ఆరోగ్యకరమై కేశాల కోసం ఇంట్లోనే పరిష్కరాలు! ఏంటవి!

Written By: KrishnaDivYa P
Subscribe to Boldsky

అందంగా కనిపించడంలో మిలమిల మెరిసే ఆరోగ్యవంతమైన జుట్టు అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన కేశాలంకరణ నిర్వహిణ ఈ రోజుల్లో అంత సలుభమేమీ కాదు. మామూలుగానే కురులు ఈ మధ్య కాలంలో నిగారింపు కోల్పుతున్నాయి. మారుతున్న జీవిన శైలులు, కాలుష్యం, పోషకాహార లోపం వంటివి జుట్టు రాలిపోవడానికి, చుండ్రు రావడానికి కారణం అవుతున్నాయి.

చాలా మందిలో జుట్టు వేగంగా పెరగడం లేదన్న బాధ ఉంటుంది. కురులు రాలిపోవడం, చుండ్రు, పాలిపోన జుట్టు గురించి విచార పడుతుంటారు. అందమైన కేశాల కోసం ఎక్కువ మంది స్పాలకు వెళ్లి చికిత్స తీసుకుంటారు. అయితే ఇదంత మంచిది కాదని అంటున్నారు నిపుణులు. హానికర రసాయనాలు వాడటం వల్ల జట్టు పాలిపోయి పొడిబారుతుంది. అనుకున్న ఫలితాలు రావు.

tips to maintain a healthy hair

అందుకే ఇంట్లోనే వీలయ్యే మూలికా పరిష్కారాలు ఉన్నాయి. వీటి వల్ల మీ జుట్టుకు ఎలాంటి హానీ కలగదు. పైగా అద్భుతమైన లాభాలు అందిస్తాయి. సహజ సిద్ధంగా కేశాలు అందంగా తయారవ్వాడానికి అందిస్తున్న సలహాలు ఇవి.

మందార పువ్వు:

జుట్టును కాపడ్డంలో మందార పువ్వును మించిది లేదనేది వాడినవారి మాట! శిరోజాలను కాపాడే చాలా పదార్థాలు ఈ పువ్వులో ఇమిడి ఉంటాయి. జుట్టు బాగా పెరిగేందుకు, మెరిసేందుకు సాయపడుతుంది. మందార పువ్వులను ముద్దగా చేసి దాన్ని కొబ్బరి నూనెలో కలిసి నెత్తికి పట్టించాలి. అప్పుడే అత్యుత్తమ ఫలితాలు కనిపిస్తాయి.

tips to maintain a healthy hair

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు కూడా జుట్టు రాలిపోవడాన్ని అరికడుతుంది. ఈ పాలను కండిషనర్‌గా ఉపయోగిస్తారు. పొడి బారడాన్ని, చిట్లడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి పాలను శిరోజాలకు పట్టించి రాత్రంతా అలాగే ఉండి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

గూస్‌బెర్రీ:

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్‌ సీ పుష్కలంగా లభిస్తుంది. చాలా వరకు జుట్టుకు సంబంధించిన ఉత్పత్తుల్లో గూస్‌బెర్రీని వాడుతున్నారు. ఇది కేశాల పెరుగుదలను వేగవంత చేస్తుంది.

ఒత్తైన జట్టును అందిస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల గూస్‌బెర్రీ పౌడర్‌ను నిమ్మరసంతో కలిసి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగేస్తే మంచి కురులు మీ సొంతం అవుతాయి.

tips to maintain a healthy hair

కలబంద:

అందానికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తుల్లో కలబందదే కీలక పాత్ర. కలబంద, కోడిగుడ్డు మిశ్రమం మీ కేశాలను అద్భుతంగా మారుస్తాయి. కోడిగుడ్డును, కలబంద గుజ్జును బాగా కలిసి జుట్టుకు పెట్టుకోవాలి. దీని వల్ల జట్టు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా మెరుపు వస్తుంది.

tips to maintain a healthy hair

నారింజ:

ప్రృకతి మనకు ప్రసాదించిన అద్భుత ఫలం నారింజ. ఇది మీ చర్మాన్నే కాకుండా కురులపైనా బాగా పనిచేస్తుంది. నూనె మరకలు, చుండ్రు నివారించేందుకు నారింజ రసం బాగా పనిచేస్తుంది. వారంలో ఒకసారి మీ జుట్టుకు నారింజ రసం పట్టిస్తే పొడవాటి, మందమైన కేశాలు మీ సొంతం అవుతాయి.

English summary

tips to maintain a healthy hair

Everyone suffers with the problem of slow hair growth, hair loss,dandruff and dull hair. In order to maintain our hair, we often prefer various hair spas and treatments. But sadly, it will only in make your hair dull with its harsh chemicals and will not provide the desired results.So, it is advisable to make use of the best home remedies. It does no harm to your hair but will provide amazing benefits. Here is the list of remedies that you can make use of to get healthy hair naturally. Try it out and see the difference.
Story first published: Wednesday, January 31, 2018, 12:00 [IST]
Subscribe Newsletter