స్మెల్లీ హెయిర్ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? ఈ హోంరెమెడీస్ ను ప్రయత్నించండి మరి.

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

స్మెల్లీ హెయిర్ సమస్య అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయిలీ స్కాల్ప్, చెమట ఎక్కవగా పట్టడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, పొల్యూషన్ వంటి వివిధ కారణాల వలన ఈ సమస్య ఎదురవుతుంది. ఆయిలీ హెయిర్ సమస్య అనేది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ను గ్రహించి స్మెల్లీ హెయిర్ కు దారితీయవచ్చు.

అదే సమయంలో, హైజీన్ ను సరిగ్గా పాటించకపోవడం, హార్మోన్ల అసమతుల్యతలు అలాగే ఎన్విరాన్మెంటల్ ఫాక్టర్స్ వంటివి కూడా స్మెల్లీ హెయిర్ సమస్యను కలిగిస్తాయి. కానీ, కారణమేదైనా స్మెల్లీ స్కాల్ప్ వలెనే స్మెల్లీ హెయిర్ సమస్య ఎదురవుతుందన్న విషయం తెలిసిందే. ఆయిలీ స్కిన్, ఆయిలీ స్కాల్ప్, డ్రై స్కిన్ మరియు డ్రై స్కాల్ప్ వంటి సమస్యలకు రెమెడీస్ ఉన్నట్టే స్మెల్లీ స్కాల్ప్ సమస్య నుంచి ఉపశమనం అందించేందుకు కూడా కొన్ని రెమెడీస్ ఉన్నాయి.

DIY Home Remedies For Smelly Hair

ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం మార్కెట్ లో లభ్యమయ్యే ప్రోడక్ట్స్ పై చాలా మంది ఆధారపడతారు. అయితే, అవన్నీ ఈ సమస్యను పరిష్కరిస్తాయని చెప్పలేము. వాటిలో కెమికల్స్ ఎక్కువగా లోడై ఉంటాయి. వాటివలన, హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, ఫ్రిజ్జీ హెయిర్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి హోంమేడ్ ప్రోడక్ట్స్ పై ఆధారపడటం ఉత్తమం. ఇవి చౌకగా లభించటంతో పాటు కేశాల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు కూడా తోడ్పడుతాయి.

స్మెల్లీ హెయిర్ ప్రాబ్లెమ్స్ పై పోరాటం జరిపేందుకు ఈ 10 హోంరెమెడీస్ ను మీకోసం మేము అందిస్తున్నాము. వీటిని పరిశీలించి, ప్రయత్నించండి. ఆశించిన ఫలితాన్ని పొందండి. ఇంకెందుకాలస్యం, ఈ రెమెడీస్ ను తెలుసుకోండి మరి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

హోమ్ రెమెడీస్ లో స్మెల్లీ హెయిర్ కోసం సాధారణంగా వాడే పదార్థాలలో బేకింగ్ సోడా ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది హెయిర్ లోని ఆయిలీనెస్ ను తగ్గించి దుర్వాసనను తొలగిస్తుంది.

ఎలా వాడాలి:

• ఒక పాత్రలో, బేకింగ్ సోడాను కాస్తంత తీసుకోండి. అందులో తగినన్ని నీళ్లను కలపండి. బాగా కలిపి స్మూత్ పేస్ట్ ను తయారుచేయండి.

• నీళ్లతో మీ హెయిర్ ను రిన్స్ చేసుకోండి. ఆ తరువాత, తడి హెయిర్ పై ఈ పేస్ట్ ను అప్లై చేయండి.

• ఈ పేస్ట్ ను హెయిర్ పై కనీసం అయిదు నిమిషాలపాటు ఉంచండి. ఆ తరువాత సాధారణ నీటితో హెయిర్ ను వాష్ చేయండి.

• ఈ ప్రాసెస్ ను వారానికి ఒకసారి పాటించండి.

ఆపిల్ సిడర్ వినేగార్:

ఆపిల్ సిడర్ వినేగార్:

స్మెల్లీ స్కాల్ప్ సమస్యను ట్రీట్ చేయడానికి ఆపిల్ సైడర్ వినేగార్ రెమెడీ

• ఒక పాత్రలో, అర కప్పుడు ఆర్గానిక్ ఆపిల్ సిడర్ వినేగార్ ను తీసుకుని. అందులో రెండు కప్పుల డిస్టిల్డ్ వాటర్ ని అలాగే రెండు లేదా మూడు చుక్కల ల్యావెండర్ ఆయిల్ లేదా ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ను కలపాలి.

• ఆ తరువాత ఈ సొల్యూషన్ ను స్ప్రే బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి హెయిర్ పై ఈ సొల్యూషన్ ను స్ప్రే చేయాలి. ఆ తరువాత ఐదు నిమిషాల పాటు హెయిర్ ను వాష్ చేయకూడదు.

• ఆ తరువాత సాధారణ నీటితో హెయిర్ ను రిన్స్ చేయాలి.

• లేదా ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ లో ఒక కప్పుడు నీళ్లను కలిపి ఈ సొల్యూషన్ తో హెయిర్ ను రిన్స్ చేసుకోండి.

• ఈ సొల్యూషన్ ను హెయిర్ పై నిమిషంపాటు ఉండనివ్వండి.

