జుట్టు ఊడిపోవటం ; ముఖ్య కారణాలు ఇంకా ఇంటి చిట్కాలు

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

జుట్టు ఊడిపోవటం లేదా అలోపెషియా అంటే శరీరంపై ముఖ్యంగా తలపై జుట్టు సన్నబడిపోవటం లేదా ఊడిపోవటం అని అర్థం. దీని తీవ్రత మనిషికి మనిషికి మారుతుంటుంది. ఇది అక్కడక్కడా బట్టతల కావచ్చు లేదా పూర్తిగా జుట్టు ఊడిపోవటం కావచ్చు. అంతా జుట్టు ఎందుకు ఊడిపోతోందన్న కారణంపై ఆధారపడి వుంటుంది.

మాములుగా తలపై 150000-17000 వెంట్రుకలు ఉంటాయి. ఈ మందాన్ని అలానే ఆరోగ్యంగా ఉంచటం కోసం ఎంత వెంట్రుకలు ఊడిపోతాయో అన్ని కొత్త వెంట్రుకలు అక్కడ పెరగాల్సి ఉంటుంది. అలా జరగనప్పుడు మనం దాన్ని జుట్టు ఊడిపోయే లేదా సన్నబడే సమస్యగా పరిగణిస్తాం.

Heres how to stop hair fall and regrow hair naturally.

ఈ వెంట్రుకలు ఊడిపోవటం, కొత్తవి ఆ స్థానంలో మొలవటం అనేది మూడు దశలలో జరుగుతుంది –

1.అనాజెన్ ; వెంట్రుక పొడవుగా పెరిగే సమయం

2.కెటాజెన్ ; మార్పు కన్పించే చిన్న దశ

3.టెలోజెన్ ; విశ్రాంత పెద్ద దశ. వెంట్రుకలు ఈ దశలో చాలా ఎక్కువ కాలం ఉంటాయి.

4.ఎక్సోజెన్ ; ఈ దశలోనే వెంట్రుకలు రాలిపోతాయి.

ఎక్సోజెన్ తర్వాత, పాత వెంట్రుకల స్థానంలో వెంట్రుక కుదురులో కొత్త వెంట్రుక మొలిచి అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ప్రతి వెంట్రుక ఇదే వలయాన్ని పాటిస్తుంది.

English summary

Hair Loss: Major Causes And Home Remedies

Loss of hair is very common and stress is the main cause behind it; this results in eczema, etc. Menopause, post delivery effects, regular styling, medical conditions, birth control pills, etc. are some other reasons triggering hairfall. A good diet, proper sleep, exercise, hot oil massage and applying homemade hair mask help in preventing hairfall.