For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రే హెయిర్ సమస్యకు ఈ సింపుల్ హ్యక్స్ తో పరిష్కారం పొందండి!

|

గ్రే కలర్ అందంగానే ఉంటుంది. అయితే, ఈ కలర్ అనేది శిరోజాలకు అస్సలు నప్పదు. గ్రే టీ షర్ట్, గ్రే టాప్, గ్రే షూస్ తో స్టైలిష్ గా కనిపించవచ్చు. అయితే, గ్రే హెయిర్ తో మాత్రం స్టైలిష్ గా కనిపించలేము. అసౌకర్యంగా ఫీల్ అవుతాము. ఎందుకంటే కొంతమంది గ్రే హెయిర్ ను వృద్ధాప్యానికి సూచికగా వాడతారు. మరికొంతమంది తెలివితేటలకు సూచికగా గ్రే హెయిర్ ను పరిగణిస్తారు.

కానీ, కొన్నిసార్లు చిన్నవయసులోనే గ్రే హెయిర్ బారిన పడతారు. ఈ సమస్యను ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనంటారు. ఈ సమస్య అనేది అనేక ఫాక్టర్స్ వలన తలెత్తుతుంది. జెనెటిక్స్, పొల్యూషన్, స్ట్రెస్, పూర్ న్యూట్రిషన్, హార్మోన్ల అసమతుల్యతల వంటివి ఈ కోవలోకే వస్తాయి. మెలనిన్ అనేది తక్కువగా ఉత్పత్తి అయితే శిరోజాలలోని ప్రతి వెంట్రుక గ్రే కలర్ లోకి మారిపోతుంది.

మెలనిన్ అనే పిగ్మెంట్ వలన శిరోజాలకు సహజరంగు లభిస్తుంది. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మెలనోసైట్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. అందువలన, శిరోజాలలో పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

మార్కెట్ లో గ్రే హెయిర్ ను కవర్ చేయడం కోసం ఎన్నో రకాల డైయింగ్ ఫార్ములాస్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటి తయారీలో వాడే కెమికల్స్ వలన శిరోజాల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ప్రకృతి మాత మనకోసం ఎన్నో రకాల ఔషధాలను వెజిటబుల్స్ అలాగే ఫ్రూట్స్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. వీటిని మనం హెయిర్ కేర్ కోసం వాడితే మంచి ఫలితం పొందవచ్చు.

ఈ ఆర్టికల్ లో ఇంట్లోనే తయారుచేసుకోగలిగిన కొన్ని నేచురల్ హోంరెమెడీస్ గురించి వివరించాము. వీటితో గ్రే హెయిర్ సమస్యను మీరు సులభంగా తొలగించుకోవచ్చు.

1. ఆమ్లా/ ఉసిరి:

1. ఆమ్లా/ ఉసిరి:

ఉసిరికాయలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ గ్రే హెయిర్ సమస్యను తొలగించేందుకు ప్రభావవంతంగా తోడ్పడతాయి. అంతేకాదు, ఉసిరిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలు కూడా కలవు. ఇవి డల్ హెయిర్, హెయిర్ లాస్ అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వంటి శిరోజాల సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి.

ఎలా వాడాలి:

• ఒక ప్యాన్ లో కాస్తంత కొబ్బరినూనెను తీసుకుని అందులో కొన్ని ఎండిన ఉసిరిముక్కలను వేసి బ్రౌన్ గా మారేవరకు వరకు నూనెను వేచండి. ఎండిన ఆమ్లా ముక్కలు లేకపోతే ఆమ్లా పౌడర్ నైనా మీరు వాడవచ్చు. ఈ సొల్యూషన్ చల్లారిన తరువాత దీనిని స్కాల్ప్ పై రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. రాత్రంతా ఉంచలేకపోతే కనీసం ఒక గంట పాటు ఉంచి ఆ తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి.

2. బ్లాక్ టీ:

2. బ్లాక్ టీ:

బ్లాక్ టీ ద్వారా గ్రే హెయిర్ కు సహజ రంగును అద్దవచ్చు. హెయిర్ కేరాటిన్ ని అలాగే మెలనిన్ ని బూస్ట్ చేసే సామర్థ్యం ఇందులో కలదు. తద్వారా, హెయిర్ కు నేచురల్ పిగ్మెంట్ ను రిస్టోర్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. టానిన్ పుష్కలంగా లభించడం వలన గ్రే డిటీహెచ్ హార్మోన్ ఉత్పత్తిని నిలిపివేసి గ్రే హెయిర్ సమస్యను తొలగిస్తుంది. ఈ హార్మోన్ అనేది హెయిర్ లాస్ కి కారణమవుతుంది. అందువలన, డల్ అలాగే లైఫ్ లెస్ హెయిర్ సమస్యకు కూడా బ్లాక్ టీ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఎలా వాడాలి:

• ఒక పాట్ లో నీళ్లతో పాటు కొన్ని బ్లాక్ టీ లీవ్స్ ను జోడించండి. ఇప్పుడు కొన్నినిమిషాల పాటు మరిగించండి.

• ఈ సొల్యూషన్ చల్లారిన తరువాత హెయిర్ పై నేరుగా అప్లై చేసి గంట పాటు ఉండనివ్వండి.

• ఇప్పుడు చల్లటి నీళ్లతో రిన్స్ చేయండి.

• షాంపూ చేయకండి.

• వారానికి రెండు సార్లు ఈ పద్దతిని పాటించండి.

