ఫ్రంటల్ హెయిర్ లాస్ నుంచి సహజసిద్ధంగా ఉపశమనం పొందడమెలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

రిసీడింగ్ హెయిర్ లైన్ లేదా ఫ్రంటల్ హెయిర్ లాస్ అనే సమస్య ఇప్పుడు అతి సాధారణమైపోయింది. ఎక్కువగా పురుషులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. 30 ఏళ్ళు దాటిన మహిళల్లో కూడా ఈ సమస్య ఉత్పన్నమవడం విచారకరం. ఫ్రంటల్ ఫైబ్రోసింగ్ అలోపీశియా అని దీనిని అంటారు. ఇది ఇబ్బందికర సమస్య. ఈ సమస్య వలన అపియరెన్స్ దెబ్బతింటుంది. వివిధ ఆరోగ్య పరిస్థితుల వలన ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని మెడికేషన్స్ కి అలర్జీలు రావడం, దెబ్బతిన్న జుట్టు వలన ఈ సమస్య ఎదురవవచ్చు. తలపై ఫ్రంట్ పార్ట్ లో వచ్చే హెయిర్ లాస్ ను ట్రీట్ చేయడానికి మార్కెట్ లో ఎన్నో ఖరీదైన మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే సరైన ఫలితాన్ని ఇస్తాయి.

అదృష్టవశాత్తూ, ఈ సమస్యను సులభమైన సహజపద్ధతులలోనే తొలగించుకోవచ్చు. ఈ సులభ పద్దతుల వలన మీ జేబులకు చిల్లులు ఏర్పడవు. మీ తలలోని ఫ్రంట్ పార్ట్ లో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Natural ways To Treat Frontal Hair Loss

ఈ ఆర్టికల్ లో ఫ్రంటల్ హెయిర్ లాస్ నుంచి ఉపశమనం పొందే విధానాలని వివరించాము. వీటిని పాటించి ఈ సమస్య నుంచి రిలీఫ్ ను అందుకోండి.

1. మెంతులు:

1. మెంతులు:

ఎలా వాడాలి:

గుప్పెడు మెంతులను నీటిలో అయిదారు గంటల పాటు నానబెట్టండి.

ఆ తరువాత వాటిని మ్యాష్ చేసి ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను కలపండి.

ఈ పేస్ట్ ను ప్రభావితం ప్రాంతంపై అప్లై చేయండి.

ఒక గంట తరువాత ఈ పేస్ట్ ను తొలగించండి.

ఫ్రీక్వెన్సీ:

వారానికి రెండుసార్లు ఈ అద్భుతమైన రెమెడీని పాటించడం ద్వారా ఫ్రంటల్ హెయిర్ లాస్ ను తగ్గించుకోవచ్చు.

2. క్యాంఫోర్ ఆయిల్:

2. క్యాంఫోర్ ఆయిల్:

ఎలా వాడాలి:

అర టీస్పూన్ క్యాంఫోర్ ఆయిల్ లో రెండు టీస్పూన్ల కర్డ్ తో పాటు మూడు లేదా నాలుగు చుక్కల జొజోబా ఎసెన్షియల్ ఆయిల్ ని కలపాలి.

ఈ మిశ్రమంతో ప్రభావిత ప్రాంతాన్ని మసాజ్ చేయాలి.

దాదాపు 30 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో అలాగే రెగ్యులర్ షాంపూతో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేసుకోండి.

ఫ్రీక్వెన్సీ:

ఈ హోమ్ మెడ్ మాస్క్ ని నెలకు ఒక సారి వినియోగించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

3. ఆనియన్ జ్యూస్:

3. ఆనియన్ జ్యూస్:

ఆనియన్ నుంచి జ్యూస్ ని సేకరించండి.

ఒక కాటన్ బాల్ ని ఈ జ్యూస్ లో ముంచి ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి.

రాత్రంతా దీనిని ప్రభావిత ప్రాంతంపై ఉండనివ్వండి.

