For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మూత్ మరియు సాఫ్ట్ హెయిర్ కోసం డిఐవై పంప్కిన్ హెయిర్ మాస్క్

స్మూత్ మరియు సాఫ్ట్ హెయిర్ కోసం డిఐవై పంప్కిన్ హెయిర్ మాస్క్

|

శిరోజాల సంరక్షణ పట్ల శ్రద్ధ కనబరచక పొతే శిరోజాలు అందవిహీనంగా తయారవుతాయి. వాటి మృదుత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి, హెయిర్ కేర్ పై అమితమైన శ్రద్ధను కనబరచడం అత్యంత అవసరం. హీట్, పొల్యూషన్ వంటి వివిధ ఫ్యాక్టర్స్ వంటివి శిరోజాల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. డల్, డేమేజ్డ్ మరియు ఫ్రిజ్జీ హెయిర్ ను మేనేజ్ చేయడం అత్యంత కష్టతరం. అలా మేనేజ్ చేయలేకపోవడం వలన హెయిర్ ఫాల్, డాండ్రఫ్, డ్రై స్కాల్ప్ వంటి సమస్యలు వెంటాడుతాయి.

ఇక్కడ హెయిర్ కేర్ కి సంబంధించిన కొన్ని సులభమైన హోమ్ రెమెడీస్ గురించి చర్చించుకుందాం. ఈ రెమెడీస్ ను పాటిస్తే మీ హెయిర్ అనేది సుందరంగా తయారవుతుంది. మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ రెమెడీలో అన్నీ సహజ పదార్థాలని వినియోగించడం జరిగింది. ఇవి, వంటింట్లో సులభంగా దొరికే పదార్థాలు. ఈ మాస్క్ లో ని ముఖ్య పదార్థం పంప్కిన్. పంప్కిన్ ను కొబ్బరి నూనె మరియు తేనె వంటి పదార్థాలతో కలిపి తయారు చేసే హెయిర్ మాస్క్ అనేది డల్ మరియు డేమేజ్డ్ హెయిర్ ను రేపెయిర్ చేసేందుకు తోడ్పడే అత్యంత పెర్ఫెక్ట్ మాస్క్.

DIY Pumpkin Hair Mask For Soft And Smooth Hair

డిఐవై పంప్కిన్ హెయిర్ మాస్క్ ను తయారుచేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం:

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

ఒకటిన్నర కప్పు పంప్కిన్ జ్యూస్

పావు కప్పు కొబ్బరి నూనె

రెండు టేబుల్ స్పూన్ల తేనే

తయారు చేసే విధానం?

తయారు చేసే విధానం?

1. పంప్కిన్ ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆ తరువాత తురిమి వాటిలోంచి రసాన్ని సేకరించండి.

2. కొబ్బరి నూనెను పంప్కిన్ రసంలో కలపండి. కొబ్బరి నూనె గడ్డకట్టి ఉంటే నూనెను కరిగించండి. ఆ తరువాత పంప్కిన్ రసాన్ని జోడించండి.

3. చివరగా, రా హనీను ఈ మిశ్రమానికి జోడించండి.

4. ఈ మిశ్రమాన్ని బాగా కలిపండి. ఎగ్ బీటర్ లేదా బ్లెండర్ ను ఉపయోగించి మిశ్రమాన్ని బాగా కలపండి.

5. ఈ మిశ్రమాన్ని లేదా మాస్క్ ను ఎయిర్ టైట్ గ్లాస్ జార్ లో చల్లటి ప్రదేశంలో భద్రపరచుకుని వాడుకోవచ్చు.

6. ఈ విధంగా ఈ మిశ్రమం రెండు మూడు రోజుల వరకూ నిలవ ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఎలా అప్లై చేసుకోవాలి?

1. మీ హెయిర్ ను నాలుగైదు సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటే అప్లై చేసుకోవడం సులభంగా ఉంటుంది.