3. హెన్నా:

3. హెన్నా:

హెన్నా అనేది న్యాచురల్ డై. ఇందులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు కలవు. ఇవి హెయిర్ ను డార్కెన్ చేసి స్కాల్ప్ లోని పిహెచ్ లెవెల్స్ ని రిస్టోర్ చేసేందుకు తోడ్పడతాయి. స్కాల్ప్ లోని ఆయిల్ ప్రొడక్షన్ ని మెయింటైన్ చేసేందుకు కూడా ఇవి తోడ్పడతాయి.

ఎలా వాడాలి:

• ఒక ప్లాస్టిక్ బౌల్ ను తీసుకుని అందులో హెన్నాని ఉంచి దాదాపు ఎనిమిది గంటల వరకు లేదంటే రాత్రంతా నానబెట్టండి.

• బ్లాక్ టీను ఒక కప్పులోబాయిల్ చేసి రెండు నిమిషాల వరకు స్టీప్ చేయండి. ఆ తరువాత చల్లారనివ్వండి.

• హెన్నా పేస్ట్ లో ఈ టీను జోడించండి.

• ఇప్పుడు నిమ్మరసాన్ని అలాగే ఆమ్లా పౌడర్ ను ఈ మిక్శ్చర్ లో జోడించి బాగా కలిపి ఒక స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోండి. • గ్లోవ్స్ ను అప్లై చేసుకుని ఈ మిక్శ్చర్ ను మీ హెయిర్ కు అప్లికేటర్ బ్రష్ తో అప్లై చేసుకోండి.

• గ్రే హెయిర్ కు జెంటిల్ గా అప్లై చేసుకోండి.

• ఈ మిశ్రమాన్ని మీ హెయిర్ పై ఒక గంట పాటు ఉంచుకొండి లేదా పేస్ట్ ఆరేవరకు ఉంచుకోండి.

• మైల్డ్ షాంపూతో ఈ మిశ్రమాన్ని వాష్ చేయండి.

• నెలకోసారి ఈ పద్దతిని పాటించండి.

4. కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:

4. కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:

కొబ్బరి నూనె మరియు నిమ్మరసంలో గ్రే హెయిర్ ను అరికట్టే లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో శిరోజాల సంరక్షణకు అవసరమయ్యే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరి నూనెలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే లారిక్ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి గ్రేయింగ్ ప్రాసెస్ ని రివర్స్ చేసి హెయిర్ క్వాలిటీని పెంపొందిస్తాయి.

మరోవైపు, నిమ్మరసంలో విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్ఫరస్ లు లభిస్తాయి. ఇవన్నీ గ్రే హెయిర్ పై పోరాటం జరుపుతాయి.

ఎలా వాడాలి:

• ఒక పాత్రలో, మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని అలాగే కొన్ని చుక్కల కొబ్బరి నూనెను తీసుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని హెయిర్ కు అప్లై చేసుకుని స్కాల్ప్ పై జెంటిల్ గా మసాజ్ చేయాలి.

• మైల్డ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేయండి.

• వారానికి ఒకసారి ఈ రెమెడీను వాడితే మంచి ఫలితం పొందవచ్చు.

5. కర్రీ లీవ్స్ మరియు కొబ్బరి నూనె:

5. కర్రీ లీవ్స్ మరియు కొబ్బరి నూనె:

కర్రీ లీవ్స్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఏ, సీ మరియు ఈలు ఇందులో లభ్యమవుతాయి. ఇవి గ్రే హెయిర్ ను రివర్స్ చేస్తాయి. వెంట్రుకలను బలపరిచి శిరోజాలను కోమలంగా అలాగే దృఢంగా మార్చుతాయి.

ఎలా వాడాలి:

• ఒక ప్యాన్ లో కొబ్బరి నూనెను అలాగే కర్రీ లీవ్స్ ను తీసుకుని నల్లగా అయ్యేవరకు హీట్ చేయాలి.

• ఈ ఆయిల్ ను చల్లారే వరకు పక్కన ఉంచాలి.

• ఆయిల్ చల్లారాక స్కాల్ప్ పై మసాజ్ చేయండి.

• గంట పాటు అలాగే ఉంచండి.

• మైల్డ్ షాంపూతో హెయిర్ ను వాష్ చేయండి.

• ఈ రెమెడీను వారానికి రెండు మూడు సార్లు వాడండి.

6. బ్లాక్ సెసేమ్ సీడ్స్:

6. బ్లాక్ సెసేమ్ సీడ్స్:

బ్లాక్ సెసేమ్ సీడ్స్ అనేవి మీ స్కాల్ప్ ని నరిష్ చేసి హెయిర్ గ్రోత్ ను స్టిములేట్ చేయడానికి తోడ్పడతాయి. ఇవి మెలనోసైట్ యాక్టివిటీని ప్రమోట్ చేసి మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. మెలనిన్ అనే పిగ్మెంట్ వలెనే శిరోజాలకు సహజసిద్ధమైన నల్లని రంగు అందుతుంది. ఈ పిగ్మెంట్ లో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కలవు. ఇవి మీ చర్మాన్ని కోమలంగా, సాఫ్ట్ గా ఉంచుతూ మీకు ప్రశాంతమైన నిద్రను కలిగిస్తాయి.

ఎలా వాడాలి:

గ్రే హెయిర్ ను నేచురల్ గా సాల్వ్ చేయాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ సెసేమ్ సీడ్స్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మంచిది.

English summary

Say Goodbye To Grey Hair Forever With These Simple Homemade Remedies!

Dealing with grey hair problems can be quite frustrating. There are some simple and easy hacks which will keep your hair be free from grey coverage for a long time. Amla, black tea, henna, coconut oil or lemon juice could be some interesting hacks you might want to try.Get Rid Of Grey Hair Easily With These Simple Hacks!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more