For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మృదువైన జుట్టు కోసం ఇంటిలోనే తయారు చేసుకోగలిగే క్యారెట్ మాస్క్లు !

మృదువైన జుట్టు కోసం ఇంటిలోనే తయారు చేసుకోగలిగే క్యారెట్ మాస్క్లు !

|

క్యారెట్ను ఉపయోగించడం వల్ల మన చర్మానికి & శారీరక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనకు బాగా తెలుసు. కానీ ఈ క్యారెట్లే మీ జుట్టు సౌందర్యాన్ని పెంపొందించగలవని మీకు తెలుసా ! క్యారెట్లో ఉన్న ముఖ్యమైన విటమిన్లు & ఖనిజాలు మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

ఇది కేవలం జుట్టు ఊడిపోవడాన్ని తగ్గించడమే కాకుండా, రింగు రింగులుగా ఉన్న హెయిర్ను & జుట్టు చివర్లో పగిలిపోవడం వంటి ఇతర జుట్టు సమస్యలను వదిలించడంలో మీకు క్యారెట్ బాగా సహాయపడుతుంది.

Homemade Carrot Masks For Smooth Hair

ఆరోగ్యకరమైన క్యారట్లు మాత్రమే మీ జుట్టును మెత్తగా & మృదువుగా ఉంచడంలో తనదైన పాత్రను పోషిస్తుంది. మీ జుట్టూ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో క్యారెట్లు ఏవిధంగా ఉపయోగపడతాయో అనే ప్రశ్న మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది, అవునా ? రింగు రింగులుగా ఉన్న మీ జుట్టును మరింత మృదువుగా చేయగలిగేందుకు, మీ ఇంట్లోనే తయారు చేసుకోగలిగే రకరకాల క్యారెట్ మాస్క్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాటిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు మనము చూద్దాం !

1) క్యారెట్ & అవోకాడో హెయిర్ మాస్క్

1) క్యారెట్ & అవోకాడో హెయిర్ మాస్క్

పాడైపోయిన మీ జుట్టును & జుట్టు చివర్లను కాపాడేందుకు అవోకాడోలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మీకు బాగా ఉపయోగపడతాయి. దీనిని క్యారట్తో పాటు కలిపి ఉపయోగించినప్పుడు అది జుట్టు యొక్క పరిస్థితిని మరింత బాగా మెరుగుపరుస్తుంది, అలా మీరు మెత్తని & మృదువైన జుట్టును తిరిగి పొందవచ్చు.

కావలసిన పదార్థాలు :-

2 క్యారట్లు

1 అవోకాడో (బాగా పండిన)

1 టేబుల్ స్పూన్ తేనె

2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్

తయారీ విధానం :-

1. క్యారట్ పై ఉన్న తొక్కను తొలగించి, దీనిని అవోకాడోతో పాటు బాగా కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి.

2. ఇలా తయారైన పేస్టును ఒక్క గిన్నెలోకి తీసుకోవాలి.

3. ఈ మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ తేనెను, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ను వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

4. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ చేతి వేళ్లతో జుట్టుకు & మాడుకు బాగా అప్లై చేసి, వృత్తాకార కదలికలో నెమ్మదిగా మసాజ్ చేయాలి.

5. అలా మీ జుట్టును 30 నిమిషాలపాటు బాగా ఆరనిచ్చిన తర్వాత, సల్ఫేట్ లేని తేలికపాటి షాంపూతో తలస్నానం చేసి, గోరువెచ్చని నీళ్లతో మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి.

6. మరింత మెరుగైన ఫలితాల కోసం ఒక నెలలో రెండుసార్లు ఈ పద్ధతినే ప్రయత్నించి చూడండి.

2) క్యారెట్ & కొబ్బరినూనెల మాస్క్

2) క్యారెట్ & కొబ్బరినూనెల మాస్క్

కొబ్బరినూనె కలిగి ఉండే లక్షణాలు మీ జుట్టును & మాడును, హైడ్రేట్గా & తేమగా ఉంచుతుంది. ఈ మాస్క్ కూడా మీ పొడి జుట్టును సరి చేయడంలోనూ & మీ మాడుపై ఏర్పడే దురదలను చికిత్స చేయడంలో ఈ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్థాలు :-

1 క్యారట్

2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

తయారి విధానం :-

1. మధ్యస్థంగా ఉన్న క్యారట్ను తీసుకోని, మెత్తని పేస్టులా చేసుకోవాలి.

