆరబెట్టాలి. ఆ తరువాత బ్లో డ్రైయర్ ని వాడాలి. నిజానికి, బ్లో డ్రైయర్ ని వాడే ముందు మీ జుట్టు కనీసం 80 శాతం వరకు తడి ఆరి ఉండాలి. దీని వలన హీట్ ఎక్పోజర్ అనేది తగ్గి హెయిర్ లాస్ ప్రాబ్లెమ్ దరిచేరదు.

2. హీట్ ప్రొటెక్టన్ట్ ని స్కిప్ చేసినప్పుడు

2. హీట్ ప్రొటెక్టన్ట్ ని స్కిప్ చేసినప్పుడు

ఇది ఇంకొక సాధారణ బ్లో డ్రైయర్ మిస్టేక్. ఈ మిస్టేక్ ని తెలిసీతెలియక ఎంతో మంది మహిళలు బ్లో డ్రైయర్ ని వాడేటప్పుడు చేస్తూ శిరోజాల సౌందర్యాన్ని కోల్పోతూ ఉంటారు. హెయిర్ ని బ్లో డ్రైయింగ్ చేసే ముందు హీట్ ప్రొటెక్షన్ కేర్ తీసుకోవాలి. లేదంటే పూడ్చలేని నష్టం శిరోజాలకు వాటిల్లుతుంది. అలాగే, స్కాల్ప్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. డేమేజ్ ని అరికట్టేందుకు, హెయిర్ ప్రొటెక్టివ్ ప్రోడక్ట్ ని వాడడం మంచిది. మీ శిరోజాలకు సరిపడే హెయిర్ ప్రొటెక్టివ్ ప్రోడక్ట్ ని వాడిన తరువాతే బ్లో డ్రైయర్ ని వాడాలి.

3. రాంగ్ డైరెక్షన్ లో బ్లో డ్రైయర్ ని వాడటం:

3. రాంగ్ డైరెక్షన్ లో బ్లో డ్రైయర్ ని వాడటం:

చాలా మంది బ్లో డ్రైయర్ ని రాంగ్ డైరెక్షన్ లో వాడుతూ ఉంటారు. దీని వలన, శిరోజాలు చిక్కు పడతాయి. అలాగే రఫ్ గా మారతాయి. శిరోజాల కోమలత్వం దెబ్బతినకుండా ఉండాలంటే బ్లో డ్రైయర్ తో శిరోజాల చివర్లను కింది వైపుకు డ్రై చేయాలి. శిరోజాల రూట్స్ ను బ్లో డ్రై చేసేటప్పుడు కూడా సరైన డైరెక్షన్ ను పాటిస్తే శిరోజాల సౌందర్యం దెబ్బతినదు.

4. రాంగ్ టెంపరేచర్ సెక్షన్ ని వాడటం:

4. రాంగ్ టెంపరేచర్ సెక్షన్ ని వాడటం:

అన్ని హెయిర్ డ్రైయర్స్ లో మూడు రకాల టెంపరేచర్ సెట్టింగ్స్ లభిస్తాయి. కూల్, లో మరియు హై అనే ఈ సెట్టింగ్స్ ను అవసరానికి అనుగుణంగా వాడాలి. పలచటి జుట్టు కలిగిన వారు లో సెట్టింగ్ ను వాడాలి. మరోవైపు, ఒత్తైన జుట్టు కలిగిన వారు హై టెంపరేచర్ సెట్టింగ్ ను వాడాలి. సరైన సెట్టింగ్స్ ను వాడకపోతే జుట్టుకు డేమేజ్ ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సెట్టింగ్స్ పనితీరును తెలుసుకుని బ్లో డ్రైయర్ ని ఉపయోగిస్తే మంచిది.

5. జుట్టును సెక్షన్స్ గా విడదీయకపోవడం:

5. జుట్టును సెక్షన్స్ గా విడదీయకపోవడం:

బ్లో డ్రైయింగ్ చేసే మహిళలు ఈ పాయింట్ ను పాటించకపోవడం వలన తమ శిరోజాల ఆరోగ్యాన్ని డేమేజ్ చేసుకున్నవారవుతారు. బ్లో డ్రైయర్ ని వాడేటప్పుడు జుట్టును సెక్షన్స్ గా విడదీసుకోవాలి. ఆ తరువాత ఒక్కొక్క సెక్షన్ ను బ్లో డ్రై చేసుకోవాలి. లేదంటే జుట్టు రఫ్ గా అలాగే అన్ మేనేజబుల్ గా మారుతుంది. మాక్జిమమ్ స్మూత్ నెస్ కోసం ఈ పాయింట్ ను జాగ్రత్తగా పాటించడం అవసరం.

6. బ్రష్ ని వాడకపోవడం:

6. బ్రష్ ని వాడకపోవడం:

బ్లో డ్రై చేసేముందు లాక్స్ ను బ్రష్ చేయడం మంచి పద్దతి. ఇది కొంచెం సమాయన్ని తీసుకునే ప్రాసెస్ అయినా కూడా లాక్స్ అనేవి మేనేజబుల్ గా అలాగే స్మూత్ గా మారడానికి ఉపయోగపడే పద్దతి. కాబట్టి, ఈ బ్లో డ్రైయర్ మిస్టేక్ ని మానేసి సరైన పద్దతిలో హెయిర్ ని బ్లో డ్రై చేసుకోవడం ద్వారా శిరోజాలను సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు.

7. బ్లో డ్రైయింగ్ కి ముందు సెరమ్ ని అప్లై చేసుకోకపోవడం:

7. బ్లో డ్రైయింగ్ కి ముందు సెరమ్ ని అప్లై చేసుకోకపోవడం:

చివరిగా, బ్లో డ్రైయింగ్ కి ముందు సెరమ్ ని అప్లై చేసుకోకపోవటమనేది ఇంకొక సాధారణ మిస్టేక్. దీనివలన శిరోజాలు రఫ్ గా మారతాయి. శిరోజాలు కోమలత్వాన్ని కోల్పోతాయి. ఈ మిస్టేక్ ని అవాయిడ్ చేయడం ద్వారా బ్లో డ్రైయర్ ని సరైన పద్దతిలో వినియోగించుకుని శిరోజాల సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు.

English summary

Common Blow Dryer Mistakes You Might Be Making

Common Blow Dryer Mistakes You Might Be Making,A blow dryer is one of those hair-styling tools that most of us use on a regular basis. Hair care experts have found that making certain blow dryer mistakes can damage your hair and lead to problems such as breakage and thinning of hair. You can be making one of these mist
Story first published: Monday, February 19, 2018, 13:00 [IST]