For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడవైన, బలమైన జుట్టుకోసం జుట్టుకు రాసుకుని వదిలేసే డిఐవై వేప హెయిర్ టానిక్

|

జుట్టుకి రాసుకుని వదిలేసే హెయిర్ టానిక్స్ తలపై తేమను బ్యాలెన్స్ చేసి ఉంచుతాయి, పాడుచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి లేదా ఇతర వాతావరణ కారణాల నుంచి మీ జుట్టును కాపాడతాయి. ఇవేకాక, ఈ నూనెలతో మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి.

జుట్టుకి రాసుకుని వదిలేసే హెయిర్ టానిక్స్ లో వివిధ రకాలు షాపుల్లో దొరుకుతాయి. అయితే ఇక మీరు ఊహించుకోవచ్చు, ఇలాంటి హెయిర్ టానిక్స్ లో మెజారిటీవి హానికారక కెమికల్స్ తో నిండివుంటాయని. ఇలా రసాయనాలతో నిండి వుండిన ఉత్పత్తులను వాడటం వలన అందమైన జుట్టు వస్తుంది కానీ దీర్ఘకాలంలో మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుంది.

DIY Leave-in Neem Hair Tonic For Long And Strong Hair

అందుకనే మార్కెట్లో దొరికే హెయిర్ టానిక్స్ బదులు సహజమైన, ఇంట్లో తయారైన వాటిని వాడటం మంచిది. అందులో వాడే సురక్షితమైన పదార్థాలు సహజంగా ఉండి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

ఈరోజు బోల్డ్ స్కైలో, మేము అలాంటి ఒక అద్భుతమైన జుట్టుకి రాసుకుని వదిలేసే హెయిర్ టానిక్ తయారుచేసుకునే పద్ధతి వివరించబోతున్నాం. ఇందులో ముఖ్యపదార్థం వేపాకు పొడి. జుట్టు సమస్యలకి ముఖ్యంగా వాడే వేప, అనేక సమస్యలను నయం చేసి, ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు పెరిగేలా చేస్తుంది.

ఈ సులభమైన, శక్తివంతమైన డిఐవై జుట్టుకి రాసుకుని వదిలేసే వేప హెయిర్ టానిక్ లో హానికరమైన కెమికల్స్ ఉండవు. ఇది మీ తల పైన తేమను బ్యాలెన్స్ చేసి, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ఇంకా ఈ హెయిర్ టానిక్ రాసుకోవడం వలన జుట్టు కుదుళ్ళు బలపడి, కొత్త వెంట్రుకలు కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది.

జుట్టుకి పట్టించి వదిలేసే హెయిర్ టానిక్ ను తయారుచేయటానికి రెసిపి ఇదిగో.

మీకు కావాల్సినవి;

మీకు కావాల్సినవి;

1 కప్పు డిస్టిల్డ్ నీరు

1 చెంచా వేపాకు పొడి

1 చెంచా ముద్దబంతి పువ్వు పొడి

5-6 చుక్కల రోజ్ మేరీ నూనె

5-6 చుక్కల మిర్ర్ సుగంధ నూనె

1 చెంచా బాదం నూనె

తయారుచేసే పద్ధతి;

తయారుచేసే పద్ధతి;

-ఒక బాండీలో నీరు పోసి మరగనివ్వండి.

-వేపాకు, ముద్దబంతి పువ్వుల పొడిని వేయండి.

-మూతపెట్టి మొత్తం చక్కగా మరగనివ్వండి.

-5-10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయండి.

-ఫ్యాన్ కింద పెట్టి చల్లబడనివ్వండి.

-చల్లబడ్డాక సుగంధ నూనెను, బాదం నూనెను వేయండి.

-బాగా కలిపి తయారైన టానిక్ ను గాజు సీసాలో పోయండి.

ఎలా వాడాలి ;

ఎలా వాడాలి ;

-ఈ హెయిర్ టానిక్ ను శుభ్రమైన, పొడి జుట్టుపై వాడండి.

-2-3 చుక్కల టానిక్ ను మీ అరచేతుల్లో వేసుకోండి.

-రెండు చేతుల్లో బాగా రుద్ది తల మాడుపై పట్టించండి.

