For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు విషయంలో మీరు చేసే ఈ 5 తప్పిదాలు, మిమ్ములను పెద్దవయసు కలిగిన వారిగా చూపుతాయి.

జుట్టు విషయంలో మీరు చేసే ఈ 5 తప్పిదాలు, మిమ్ములను పెద్దవయసు కలిగిన వారిగా చూపుతాయి.

|

ప్రతి ఒక్కరూ అందమైన జుట్టును కలిగి ఉండాలని ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు. కానీ కొందరికే అది సాధ్యం. కానీ ఆరోగ్యకరమైన జుట్టు ఉన్నా కూడా మనం చేసే కొన్ని చిన్నచిన్న తప్పిదాలు, జుట్టులో జీవం లేకుండా నిస్తేజంగా కనిపించడానికి మరియు వయసులో పెద్దవారిగా కనిపించడానికి కారకాలుగా మారుతాయి. మారుతున్న జీవన శైలి, కాలుష్య కోరల ప్రపంచం దృష్ట్యా, అనేక మందికి వారి జుట్టు మీద శ్రద్ధ వహించడం అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంటుంది కూడా. మీ జుట్టు మీ వ్యక్తిత్వాన్ని గురించి గట్టిగా చెప్పగలదు అనడంలో ఆశ్చర్యమే లేదు. మిమ్ములను గౌరవప్రదంగా చూపాలన్నా, స్టైల్ కోషియంట్ వలె పరిచయం చేయాలన్నా, చెడుగా చూపాలన్నా అది జుట్టుకే సాధ్యం. క్రమంగా మీ జుట్టు నిర్వహణ మీదనే, మీ వ్యక్తిత్వం ప్రదర్శితమవుతుందంటే అతిశయోక్తి కాదు.

మీ జుట్టు కనపడే తీరు పట్ల శ్రద్ద చూపడం ఎంత అవసరమో, అదే క్రమంలో భాగంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవడం కూడా అంతే అవసరమని గుర్తుంచుకోవాలి. మీ జుట్టు సంరక్షణలో భాగంగా, మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక కారణాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది. క్రమంగా తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పిదాలు, మిమ్ములను పెద్దవారిగా లేదా, వయసు మీదపడిన వారిలా చూపడం కూడా జరుగుతుంది.

 5 Hair Mistakes That Can Make You Look Older

మీరు ఎప్పుడైనా తప్పుడు హెయిర్ కట్ కలిగివుండటం లేదా ఏదేని ప్రత్యేకమైన జుట్టు రంగు కారణంగా పెద్దవారిలా కనిపించగలరని ఊహించారా ?, కానీ అవికూడా కారకాలుగా ఉంటాయి అన్నది నిజం. వాస్తవానికి, ఎవరికి కూడా పెద్దవారిలా కనపడాలన్న ఆలోచన ఉండదు. అవునా ?

కావున, ఆ సాధారణ తప్పిదాల గురించి అర్థం చేసుకోవడం ద్వారా వాటి మూలంగా కలిగే ప్రతికూల ప్రభావిత అంశాల నుండి బయటపడవచ్చు. ఏదిఏమైనా, ఇతరుల దృష్టి కోణంలో చెడుగా ( రూపం లేదా వ్యక్తిత్వంలో) కనపడకూడదు అని మనసులో ఉంటుంది అవునా?

కావున, మీరు పెద్దవారిగా కనిపించడానికి జుట్టు పరంగా చేసే తప్పిదాల గురించిన వివరాలు ఈ వ్యాసంలో పొందుపరచబడ్డాయి. ఒకసారి తనిఖీ చేయండి.

1. బ్లంట్ హెయిర్ కట్ :

1. బ్లంట్ హెయిర్ కట్ :

మీలో ఎంత మందికి బ్లంట్, షార్ప్ మరియు స్ట్రెయిట్ హెయిర్ కట్లు ఇష్టం ? మరియు, మీలో ఎంతమందికి ఈ రకమైన హెయిర్ కట్స్, మిమ్ములను పెద్దవారిగా చూపగలవని, మరియు మీ ముఖంపై ముడుతలను, చారలను మరియు మొటిమలను మరింత స్పష్టంగా బహిర్గతం చేయగలదని తెలుసు ? ఈ పరిస్థితిని అధిగమించడానికి, ఈరకమైన కేశాలంకరణలకు స్వస్తి చెప్పి, సహజ సిద్దమైన, లేయర్డ్ లుక్ కోసం ప్రయత్నించండి. ఈ బ్లంట్ కేశాలంకరణకు బదులుగా మీరు మీ ముఖ కవళికల మీద ఆధారపడి డిజైన్ చేయబడిన కొన్ని అధునాతన కేశాలంకరణా పద్దతులను సూచించమని మీ హెయిర్ స్టైలిస్ట్ను అడగవచ్చు.