ఉదయాన్నే, మీ శిరోజాలను రెగ్యులర్ షాంపూతో అలాగే గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోండి.

ఫ్రీక్వెన్సీ:

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే గుర్తించదగిన మార్పులు వస్తాయి.

4. బ్లాక్ పెప్పర్:

4. బ్లాక్ పెప్పర్:

ఎలా వాడాలి:

కొన్ని పెప్పర్ కార్న్స్ తో పౌడర్ ని సిద్ధం చేయండి.

అందులో రెండు లేదా మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపండి.

ఇలా తయారైన మిశ్రమంతో ప్రభావిత ప్రాంతాన్ని మసాజ్ చేయండి.

15 నుంచి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోండి.

ఫ్రీక్వెన్సీ:

ఈ రెమెడీని నెలకు రెండుసార్లు పాటించడం ద్వారా ఫ్రంటల్ హెయిర్ లాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

5. క్యాస్టర్ ఆయిల్ :

5. క్యాస్టర్ ఆయిల్ :

ఎలా వాడాలి:

అర టీస్పూన్ క్యాస్టర్ ఆయిల్ ను విటమిన్ ఈ క్యాప్సూల్ నుంచి సేకరించబడిన నూనెలో జోడించాలి.

ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి.

40-45 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై ఉండనివ్వాలి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఆలాగే మీ రెగ్యులర్ షాంపూతో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచుకోవాలి.

ఫ్రీక్వెన్సీ

ఒక నెలలో ఈ నేచురల్ ఆయిల్ ను ఈ విధంగా రెండు లేదా మూడు సార్లు వినియోగిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

6. మందారం:

6. మందారం:

ఎలా వాడాలి:

గుప్పెడు మందార పూవులను వాటి ఆకులను గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ లో రోజ్ వాటర్ ని కలపాలి.

ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి.

30-35 నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని గోరువెచ్చటి నీటితో తొలగించాలి.

ఫ్రీక్వెన్సీ :

నెలలో రెండు సార్లు ఈ పద్దతిలో మీ స్కాల్ప్ ని గారాబం చేయడం ద్వారా ఫ్రంటల్ హెయిర్ లాస్ కి గుడ్ బై చెప్పవచ్చు.

7. అలోవెరా జెల్:

7. అలోవెరా జెల్:

ఎలా వాడాలి:

అలోవెరా ప్లాంట్ నుంచి జెల్ ని సేకరించండి.

ఈ జెల్ తో ప్రభావిత ప్రాంతంపై మసాజ్ చేయండి.

40-45 నిమిషాల వరకు ఈ జెల్ ని ప్రభావిత ప్రాంతంపై ఉండనివ్వండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోండి.

ఫ్రీక్వెన్సీ:

ఈ రెమెడీని వారానికి రెండు లేదా మూడు సార్లు పాటించడం ద్వారా ఫ్రంటల్ హెయిర్ లాస్ సమస్య తొలగిపోతుంది.

8. ఆలివ్ ఆయిల్:

8. ఆలివ్ ఆయిల్:

ఎలా వాడాలి:

వెచ్చటి ఆలివ్ ఆయిల్ తో ప్రభావిత ప్రాంతంపై మసాజ్ చేయాలి.

ఆ తరువాత రాత్రంతా దీనిని అలాగే ఉండనివ్వాలి.

ఉదయాన్నే, ఈ ఆయిల్ ను గోరువెచ్చటి నీటితో అలాగే రెగ్యులర్ షాంపూతో శుభ్రపరచుకోవాలి.

ఫ్రీక్వెన్సీ:

ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటించడం వలన మంచి ఫలితం పొందవచ్చు.

English summary

8Natural ways To Treat Frontal Hair Loss

In technical terms, this embarrassing hair condition is known as frontal Fibrosing Alopecia. And, it goes without saying that this problem can be a nightmare to deal with. A variety of factors like health-related issues, allergy to certain medication, severely damaged hair can cause this harrowing condition.
Story first published: Saturday, April 21, 2018, 8:00 [IST]