2. ఇప్పుడు సెక్షన్ల వారీగా తడి జుట్టుపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవడం మొదలుపెట్టండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసేముందు మీ హెయిర్ ను తడి చేసుకోండి. అప్పుడు ఈ మిశ్రమాన్ని సులభంగా అప్లై చేసుకోవచ్చు.

3. హెయిర్ బ్రష్ సహాయంతో టిప్స్ నుంచి రూట్స్ వరకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోండి.

4. మీ హెయిర్ ను బన్ లా ముడివేసుకోండి. ఆ తరువాత షవర్ క్యాప్ తో కవర్ చేయండి.

5. ఈ మాస్క్ ను హెయిర్ పై ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంచండి.

6. ముప్పై నిమిషాల తరువాత నార్మల్ షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోండి. ఆ తరువాత కండిషనర్ ను అప్లై చేసుకోండి. హెయిర్ ను ఎప్పటిలాగానే స్టయిల్ చేసుకోండి. ఇలా చేస్తే మీ హెయిర్ సాఫ్ట్ గా, సిల్కీగా అలాగే స్మూత్ గా మారుతుంది.

పంప్కిన్ ద్వారా శిరోజాలకు అందే ప్రయోజనాలు

పంప్కిన్ ద్వారా శిరోజాలకు అందే ప్రయోజనాలు

పంప్కిన్ లో ఉండే అనేక సౌందర్య పోషక గుణాలు శిరోజాల సంరక్షణకు అనేక విధాలా తోడ్పడతాయి. పంప్కిన్ లో యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన విటమిన్స్ లభ్యమవుతాయి. విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. పంప్కిన్ అనేది దెబ్బతిన్న శిరోజాలను రేపెయిర్ చేసేందుకు తోడ్పడుతుంది. ఎండవేడికి దెబ్బతిన్న శిరోజాలను తిరిగి కోలుకునేలా చేసేందుకు పంప్కిన్ లో లభించే బీ విటమిన్స్ తోడ్పడతాయి. తద్వారా, హెయిర్ అనేది మరింత స్మూత్ గా అలాగే సాఫ్ట్ గా మారుతుంది.

కొబ్బరి నూనె ద్వారా అందే ప్రయోజనాలు:

కొబ్బరి నూనె ద్వారా అందే ప్రయోజనాలు:

కొబ్బరి నూనె అనేది అనేక హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అలాగే యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ సమృద్ధిగా లభిస్తాయి. హెయిర్ గ్రోత్ ను పెంపొందించి హెయిర్ ని దట్టంగా అలాగే ఆరోగ్యవంతంగా మార్చేందుకు కొబ్బరి నూనె తోడ్పడుతుంది. వీటితో పాటు హెయిర్ లోని మాయిశ్చర్ ను నిలిపివేసేందుకు హెయిర్ ను స్మూత్ గా అలాగే ఫ్రిజ్ ఫ్రీగా చేసేందుకు కొబ్బరి నూనె తోడ్పడుతుంది.

తేనె ద్వారా అందే ప్రయోజనాలు:

తేనె ద్వారా అందే ప్రయోజనాలు:

తేనె అనేది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తద్వారా, శిరోజాలను హైడ్రేట్ చేస్తుంది. డ్రై మరియు డేమేజ్డ్ హెయిర్ ను రేపెయిర్ చేస్తుంది. తేనెలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ను అలాగే స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే, ఇందులో లభించే యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ డాండ్రఫ్ మరియు డ్రై స్కాల్ప్ సమస్యను అరికడతాయి.

English summary

DIY Pumpkin Hair Mask For Soft And Smooth Hair

Dull, damaged and frizzy hair is something very difficult to manage. Here we'll be discussing a simple DIY remedy to make your hair look as luscious and healthy as before. The main ingredient of this mask is nothing but pumpkin. Pumpkin mixed with other ingredients like coconut oil and honey makes for a perfect mask to repair your dull and damaged hair.
Story first published:Monday, September 3, 2018, 17:31 [IST]
Desktop Bottom Promotion