స్ప్లిట్ ఎండ్స్ గురించి చింతిస్తున్నారా? ఈ న్యాచురల్ వేస్ తో వాటిని తొలగించుకోవచ్చు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

స్ప్లిట్ ఎండ్స్ సమస్య మహిళలను విపరీతంగా వేధిస్తుంది. హెయిర్ అనేది డ్రై గా ఫ్రిజ్జీగా మారుతుంది. వివిధ కారణాల వలన ఇలా జరుగుతుంది. శిరోజాలను సరిగ్గా దువ్వకపోవడం, వాతావరణ కాలుష్యం, కెమికల్ హెయిర్ ప్రోడక్ట్స్ ని విపరీతంగా వాడేయటం అలాగే హార్మోన్ సమస్యలు ఇవన్నీ స్ప్లిట్ ఎండ్స్ కి దారితీసే అంశాలు.

హెయిర్ ను ట్రిమ్ చేయడం ద్వారా స్ప్లిట్ ఎండ్స్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. హెయిర్ ని ట్రిమ్ చెసాక, హెయిర్ స్మూత్ గా మారుతుంది. స్ప్లిట్ ఎండ్స్ కూడా తొలగిపోతాయి. అయితే, మళ్ళీ కొన్ని రోజుల తరువాత స్ప్లిట్ ఎండ్స్ సమస్య తలెత్తుతుంది. హెయిర్ ని మాటిమాటికీ ట్రిమ్ చేయడం వలన హెయిర్ గ్రోత్ కూడా తగ్గుతుంది. ప్రతిసారి హెయిర్ ను ట్రిమ్ చేసేకంటే స్ప్లిట్ ఎండ్స్ ను నిర్మూలించేందుకు న్యాచురల్ పరిష్కారాలను పాటించడం వలన ప్రయోజనాలను పొందవచ్చు.

Home Remedies To Get Rid Of Split Ends

కెమికల్ హెయిర్ ప్రోడక్ట్స్ ని వాడటం వలన శిరోజాలకు హానీ కలుగుతుంది. ఇంటివద్దే సులభంగా ప్రయత్నించగలిగిన హోమ్ రెమెడీస్ ను పాటిస్తూ ఈ స్ప్లిట్ ఎండ్స్ కు అడ్డుకట్ట వేయవచ్చు.

వీటిని పరిశీలించండి మరి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె అనేక సౌందర్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కాస్తంత కొబ్బరి నూనెను శిరోజాల మొదళ్ళ నుంచి చివర్ల వరకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న ప్రాంతంలో కొబ్బరినూనెను మరింత శ్రద్దగా రాయాలి. ఇప్పుడు ఒక టవల్ తో కవర్ చేసి ముప్పై నిమిషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత షాంపూతో హెయిర్ వాష్ చేయాలి. ఈ రెమెడీని వారానికి రెండు లేదా మూడు సార్లు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

అవొకాడో ప్రోటీన్ మాస్క్

అవొకాడో ప్రోటీన్ మాస్క్

కావలసిన పదార్థాలు

1 అవొకాడో

1 ఎగ్

2 స్పూన్ల ఆలివ్ ఆయిల్

తయారుచేసే విధానం:

తయారుచేసే విధానం:

ఒక ఎగ్ లోంచి ద్రవాన్ని బౌల్ లోకి తీసుకుని అందులోకి మాష్ చేసిన అవొకాడోని జోడించండి. అందులో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను కలిపి బాగా కలపండి. ఈ మాస్క్ ను హెయిర్ పై అప్లై చేసి హెయిర్ ను కవర్ చేయండి. ఇలా 25 నుంచి 30 నిమిషాల వరకు ఉంచి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో కడగండి.

హనీ మరియు ఆయిల్ మాస్క్

హనీ మరియు ఆయిల్ మాస్క్

కావలసిన పదార్థాలు

2 టేబుల్ స్పూన్స్ మాయిశ్చరైజర్

1 స్పూన్ తేనె

2 స్పూన్ల ఆలివ్ ఆయిల్

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

ఒక బౌల్ లోకి పైన చెప్పిన పదార్థాలను తీసుకుని వాటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలపై అప్లై చేసి షవర్ క్యాప్ తో తలని కవర్ చేయాలి. 20 నిమిషాల తరువాత సాధారణ నీటితో ఈ హెయిర్ ప్యాక్ ను తొలగించాలి. తేనె మరియు ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని కూడా షాంపూ చేసుకున్న తరువాత హెయిర్ పై అప్లై చేసుకోవచ్చు. అయిదు నిమిషాల తరువాత, షాంపూతో హెయిర్ ను రిన్స్ చేయండి. ఈ మిక్శ్చర్ ఒక కండిషనర్ లా పనిచేసి హెయిర్ ను బలపరిచి స్ప్లిట్ ఎండ్స్ ను నిర్మూలిస్తుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ కలిసిన హెయిర్ ప్రోడక్ట్స్ ని వాడటం మానండి. మాయిశ్చర్ గుణం కలిగిన షాంపూలను వాడటం ప్రిఫర్ చేయండి. ఇవి మీ హెయిర్ ను హైడ్రేటెడ్ గా ఉంచి శిరోజాలను సాఫ్ట్ గా మారుస్తుంది. తద్వారా స్ప్లిట్ ఎండ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మంచి నీటిని బాగా తాగాలి.

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

ఒక టవల్ తో కఠినంగా తలను ఆరబెట్టుకోవడం, కెమికల్ హెయిర్ ప్రోడక్ట్స్ ను వాడటం, హీటింగ్ ఏజెంట్స్ ను వాడటం వంటి వాటివలన స్ప్లిట్ ఎండ్స్ ఏర్పడతాయి. అలాగే, తలస్నానానికి హాట్ వాటర్ ని వాడటం అవాయిడ్ చేయండి. ఇలా చేస్తే హెయిర్ డ్రై గా మారుతుంది తద్వారా స్ప్లిట్ ఎండ్స్ సమస్యకి దారితీసే రిస్క్ పెరుగుతుంది.

బనానా:

బనానా:

బనానాలో విటమిన్ ఏ, సి మరియు ఈతో పాటు మరికొన్ని మినరల్స్ లభ్యమవుతాయి. ఇవి హెయిర్ ను మాయిశ్చరైజ్ చేసి బలపరచడానికి ఉపయోగపడతాయి. తద్వారా, హెయిర్ లో స్ప్లిట్ ఎండ్స్ ను తగ్గించుకోవచ్చు.

కావలసిన పదార్థాలు

1 బాగా పండిన అరటిపండు

2 టేబుల్ స్పూన్స్ పెరుగు

2 స్పూన్స్ రోజ్ వాటర్

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

బాగా పండిన అరటిపండును మ్యాష్ చేసి చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోవచ్చు. పెరుగు మరియు రోజ్ వాటర్ ను కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ చిక్కటి మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేసి ఒక గంట తరువాత నార్మల్ వాటర్ తో తొలగించాలి. ఈ హెయిర్ మాస్క్ ను అప్లై చేసిన తరువాత షవర్ క్యాప్ తో మీ హెయిర్ ను కవర్ చేయడం మరచిపోకండి. ఈ మాస్క్ ను వారానికి ఒకసారి వాడటం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.

English summary

Home Remedies To Get Rid Of Split Ends

Home Remedies To Get Rid Of Split Ends,Split ends are a nightmare for most of us ladies, isn't it? Since the usage of chemicals can be more harmful for your hair, it's always better to go for natural remedies that you can easily do at home. Here are some home remedies that can give you a split end-free hair.
Story first published: Saturday, March 17, 2018, 7:00 [IST]