For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హెయిర్ ఫాల్ ను అవాయిడ్ చేయడానికి సరైన షాంపూను ఎంచుకోవడంమెలా?

  |

  ఒత్తైన, పొడవైన ఆలాగే అందమైన శిరోజాలు కలిగి ఉండాలని మహిళలు కలలు కంటూ ఉంటారు. అయితే, ఒత్తైన శిరోజాలను పొందడానికి అనేక అంశాలు అడ్డుగా నిలుస్తాయి. హెయిర్ ఫాల్ అనేది అతి పెద్ద అవరోధకమని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో స్ట్రెస్ ఫుల్ లైఫ్ స్టైల్ వలన హెయిర్ ఫాల్ సమస్య మరింత ఎక్కువైంది. అలాగే, దుమ్ము, ధూళితో పాటు కాలుష్యం వంటివి శిరోజాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

  దుమ్ము ధూళి వలన హెయిర్ ను సాధారణం కంటే మరింత ఫ్రీక్వెంట్ గా వాష్ చేస్తూ ఉంటాం. దీని వలన హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా పెరుగుతుంది.

  How To Choose The Right Shampoo To Avoid Hair Fall?

  అందువలన, మనం హెయిర్ ఫాల్ నుంచి రక్షణను అందించే షాంపూను చూజ్ చేసుకోవడం ఉత్తమం. అయితే, టీవీలలో చూపించే హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూలన్నీ మీకు సరిగ్గా సూట్ అవుతాయి అనుకుంటే పొరపాటే.

  నిజానికి, ఒక పర్టిక్యులర్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అనేది హెయిర్ ఫాల్ సమస్యను మరింత పెంపొందించే అవకాశం ఉంది. అందువలన, హెయిర్ ఫాల్ పై పోరాటం సాగించడానికి మీరు సరైన షాంపూని ఎంచుకుని తీరాలి. మీ హెయిర్ టైప్ ను, మీరు నివసించే ప్రదేశాన్ని అలాగే ఇటువంటి మరెన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని మీరు సరైన షాంపూను ఎంచుకోవాలి.

  అటువంటి సరైన షాంపూను మీరు ఎంచుకోవాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ను మీరు ఫాలో అవ్వాలి. తద్వారా, హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

  1. మీ స్కాల్ప్ టైప్ ను ఐడెంటిఫై చేయండి:

  1. మీ స్కాల్ప్ టైప్ ను ఐడెంటిఫై చేయండి:

  ఇది హెయిర్ ఫాల్ ను తగ్గించేందుకు మొదటి అడుగు. డ్రై స్కాల్ప్ ఉన్నట్టయితే ఆయిలీ స్కాల్ప్ కోసం తయారైన షాంపూల వైపు మీరు కన్నెత్తి కూడా చూడకూడదు. అలాగే, మీది ఆయిలీ స్కాల్ప్ అయితే డ్రై స్కాల్ప్ కోసం తయారుచేయబడిన షాంపూలకు దూరంగా ఉండాలి. అందువలన, మీ స్కాల్ప్ టైప్ ను గమనించి దానికి తగిన హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ను వాడటం వలన ప్రయోజనం పొందగలుగుతారు.

  2. సంరక్షణ మరియు పోషణ:

  2. సంరక్షణ మరియు పోషణ:

  షాంపూను ఎంచుకుంటున్నప్పుడు ఎటువంటి పదార్థాలు శిరోజాలకు పోషణని అలాగే సంరక్షణని అందిస్తాయి మీరు గమనించాలి. సొయా మిల్క్, షీ బటర్, గ్లిజరిన్ మరియు ఎగ్ ప్రోటీన్లు హెయిర్ కు మంచివి. కాబట్టి, ఇటువంటి న్యూట్రిషియస్ ప్రోడక్ట్స్ లభించే ప్రోడక్ట్స్ వైపు మొగ్గు చూపండి. మీ హెయిర్ టైప్స్ తో సంబంధం లేకుండా ఈ పదార్థాలు మీ స్కాల్ప్ కి పోషణని అందించి హెయిర్ గ్రోత్ కి తోడ్పడతాయి. అందువలన, హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

  3. నార్మల్ హెయిర్:

  3. నార్మల్ హెయిర్:

  నార్మల్ హెయిర్ కలిగిన వారిలో కూడా హెయిర్ ఫాల్ సమస్య తీవ్రంగా ఉన్నట్టయితే ఇది స్కాల్ప్ ఇరిటేషన్ కి సంబంధించిన సమస్య అయి ఉండవచ్చు. అటువంటి పరిస్థితులలో మీరు ట్రీ ఆయిల్స్ కలిగిన మెడికేటెడ్ షాంపూలను వాడితే ప్రయోజనం ఉండవచ్చు.

  ఈ చిట్కా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ తో స్కాల్ప్ పై ప్రయోగం చేయకండి. వివిధ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ తో స్కాల్ప్ పై ప్రయోగాలు చేస్తే హెయిర్ ఫాల్ మరింత పెరిగే ఆస్కారం ఉంది.

  4. డ్రై హెయిర్:

  4. డ్రై హెయిర్:

  జుట్టు పొడిబారడం వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య ఎదురవుతుంది. అందువలన, హెయిర్ ను చక్కగా మాయిశ్చరైజ్ చేసుకోండి. ఎక్కువ కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ ని వాడటం మానుకోండి. క్రీమ్ బేస్డ్ హెర్బల్ షాంపూస్ అనేవి ఇటువంటి పరిస్థితులలో ఉపయోగకరంగా ఉంటాయి.

