For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో తయారుచేసుకునే సహజమైన మందార నూనె

ఇంట్లో తయారుచేసుకునే సహజమైన మందార తల నూనె

|

ఈ కాలంలో జుట్టు సన్నబడిపోవటం చాలామంది స్త్రీలకి సాధారణంగా ఉండే సమస్య. విపరీత పరిస్థితులు, కాలుష్యం ఉన్న వాతావరణం వల్ల మన జుట్టు ఆరోగ్యం రోజురోజుకీ దెబ్బతింటుంది. నూనెలు రాస్తూ జుట్టును ఆరోగ్యకరంగా ఉంచటం తప్పనిసరి లేకపోతే ప్రతిరోజూ వాతావరణ ఒత్తిడి వల్ల జుట్టుకి నష్టం జరుగుతుంది.

జుట్టుకి రాసుకునే నూనెలు జుట్టుకు పోషణనిచ్చి, కండీషన్ చేసి అనేక జుట్టు సంబంధ సమస్యలని పరిష్కరిస్తాయి. క్రమం తప్పకుండా జుట్టుకి నూనె రాసుకోవటం వల్ల జుట్టు పెరుగుతుంది. కానీ మీ జుట్టుకి తగిన నూనెను ఎంచుకోవటం ముఖ్యం. చాలా బ్రాండ్లకి చెందిన నూనెలు మార్కెట్లో దొరుకుతున్నాయి, కానీ వాటిల్లో రసాయనాలు నిండి వుండి మీ జుట్టుకి దీర్ఘకాలంలో ఏ మంచీ జరగదు.

DIY Hibiscus Hair Oil For Long & Strong Hair

మంచి ఆరోగ్య లాభాలనిచ్చే సురక్షిత హెయిర్ ఆయిల్ ను వాడటానికి దీన్ని మీరు ఇంట్లోనే తయారుచేసుకోవటమే మంచిది. ఇంట్లో తయారుచేసుకునే నూనెల్లో జుట్టుకి మంచిది మందార నూనె. ఇది జుట్టుకి చాలా పోషణనిచ్చి జుట్టు పొడుగ్గా, బలంగా పెరిగేలా చేస్తుంది.

బలమైన జుట్టుకి ఇంట్లో తయారుచేసుకునే నూనె మనం ఎందుకు వాడాలి?

బలమైన జుట్టుకి ఇంట్లో తయారుచేసుకునే నూనె మనం ఎందుకు వాడాలి?

ఇంట్లో తయారుచేసుకునే నూనెలని ప్రాచీనకాలం నుండి వాడుతూనే ఉన్నారు, ఇప్పటికీ చాలా ఇళ్లల్లో వాడుతుంటారు. మీకు సమస్యల్లేని,బలమైన, పొడవైన జుట్టు కావాలంటే, మీరు ఇలా సహజమైన నూనెలనే క్రమం తప్పకుండా వాడటం మంచిది.

జుట్టుకి మందారనూనె వాడటం వలన లాభాలు

జుట్టుకి మందారనూనె వాడటం వలన లాభాలు

-జుట్టు ఊడిపోయే సమస్యపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.

-జుట్టుకి సహజమైన కండీషనింగ్ చేస్తుంది.

-మీ జుట్టును ఒత్తుగా మారుస్తుంది.

-ఇది మీ జుట్టును మృదువుగా, కాంతివంతంగా, పట్టులా మారుస్తుంది.

-జుట్టును బలంగా, కాంతివంతంగా మారుస్తుంది.

-నెరసిపోయిన జుట్టును మామూలుచేసి, సమయానికి ముందే నెరవటాన్ని నివారిస్తుంది.

మందార నూనెను ఎలా తయారుచేయాలి?

మందార నూనెను ఎలా తయారుచేయాలి?

మీకు కావాల్సినవి ;

-మందార పువ్వులు -5

-మందార ఆకులు -5

-100 ఎంఎల్ (అరకప్పు) కొబ్బరినూనె

తయారీ ;

తయారీ ;

-మందార పువ్వులు ఆకులను శుభ్రంగా కడగండి. గుడ్డతో పొడిగా తుడవండి.

-మందార పువ్వులు,ఆకులను మెత్తటి గుజ్జులా చేయండి.(మీరు వీటిని మిక్సీ పట్టి మెత్తటి పేస్టులా కూడా చేయచ్చు.)

-పెనంలో నూనెను వేయండి. వేడి చేసాక, ఈ గుజ్జును వేయండి. పోషకాలు ఎక్కువ ఉండే కోల్డ్ ప్రెస్డ్ నూనెను,మామూలు నూనెలకన్నా వాడటం మంచిది.

-పొగలు వచ్చేదాక నూనెను వేడిచేయండి. తర్వాత స్టవ్ కట్టేయండి.

తయారీ

తయారీ

-నూనెను వడకట్టండి. రెండు చెంచాలు పక్కనపెట్టి వెంటనే వాడుకోండి. మిగతాది భవిష్యత్తులో వాడుకోటానికి ఎయిర్ టైట్ సీసాలో పెట్టుకోండి.

-పక్కనబెట్టిన నూనెను మీ కుదుళ్ళకి పదిహేను నిమిషాలపాటు పట్టించుకోండి. ఈ నూనె మిశ్రమం మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి.చల్లబడ్డాకే తలకి రాసుకోండి.తలకి పట్టించాక, వెంట్రుకల చివర్ల వరకూ పాయలుగా రాసుకోండి. నెమ్మదిగా వేలికొనలతో తలంతా మసాజ్ చేసుకోండి. 45 నిమిషాలు అలానే వదిలేయండి. కావాలంటే రాత్రంతా కూడా ఉంచేసుకోవచ్చు.

-మైల్డ్ , సల్ఫేట్ లేని షాంపూను వాడి తలంటుకోండి.షాంపూ తర్వాత కండీషనర్ రాసుకోండి. కొంతమంది హెయిర్ కండీషనింగ్, పోషణ,బలం కోసం మందార సంబంధ షాంపూని వాడతారు.

-తలంటుకోడం అయ్యాక, టవల్ తో నీళ్ళను పిండేసుకోండి.

-జుట్టును సహజంగా ఆరనివ్వండి.

పైన చెప్పిన మందార నూనె చిట్కాను తరచుగా పాటించండి. మీరు వారానికి 2 నుంచి 3 సార్లు ఇది పాటించవచ్చు.

English summary

DIY Hibiscus Hair Oil For Long & Strong Hair

Hair oils work by keeping your hair nourished and conditioned and also solves plenty of hair-related issues. Oiling your hair regularly promotes hair growth. You can make a hair oil at home using just hibiscus flowers and some basic ingredients from your kitchen. Hibiscus hair oil strengthens the roots and eventually prevents hair loss due to constant hair fall.
Desktop Bottom Promotion