అన్ని రకాల శిరోజాలకు సరిపడే DIY హెయిర్ మాస్క్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఈ రోజుల్లో బిజీ బిజీ లైఫ్ స్టైల్ వలన శిరోజాల సంరక్షణకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. అందువలన అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు చిట్లిపోవడం, డేమేజ్ అవడం, హెయిర్ ఫాల్ సమస్యలు ఎదురవుతాయి.

ఇప్పుడు, మార్కెట్ లో జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తామని చెప్పుకునే అనేకరకాల ఫాన్సీ షాంపూస్ అలాగే ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కెమికల్స్ కలిగి ఉండటం శిరోజాల ఆరోగ్యానికి మంచిది కాదు.

Diy Hair Masks For All Kinds Of Hair

మీరు చేయవలసిందల్లా సహనంగా మీ శిరోజాలకై సమయాన్ని కేటాయిస్తే ఈ కెమికల్స్ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం రాదు. పార్లర్ కి వెళ్లి అక్కడ గంటలు గంటల సమయాన్ని కేటాయించే వీలు మనలో చాలా మందికి కలుగదు. అంతేకాక, ఈ ట్రీట్మెంట్స్ ఖర్చులు కూడా కొన్నిసార్లు ఎక్కువే.

అందువలన, ఈ సింపుల్ హెయిర్ మాస్క్స్ తో హెయిర్ ను చక్కదిద్దుకోవచ్చు.

ఇంటివద్దే శిరోజాల సంరక్షణకై సులభంగా రెమెడీస్ ని పాటించడం వలన హెయిర్ ను అన్ని రకాల ఇబ్బందుల నుంచి సంరక్షించుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో ఇంటి వద్దే సులభంగా చేసుకునే DIY మాస్క్స్ గురించి వివరించాము. మీ హెయిర్ టైప్ ఏదైనా హెయిర్ సమస్య ఏదైనా అందుకు తగిన మాస్క్ ని వాడి ఉపశమనం పొందవచ్చు.

మరి ఈ మాస్క్స్ ని ప్రయత్నించి ప్రయోజనం పొందండి మరి.

1. మాయిశ్చరైజింగ్:

1. మాయిశ్చరైజింగ్:

డ్రై హెయిర్ తో ఎదురయ్యే సమస్యలు అనేకం. డ్రై హెయిర్ సమస్య నుంచి రక్షణ పొందేందుకు ఈ హెయిర్ మాస్క్ ను వాడితే ప్రయోజనం పొందవచ్చు. డ్రై స్కాల్ప్ ని నరిష్ చేయడానికి కూడా ఈ మాస్క్ ఉపయోగపడుతుంది. ఈ మాస్క్ తయారీ కోసం మీరు కాస్తంత ఆలివ్ ఆయిల్ ను మరికాస్త పెరుగును తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఇది చర్మం మరియు శిరోజాల సంరక్షణకు ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో మాయిశ్చరైజింగ్ గుణాలు అధికం. ఈ రెండిటినీ మిక్స్ చేస్తే హెయిర్ నరిషింగ్ మాస్క్ సిద్ధమవుతుంది. పెరుగుని ఆలివ్ ఆయిల్ లో కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేసి ఆ తరువాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత వాష్ చేసి రిన్స్ చేస్తే చాలు.

2. క్లారిఫయింగ్:

2. క్లారిఫయింగ్:

స్కాల్ప్ యాక్నే మరియు డాండ్రఫ్ సమస్యలతో బాధపడే వారికి ఈ మాస్క్ ఉపయోగకరంగా ఉంటుంది. ఫేస్ పై డెడ్ సెల్స్ ఉన్నప్పుడు స్క్రబ్ ని ఎలా వాడతామో అదే విధంగా స్కాల్ప్ కి కూడా స్క్రబ్ అవసరం ఉంటుంది. ఇందుకోసం, ఉప్పు నుంచి స్క్రబ్ ను తయారుచేసుకోవాలి. అందులో కాస్తంత నిమ్మరసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రబీ చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి తొలగిపోతాయి. ఈ ప్రాసెస్ తరువాత హెయిర్ ను వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే సాల్ట్ అనేది డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. ఆయిల్ అనేది స్కాల్ప్ మరింత డ్రై గా మారకుండా సంరక్షిస్తుంది. నిమ్మరసం అనేది స్కాల్ప్ లోని పిహెచ్ లెవెల్స్ ని నియంత్రణలో ఉంచుతుంది.