-రెండు నిమిషాలపాటు నెమ్మదిగా మసాజ్ చేసి తల దువ్వుకోండి.

-ఈ హెయిర్ టానిక్ ను తలపై రోజంతా అలానే వదిలేయండి.

ఎన్నిసార్లు వాడాలి;

ఎన్నిసార్లు వాడాలి;

ఈ ఇంట్లో తయారైన హెయిర్ టానిక్ ను వారానికి 3-4 సార్లు వాడి మంచి ప్రభావవంతమైన ఫలితాలు చూడండి.

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

వేపాకు-

జుట్టు సమస్యలను నయం చేయటానికి సహజ పదార్థంగా దీన్ని వాడటం ప్రసిద్ధి, ప్రత్యేకంగా ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు కోసం అందరూ వాడటానికి ఇష్టపడే పదార్థం వేపాకు.

ఇందులో జుట్టుకి లోతైన కండీషనింగ్ అందించే శక్తి వుంది, అలా పొడిబారటాన్ని, రఫ్ గా ఉండటాన్ని తగ్గిస్తుంది. ఆఖరుగా, వేపాకులో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక గుణాలు జుట్టు కుదుళ్ళ వద్ద వచ్చే ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

ముద్దబంతి (కలెన్డ్యులా)

ఈ మొక్కలో తిరిగి అభివృద్ధి చెందించే లక్షణాలుంటాయి. ఇవి జుట్టు ఊడిపోవటాన్ని నయం చేయటమేకాదు, కొత్త, ఆరోగ్యకరమైన వెంట్రుకలు పెరగటంలో కూడా సాయపడతాయి.

ఇంకా,జుట్టుకి ఈ దీన్ని రాసుకోవటం వలన చిరాకు తెప్పించే సమస్యలైన చుండ్రు, వెంట్రుక కుదుళ్ళ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ మొక్క వెంట్రుకలను బలపర్చి విరిగిపోకుండా చూస్తుంది.

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

రోజ్ మేరీ నూనె-

రోజ్ మేరీ నూనెను జుట్టు సంరక్షణలో ఎక్కువగా వాడతారు. దీన్ని వాడటం వలన తలపై రక్తప్రసరణ మెరుగయ్యి, జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది.

ఇది జుట్టు సన్నబడిపోయే సమస్యకి కూడా మంచి చిట్కా. ఇది జుట్టు మందాన్ని పెంచి, వత్తుగా కన్పడేలా చేస్తుంది. ఆఖరుగా దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లయిన ఎక్జిమా వంటి వాటి వల్ల మాడుపై వచ్చే మంట, దురదలకి కూడా చికిత్సగా వాడతారు.

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

మిర్ర్ సుగంధ నూనె-

పొడిజుట్టుకి ఇది సరిపోతుంది, మిర్ర్ సుగంధనూనె జుట్టుపాయలకి లోతైన పోషణనిచ్చి మాయిశ్చర్ నిలుపుకునేలా చేస్తుంది.

ఈ అద్భుతమైన నూనెను తలకి రాసుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉండి, అన్ని సమయాల్లో మాయిశ్చర్ నిలిచి వుంటుంది.

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

ఇందులో వాడే పదార్థాల లాభాలు ;

బాదం నూనె-

ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లతో నిండి ఉండే బాదం నూనె జుట్టు కుదుళ్ళను బలపర్చి, వెంట్రుకలు విరిగిపోవటాన్ని తగ్గిస్తుంది.

అవేకాక, బాదంనూనెలో వుండే విటమిన్లు,మినరల్స్ జుట్టును వత్తుగా చేసి కాంతివంతంగా మారుస్తుంది.

మీ జుట్టు సంరక్షణ రొటీన్ లో ఈ డిఐవై జుట్టుకు రాసుకునే హెయిర్ టానిక్ ను చేర్చి మీరెప్పుడూ కోరుకునే జుట్టును పొందండి.

English summary

DIY Leave-in Neem Hair Tonic For Long And Strong Hair

Leave-in hair tonics can optimize moisture balance in the scalp and protect your hair from the damaging free radicals or environmental factors. You can make a hair tonic at home using neem leaves. Used extensively for hair care purposes, neem is a true favourite remedy for treating a myriad of hair problems and encouraging the growth of healthy and strong hair.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more