పెళుసుబారిన జుట్టును మృదువుగా చేసే మీరే చేసుకోతగ్గ ఎగ్ వైట్ హెయిర్ మాస్క్ లు

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

పెళుసుబారిన జుట్టు అందంగా కనిపించదు, అది మీ అందాన్ని చెడకొడుతుందా? అయితే, ఇది చదవండి, పెళుసు బారిన జుట్టును మృదువుగా చేసే కొన్ని సహజ మార్గాల గురించి మేము ఇక్కడ మీకు తెలియచేస్తాము.

మనం దీని చికిత్స గురించి తెలుసుకునే ముందు, జుట్టు సమస్యలకు కారణమయ్యే కొన్ని విషయాలను పరిశీలిద్దాము. ప్రతిరోజూ మీ జుట్టును కండిషనింగ్ చేయకపోయినా, మీ జుట్టును ఎక్కువసేపు తడిపినా, రసాయనాలతో కూడిన జుట్టు సంరక్షణ ఉత్పత్తులు వాడినా, ప్రమాదకర అల్ట్రా వైరస్ కిరణాలూ పడినా వీటి ప్రభావం వల్ల మీ జుట్టు పెళుసుగా, చిత్లినట్టు అవుతుంది.

DIY Egg White Hair Masks That Can Make Rough Hair Soft ,

తరువాత, పెళుసు బారిన జుట్టు చికిత్స విషయానికి వస్తే, ఇక్కడ కొన్ని జుట్టు సంరక్షణ పదార్ధాలు ఎగ్ వైట్ పనిచేసినట్లే అద్భుతంగా పనిచేస్తాయి. ప్రోటీన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు కలిగిన ఎగ్ వైట్ పెళుసు బారిన జుట్టును మృదువుగా చేయడమే కాకుండా, జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేట్టు చేస్తుంది.

ఇక్కడ, పెలుసుబారిన జుట్టుకు ఉపయోగించే కొన్ని ఉత్తమమైన ఎగ్ వైట్ హెయిర్ మాస్క్ ల జాబితా ఇవ్వబడింది. తయారుచేసుకోవడం చాలా తేలిక, ఖర్చు తక్కువ, ఈ జుట్టు మాస్క్ లు ఎక్కువ ప్రమాదాన్నిచ్చే కమర్షియల్ జుట్టు సంరక్షణ ఉత్పత్తుల కంటే చాలా మంచివి.

ఈ కింద ఇచ్చిన హెయిర్ మాస్క్ లను వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే, విలువైన ఫలితాలను పొందవచ్చు. ఈ మాస్క్ లపై ఒకసారి దృష్టి పెట్టండి, ఇక్కడ:

1.ఎగ్ వైట్ – ఆలివ్ ఆయిల్ + జోజోబ ఎసెన్షియల్ ఆయిల్

1.ఎగ్ వైట్ – ఆలివ్ ఆయిల్ + జోజోబ ఎసెన్షియల్ ఆయిల్

1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 4-5 చుక్కల జోజోబ ఎసెన్షియల్ ఆయిల్ తో ఒక ఎగ్ వైట్ ని కలపండి. ఈ మాస్క్ ను మాడుకు, జుట్టు కుదుళ్ళకు పట్టించండి. ఒక షవర్ క్యాప్ తో మీ తలను కప్పి ఉంచి, ఒక గంట మాస్క్ తో వదిలేయండి. ఈ మాస్క్ ని తొలగించడానికి హెర్బల్ షాంపూ, గోరువెచ్చని నీరు ఉపయోగించండి.

2.ఎగ్ వైట్ + ఆల్మండ్ ఆయిల్

2.ఎగ్ వైట్ + ఆల్మండ్ ఆయిల్

ఒక బౌల్ తీసుకుని, ఒక ఎగ్ వైట్ అందులో వేసి, 2 టీస్పూన్ల ఆల్మండ్ ఆయిల్ ని కలపండి. ఫలితాలనిచ్చే మిశ్రమాన్ని మీ మాడు ప్రదేశంలో రాసి, ఒక గంట వదిలేయండి, తరువాత, రోజువారీ షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

3.ఎగ్ వైట్- యాపిల్ సైడర్ వెనిగర్

3.ఎగ్ వైట్- యాపిల్ సైడర్ వెనిగర్

1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తో కేవలం ఒక ఎగ్ వైట్ ని కలిపి, ఆ మిశ్రమాన్ని మీ మాడుకు, కుదుళ్ళకు బాగా పట్టించండి. ఒక గంట అలా ఉంచితే, మాస్క్ అద్భుతమైన పనితనం కనిపిస్తుంది. తరువాత, మీ తల నుండి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో, మీ రోజువారీ షాంపూతో కడిగేయండి.

4.ఎగ్ వైట్ - తేనె

4.ఎగ్ వైట్ - తేనె

ఒక గాజు బౌల్ తీసుకుని, అందులో ఒక ఎగ్ వైట్, 3 టీస్పూన్ల ఆర్గానిక్ తేనె కలపండి. ఈ పదార్ధాలు కలిసే వరకు బాగా కలపండి. కలిపాక, ఆ మిశ్రమాన్ని మీ మాడుపై మర్దనా చేసి, ఒక గంట వదిలేయండి. మీ రోజువారీ షాంపూ తో, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

5.ఎగ్ వైట్ - గ్లిజరిన్

5.ఎగ్ వైట్ - గ్లిజరిన్

ఒక ఎగ్ వైట్, 1 టీస్పూన్ గ్లిజరిన్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ మాడుపై పట్టించి, 40-45 నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత, మీకు ఇష్టమైన షాంపూ, గోరువెచ్చని నీటితో ఆ మిశ్రమాన్ని కడిగేయండి.

6.ఎగ్ వైట్ - అలోవేరా జెల్

6.ఎగ్ వైట్ - అలోవేరా జెల్

2-3 టేబుల్ స్పూన్ల అలోవేరా జెల్ తో ఒక ఎగ్ వైట్ ని కలిపి తరువాతి మాస్క్ తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని మీ మాడుకు పట్టించి, 40-45 నిమిషాల పాటు బాగా ఆరనివ్వండి. మీ రోజువారీ షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

7.ఎగ్ వైట్ - గ్రీన్ టీ

7.ఎగ్ వైట్ - గ్రీన్ టీ

తియ్యగాలేని ఒక కప్పు గ్రీన్ టీ తీసుకుని ఒక ఎగ్ వైట్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ మాడు భాగంపై మర్దనా చేసి, 40-45 నిమిషాల పాటు వదిలేస్తే మంచిది, తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

8.ఎగ్ వైట్ - విటమిన్ E ఆయిల్

8.ఎగ్ వైట్ - విటమిన్ E ఆయిల్

ఆయిల్ కలిగిన 2 విటమిన్ E కాప్సిల్స్ ను, ఒక ఎగ్ వైట్ తో కలపండి. ఈ ఫలితాల నిచ్చే మాస్క్ ను మీ మాడుపై అలాగే జుట్టు కుదుళ్ళకు పట్టించండి. ఈ మాస్క్ ను 40 నిమిషాల పాటు ఉంచి, మీ రోజువారీ షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

English summary

DIY Egg White Hair Masks That Can Make Rough Hair Soft

DIY Egg White Hair Masks That Can Make Rough Hair Soft ,
Story first published: Tuesday, January 9, 2018, 9:00 [IST]