3. ఎక్ట్రా కండిషనింగ్:

3. ఎక్ట్రా కండిషనింగ్:

కొన్నిసార్లు రెగ్యులర్ కండీషనర్స్ అనేవి హెయిర్ ను హైడ్రేట్ చేసేందుకు సరిపోవు. అటువంటి సమయాల్లో, కొబ్బరి నూనె మరియు తేనెను కలిపి ఒక హెయిర్ ప్యాక్ ను తయారుచేసుకుని అప్లై చేసుకోవాలి. కొబ్బరి నూనె స్కాల్ప్ లోకి ఇంకిపోయి హైడ్రేట్ చేస్తుంది. వెంట్రుకలను లోపల నుంచి హైడ్రేట్ చేస్తుంది. తేనె అనేది హెయిర్ కు మెరుపును అందిస్తుడ్ని. ఈ రెండు ఇంగ్రిడియెంట్స్ ను బాగా కలిపి హెయిర్ కు అప్లై చేసుకోవాలి. వెంట్రుకల చివర్లకు బాగా ఫోకస్ ఇవ్వాలి. ఇక్కడే హెయిర్ డేమేజ్ ఎక్కువగా జరుగుతుంది. ఆ తరువాత 20 నిముషాల తరువాత రెగ్యులర్ గా మీరు ఏ విధంగా హెయిర్ ను వాష్ చేసుకుంటారో అదే ప్రాసెస్ లో హెయిర్ ను వాష్ చేయాలి.

4. గ్రోత్ స్టిములేటింగ్ మాస్క్:

4. గ్రోత్ స్టిములేటింగ్ మాస్క్:

మనం ఆశించినంత వేగంగా మన జుట్టు పెరుగుదల ఉండదు. ఎగ్స్ ని హెయిర్ కేర్ కి వినియోగించడం ద్వారా శిరోజాల ఎదుగుదలను కొంత వరకు ప్రోత్సహించవచ్చు. ఎగ్స్ లో హెయిర్ గ్రోత్ ని పెంపొందించే ప్రోటీన్స్ కలవు. ఈ ప్యాక్ ను తయారుచేసేందుకు మీరు ఒక ఎగ్ ను బ్రేక్ చేసి బాగా విస్క్ చేసి హెయిర్ పై అప్లై చేయాలి. మీ హెయిర్ పొడవును దృష్టిలో ఉంచుకుని ఎగ్స్ ను తీసుకోవాలి. పొడవాటి హెయిర్ ఉన్నవాళ్లకు ఒకటికంటే ఎక్కువ ఎగ్స్ అవసరపడతాయి. ఈ ఎగ్ ప్యాక్ ను హెయిర్ కు అప్లై చేసుకుని షవర్ క్యాప్ తో హెడ్ ను కవర్ చేసుకోండి. ముప్పై నిమిషాల తరువాత హెయిర్ ను వాష్ చేసి రిన్స్ చేసుకోండి.

5. పిహెచ్ బ్యాలెన్సింగ్:

5. పిహెచ్ బ్యాలెన్సింగ్:

కొంతమందికి స్కాల్ప్ లో ఎక్కువ సెబమ్ ఉత్పత్తి అవుతుంది. అందువలన యాక్నే తలెత్తుతుంది. ఇటువంటి స్కాల్ప్ కి పిహెచ్ బ్యాలెన్సింగ్ ట్రీట్మెంట్ అవసరపడుతుంది. ఇందుకోసం, ఒక నిమ్మకాయ లోంచి సేకరించిన రసంలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వినేగార్ ని కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని షాంపూ చేసిన తరువాత స్కాల్ప్ పై అప్లై చేయాలి. ఈ ట్రీట్మెంట్ వలన స్కాల్ప్ పై ఎక్కువగా ఆయిల్ పేరుకుపోదు అలాగే డాండ్రఫ్ సమస్య కూడా వేధించదు. ఈ లిక్విడ్ తో స్కాల్ప్ ని మసాజ్ చేసి షవర్ క్యాప్ ని ధరించాలి. పది నుంచి పదిహేను నిమిషాల తరువాత వెచ్చటి నీటితో హెయిర్ ను వాష్ చేసుకోవాలి. దీని తరువాత కండిషనర్ ని వాడవద్దు.

6. మెరుపు కోసం:

6. మెరుపు కోసం:

ఒక ఎగ్ లో కొంత కొబ్బరి నూనెను అలాగే ఆలివ్ ఆయిల్ ను కలపాలి. మీ హెయిర్ లెంత్ ని బట్టీ ఆయిల్మోతాదును ఎంచుకోవాలి. ఈ పదార్థాలని బాగా కలిపి శిరోజాల మొదళ్ళ నుంచి చివర్లకు బాగా అప్లై చేయాలి. ఆ తరువాత షవర్ క్యాప్ ని అప్లై చేయాలి. ఈ మాస్క్ ని అరగంట పాటు తలపై ఉంచాలి. ఆ తరువాత మీ హెయిర్ ను మామూలుగానే వాష్ చేసుకోవాలి. డ్రై గా హెయిర్ మారడం వలన షైన్ ని కోల్పోతుంది. కాబట్టి, ఈ హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ వలన మీ శిరోజాలకు మెరుపు వస్తుంది. ఈ ప్యాక్ ని ప్రయత్నించి షైన్ ని పొందండి మరి.

English summary

Diy Hair Masks For All Kinds Of Hair

Diy Hair Masks For All Kinds Of Hair,hair masks for all kinds for hair, hair masks, different hair masks for hair, diy hair mask