• ఆ తరువాత నార్మల్ వాటర్ తో హెయిర్ ను రిన్స్ చేసుకోండి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో నున్న అస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ అనేవి హెయిర్ లోని దుర్వాసనని పోగొట్టేందుకు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయి. అలాగే, ఇవి డాండ్రఫ్ ను కలిగించే బాక్టీరియాను తొలగించేందుకు కూడా తోడ్పడతాయి. హెయిర్ కు మెరుపును అందిస్తాయి.

ఎలా వాడాలి:

• ఒక కప్పుడు నీటిలో రెండు నిమ్మకాయల రసాన్ని జోడించండి.

• హెయిర్ ను షాంపూ చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అలాగే హెయిర్ పై కొద్ది నిమిషాలపాటు ఉండనివ్వండి.

• నార్మల్ వాటర్ తో హెయిర్ ని రిన్స్ చేయండి.

• ఈ ప్రాసెస్ ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాటించండి.

• లేదా నిమ్మరసాన్ని రోజ్ మేరీ, ల్యావెండర్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ తో కలిపి ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాత్రంతా ఉంచినా మంచి ఫలితం లభిస్తుంది.

• ఈ పద్దతిని వారానికి మూడు సార్లు పాటించాలి.

వేప నూనె:

వేప నూనె:

వేపనూనెలో ఉండే యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ అనేవి స్మెల్లీ హెయిర్ ను తొలగిస్తాయి. అలాగే స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ను ట్రీట్ చేస్తాయి.

ఎలా వాడాలి:

• కొన్ని చుక్కల వేపనూనెను స్కాల్ప్ పై నేరుగా అప్లై చేసి కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

• రాత్రంతా ఈ నూనెను స్కాల్ప్ పై అలాగే ఉండనివ్వాలి.

• షాంపూతో అలాగే నార్మల్ వాటర్ తో హెయిర్ ను రిన్స్ చేయాలి.

• లేదా కొన్ని వేపాకులను బాయిల్ చేసి నీళ్లను వడగట్టి ఆ నీళ్లను హెయిర్ రిన్స్ ని చేసుకోవటానికి ఉపయోగించాలి.

అలోవెరా:

అలోవెరా:

అలోవెరాలో హీలింగ్ ప్రాపర్టీస్ అధికంగా కలవు. ఇవి డాండ్రఫ్ అలాగే ఆయిలీ స్కాల్ప్ వలన కలిగే దుర్వాసనని తొగ్గించేందుకు తోడ్పడతాయి. అలాగే శిరోజాలకు పోషణనందించేందుకు కూడా తోడ్పడతాయి. ఇది నేచురల్ కండిషనర్ గా అద్భుతంగా పనిచేస్తుంది.

ఎలా వాడాలి:

• అలోవెరా ఆకు లోంచి కొంత జెల్ ను సేకరించండి.

• రెగ్యులర్ షాంపూతో హెయిర్ ను షాంపూ చేసుకోండి.

• షాంపూ తరువాత అలోవెరా జెల్ ను హెయిర్ పై అలాగే స్కాల్ప్ పై అప్లై చేయండి. పదిహేను నిమిషాల పాటు హెయిర్ పైనున్న ఈ మిశ్రమాన్ని తొలగించకండి.

• వారానికి ఒకసారి ఈ రెమెడీను పాటించండి.

ఆనియన్ జ్యూస్:

ఆనియన్ జ్యూస్:

వెల్లుల్లి లాగానే ఆనియన్ జ్యూస్ లో లభించే సల్ఫర్ కంటెంట్ అనేది బాక్టీరియాపై పోరాటం జరుపుతుంది. తద్వారా, ఆయిలీ స్కాల్ప్ అలాగే స్మెల్లీ హెయిర్ సమస్య తగ్గుతుంది. ఆనియన్స్ హెయిర్ గ్రోత్ ను పెంపొందించి బాల్డ్ నెస్ ను అరికడతాయి.

ఎలా వాడాలి:

• ఐదారు ఆనియన్ పీసులను జ్యూసర్ లోకి తీసుకోండి.

• ఇప్పుడు ఈ జ్యూస్ ని స్కాల్ప్ పై అప్లై చేయండి. సున్నితంగా మసాజ్ చేయండి.

• అరగంట పాటు ఇలా ఉంచిన తరువాత షాంపూ చేసుకోండి.

• ఈ పద్దతిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు పాటించండి.

కండిషనర్ ను వాడకండి:

కండిషనర్ ను వాడకండి:

హెయిర్ కండిషనర్ ను కేవలం హెయిర్ పైనే అప్లై చేయండి. స్కాల్ప్ పై అప్లై చేయకండి. ఎందుకంటే స్కాల్ప్ అనేది సహజసిద్ధమైన ఆయిల్ ను ఉత్పత్తి చేసుకుంటుంది. స్కాల్ప్ పై కండిషనర్ ని వాడటం ద్వారా స్కాల్ప్ పైనున్న మైక్రో ఆర్గనిజమ్స్ కి మీరు పోషణని అందించినవారవుతారు.

English summary

DIY Home Remedies For Smelly Hair

Having smelly hair is embarrassing for everyone; this is caused due to various reasons - an oily scalp, excessive sweating, fungal infections, bacterial infections, pollution, etc. Oily hair tends to pick up environmental pollution & this leads to smelly hair. Baking soda, apple cider vinegar, lemon juice