2. ఈ క్యారెట్ పేస్ట్కు 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి మరింత బాగా మిక్స్ చేయాలి.

3. ఇందుకోసం మీరు ఉపయోగించే కొబ్బరినూనె మరింత కటినమైన తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు కొద్దిగా వేడి చేయండి.

4. ఈ మాస్క్ కోసం ఉపయోగించిన అన్ని పదార్థాలను బాగా మిక్స్ అయ్యేలా కలపండి.

5. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ జుట్టుకు, మాడుకు అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మీ చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి.

6. 20 నిమిషాల పాటు మీ జుట్టు బాగా ఆరనిచ్చిన తరువాత చల్లని నీటితో మీ జుట్టును శుభ్రపరుచుకోవాలి.

7. ఈ రకమైన పరిష్కార మార్గాన్ని వారానికి కనీసం ఒక్కసారైనా ఉపయోగించండి.

3) క్యారెట్ & పెరుగుల మాస్క్

3) క్యారెట్ & పెరుగుల మాస్క్

పెరుగు, మీ చర్మం నుండి అదనంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ను & మీ మాడు పై లాక్టిక్ యాసిడ్తో నిండిన ధూళిని తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. అలాగే ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

కావలసిన పదార్ధాలు :-

2 క్యారట్లు

2 టేబుల్ స్పూన్లు పెరుగు

తయారీ విధానం :-

1. మొదటగా క్యారెట్లో ఉన్న తొక్కను తొలగించి, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా మెత్తగా చేయాలి.

2. ఇలా తయారైన క్యారెట్ పేస్టును ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకోవాలి.

3. ఎలాంటి ప్లవర్స్ లేని సాధారణమైన పెరుగును రెండు స్పూన్ల పరిమాణంలో తీసుకొని క్యారెట్ పేస్టుకు బాగా కలపాలి.

4. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ జుట్టుకు, మాడుకు అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మీ చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి.

5. 30 నిమిషాల పాటు మీ జుట్టు బాగా ఆరనిచ్చిన తరువాత చల్లని నీటితో మీ జుట్టును శుభ్రపరుచుకోవాలి.

6. ఈ రకమైన పరిష్కార మార్గాన్ని వారానికి కనీసం ఒక్కసారైనా ఆచరించండి.

4) క్యారెట్, నిమ్మ & ఉల్లిపాయ రసాలతో చేసిన హెయిర్ మాస్క్

4) క్యారెట్, నిమ్మ & ఉల్లిపాయ రసాలతో చేసిన హెయిర్ మాస్క్

ఉల్లిరసం మనకు బాగా తెలిసిన పదార్థంగా ఉండటమే కాకుండా, ఇది జుట్టు ఊడిపోవటాన్ని నియంత్రిస్తూ, మీ జుట్టును మరింత కాంతివంతంగా & మృదువుగా ఉండేలా చేస్తుంది. నిమ్మకాయలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ చుండ్రును వివరించడమే కాక, మాడుపై ఏర్పడిన ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో బాగా సహాయపడుతుంది.

కావలసిన పదార్థాలు :-

1 క్యారట్

1 ఉల్లిపాయ

2-3 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం

2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్

తయారీ విధానం :-

1. క్యారెట్ & ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, రెండింటినీ కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి.

2. తాజాగా ఉన్న నిమ్మకాయను కట్ చేసి, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని సేకరించడంతో పాటు, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ను క్యారెట్ పేస్టులోకి చేర్చి అన్ని పదార్ధాలు బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

3. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ జుట్టుకు, మాడుకు అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు మీ చేతి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి.

4. 20 నిమిషాల పాటు మీ జుట్టు బాగా ఆరనిచ్చిన తరువాత చల్లని నీటితో మీ జుట్టును శుభ్రపరుచుకోవాలి.

5. ఈ రకమైన పరిష్కార మార్గాన్ని వారానికి 2 సార్లు ఆచరించడంవల్ల ఇది మీ జుట్టును మృదువుగా ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, జుట్టు ఊడిపోవడాన్ని కూడా బాగా తగ్గిస్తుంది.

English summary

Homemade Carrot Masks For Smooth Hair

We all know the health and skin benefits that carrots offer. But did you know that carrots can also do wonders for your hair? You can easily make some carrot masks at home for a frizz-free hair using other ingredients like coconut oil, olive oil, yogurt, etc. Try these remedies for smooth hair at home.
Desktop Bottom Promotion