2. ఎక్కువ నలుపు రంగు ఉండేలా జుట్టు రంగును ఆశ్రయిస్తున్నారా :

2. ఎక్కువ నలుపు రంగు ఉండేలా జుట్టు రంగును ఆశ్రయిస్తున్నారా :

మహిళలూ, దీనిని గుర్తుంచుకోండి. ఎక్కువ నలుపు రంగు ఉట్టిపడేలా డార్క్ బ్లాక్ హెయిర్ డై వినియోగిస్తున్నారా, ఇది మీ ముఖం మీది డార్క్ సర్కిల్స్, ఫైన్ లైన్స్(చారలు), మరియు ముడుతలను ఎక్కువగా బహిర్గతం చేస్తాయని మరువకండి. మీరు మీ జుట్టు రంగును వేయడంలో మార్పును ఇవ్వాలనుకుంటే, తేలికపాటి షేడ్స్ ఉండేలా ప్రయత్నించండి. మీరు ప్రస్తుతం వాడే హెయిర్ డై కన్నా తేలిక పాటి షేడ్స్ ఉండేలా చూసుకోండి. అంతేకానీ, మీ జుట్టును పూర్తిస్థాయి ముదురు రంగులో నింపకండి.

Most Read:7 నుండి 8 గంటలు నిద్రపోవడం వలన మీ శరీరానికి కలిగే లాభాలేమిటి?Most Read:7 నుండి 8 గంటలు నిద్రపోవడం వలన మీ శరీరానికి కలిగే లాభాలేమిటి?

3. జుట్టును మరింత గట్టిగాకట్టే కేశాలంకరణ వద్దు :

3. జుట్టును మరింత గట్టిగాకట్టే కేశాలంకరణ వద్దు :

దేనికైనా పరిమితి అనేది ఉంటుంది. జడ, పోనీటైల్ లేదా బన్ వేసే క్రమంలో అనేకమంది కుస్తీపోటీలు పెట్టినట్లు గట్టిగా లాగి మరీ కడుతుంటారు. కొందరికి అలా ఉండడమే ఇష్టంగా ఉంటుంది కూడా. కానీ, ఇలాంటివి మీ వయసును ఎక్కువ చేసి చూపిస్తాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. ఈ పద్దతి కూడా మీ ముఖం మీద కనిపించే చారలు, మొటిమలు, రంధ్రాలు, డార్క్ సర్కిల్స్ మొదలైన ఏ చిన్ని విషయాన్నైనా ఎక్కువగా బహిర్గతం చేసి చూపిస్తుంది. మరియు వయసు మీద పడినట్లుగా చూపిస్తుంది. కావున, మీరు కొన్ని మృదువైన తంతువులతో కూడిన, తేలికపాటి కేశాలంకరణను ఆశ్రయించడం మంచిది.

4. జుట్టు తక్కువగా ఉందా ?

4. జుట్టు తక్కువగా ఉందా ?

ఫ్లాట్ లేదా సన్నని వెంట్రుకలు మిమ్ములను పెద్దవారిగా చూపించేలా చేయడానికి మరొక ప్రధాన కారణం. కొన్ని హెయిర్-స్ట్రైట్నింగ్ (జుట్టును నిటారుగాఉంచే) పరికరాలు, అధిక జుట్టు నష్టానికి కారకాలుగా కూడా ఉంటాయి. కావున వీలైనంతమేర అటువంటి పరికరాలకు దూరంగా ఉండండి.

అంతేకాకుండా, మీ జుట్టు సాధారణంగానే సన్నగా ఉన్న పక్షాన, మరియు కొన్ని ఉత్పత్తులు లేదా పరికరాల కారణంగా అధిక జుట్టు నష్టానికి లోనవుతుందని గ్రహించిన ఎడల, మీరు పూర్తిగా హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించకపోవడమే మంచిది.

Most Read:నవరాత్రుల సందర్భంగా ఈ నాలుగు దుర్గా దేవి మంత్రాల గురించి తెలుసుకోండి. Most Read:నవరాత్రుల సందర్భంగా ఈ నాలుగు దుర్గా దేవి మంత్రాల గురించి తెలుసుకోండి.

5. స్టైలింగ్ ఉత్పత్తుల అధిక వాడకం :

5. స్టైలింగ్ ఉత్పత్తుల అధిక వాడకం :

పైన చెప్పినట్లు అపరిమిత వాడకమంటే, కోరి ప్రమాదాలను తెచ్చుకున్నట్లే. చర్మ సంరక్షణ ఉత్పత్తులు లేదా హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తుల వాడకంలో కూడా ఇది వర్తిస్తుంది. కావున ఉత్పత్తులను నియంత్రణలో ఉపయోగించడం, తెలివైన చర్యగా ఉంటుందని గుర్తుంచుకోండి. సందర్భానుసారం, మహిళలు హెయిర్ జెల్స్, హెయిర్ స్ప్రే, షైన్ సీరమ్స్ ఉపయోగించడం ద్వారా పరిపూర్ణమైన జుట్టు రూపాన్ని సాధించడానికి ఇష్టపడతారు. కానీ, ఈ ఉత్పత్తుల అధిక వాడకం, సమస్యలకు దారితీస్తుందని గమనించకపోవడంలోనే సాధారణంగా వైఫల్యం చెందుతుంటారు.

English summary

5 Hair Mistakes That Can Make You Look Older

Not everyone is blessed with beautiful hair. And, those who fall in that category surely know how important it is for them to take care of their hair. Your hair can speak volumes about your personality. It can make either make you look good and presentable or shabby. It totally depends on how you maintain your hair and pull off a decent look.While it is important to care for your hair, there are several factors that affect the health of your hair. Moreover, there are certain hair mistakes that can make you look older. Have you ever thought that having a wrong hair cut or getting a particular hair colour done could make you look older? And, for a fact, nobody likes to look older.It is, therefore, essential to understand what these common hair mistakes are and try to avoid them at all costs. After all, everyone wants to look good and make a positive impression on others, right?
Desktop Bottom Promotion