  ఏ షాంపూను మీరు ఎంచుకున్నా అందులో సొయా ప్రోటీన్ ఉండేలా జాగ్రత పడండి. ఆయిల్ బేస్డ్ షాంపూల వైపు మొగ్గు చూపడం మంచిది.

  5. కర్లీ హెయిర్:

  5. కర్లీ హెయిర్:

  మీకు నేచురల్ కర్ల్స్ ఉన్నా లేదా పెర్మనెంట్ పెర్మ్ ను చేయించుకోవడం ద్వారా కర్ల్స్ ను సొంతం చేసుకున్నా కూడా కర్లీ హెయిర్ ను సంరక్షించే జాగ్రత్తలు మీరు తప్పక తీసుకోవాలి. కేరాటిన్ ప్రోటీన్ అధికంగా ఉండే షాంపూలను ఎంచుకోండి.

  ఇటువంటి హెయిర్ టైప్ కు సూట్ అయ్యే షాంపూలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈ షాంపూలు హెయిర్ ను చక్కగా మాయిశ్చరైజ్ చేస్తాయని గ్యారంటీ ఇవ్వలేకపోయినా, అటువంటి షాంపూలను ఎంచుకోవడం ద్వారా డీప్ రూట్ కండిషనింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

  6. ఆయిలీ హెయిర్:

  6. ఆయిలీ హెయిర్:

  షాంపూను ఎంచుకునేటప్పుడు, కఠినమైన షాంపూలకు దూరంగా ఉండండి. ఎందుకంటే, మిగతా వారి కంటే మీరు హెయిర్ ను తరచూ వాష్ చేసుకోవలసి ఉంటుంది (మీ స్కాల్ప్ అనేది ఎక్కువ ఆయిల్ ను విడుదల చేస్తుంది).

  షాంపూలోని పీహెచ్ లెవల్స్ సరైన మోతాదులో ఉన్నాయన్న విషయాన్ని లేబుల్ చూసి నిర్థారించుకోండి. లేదంటే, షాంపూ అనేది హెయిర్ ను మరింత రఫ్ గా మార్చే ప్రమాదం ఉంది. అందువలన, హెయిర్ ఫాల్ మరింత పెరిగే ప్రమాదం ఉంది.

  7. కలర్డ్ హెయిర్:

  7. కలర్డ్ హెయిర్:

  హెయిర్ కి ఆల్రెడీ మీరు కెమికల్ ట్రీట్మెంట్ ను ఇచ్చారు కాబట్టి మీరు మరింత ప్రేమను అలాగే కేర్ ను మీ హెయిర్ కు అందించాలి. నార్మల్ షాంపూలకు దూరంగా ఉండండి. ఎందుకంటే, వీటిలో హెయిర్ కలర్ ని ప్రొటెక్ట్ చేసే ప్రత్యేక సామర్థ్యాలు ఉండవు.

  కలర్డ్ హెయిర్ కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన షాంపూలను ఎంచుకోండి. తద్వారా, మీ హెయిర్ కలర్ ట్రీట్మెంట్ ఎక్కువ కాలం సంరక్షింపబడుతుంది. తరచూ టచ్ అప్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

  8. షార్ట్ హెయిర్:

  8. షార్ట్ హెయిర్:

  మీది షార్ట్ హెయిర్ అయితే, లూజ్ హెయిర్ స్టయిల్స్ ని మీరు ఎక్కువగా అనుసరిస్తూ ఉండవచ్చు. తత్ఫలితంగా, హెయిర్ డేమేజ్ కి ఛాన్సెస్ కలవు. అందువలన, షాంపూని మరింత శ్రద్ధగా ఎంచుకోవాలి.

  జొజోబా ఆయిల్ కలిగిన షాంపూని ఎంచుకుంటే ఉపయోగకరం. ఇది షార్ట్ హెయిర్ కి కాంతిని అలాగే పోషణని అందిస్తుంది. హెయిర్ ఫాల్ ని దూరంగా ఉంచుతుంది.

  9. హైలైటెడ్ హెయిర్:

  9. హైలైటెడ్ హెయిర్:

  హైలైటెడ్ హెయిర్ అనేది ఎక్కువ కెమికల్ డ్యామేజ్ కి గురయ్యే ప్రమాదం ఉంది. అందువలన, మీ హెయిర్ నేచురల్ గా డ్రై కాకపోయినా హైలైట్ చేయడం వలన డ్రై గా మారిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే కేవలం హైలైట్ చేయబడిన సెక్షన్ మాత్రమే డ్రైగా మారిపోయే ప్రమాదం ఉంది. మిగతాదంతా ఒరిజినల్ టెక్స్చర్ లోనే ఉంటుంది. కాబట్టి, తగిన కేర్ ను షాంపూ రూపంలో అందించడం మీ బాధ్యత.

  English summary

  How To Choose The Right Shampoo To Avoid Hair Fall?

  The first step in battling hair fall is to identify the correct shampoo based on your hair type, your scalp type, the weather of the place that you live in and a number of other factors. Choosing the right shampoo, nourishing your hair, and trimming your hair at regular times helps prevent hair fall.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more