విటమిన్ ఈ ఆయిల్ తో మృదువైన మెరిసే జుట్టును పొందడమెలా?

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

శిరోజ సంపదను కాపాడుకోవాలంటే మీరు ఇంటివద్దే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. జుట్టు సంరక్షణకై మార్కెట్ లో లభించే ప్రోడక్ట్స్ ని వాడే బదులు సులభంగా ఇంటి వద్ద లభించే శిరోజ సంరక్షణ పదార్థాలతో మెరిసే మృదువైన జుట్టును పొందవచ్చు. ఒకవేళ మీరు మెరిసే మృదువైన జుట్టును పొందేందుకు మార్కెట్ లో లభించే సెరమ్స్ పై ఆధారపడుతున్నారా? అయితే, ఈ ఆర్టికల్ ని చదవండి. ఈ రోజు బోల్డ్ స్కై లో సహజసిద్ధమైన పదార్థాలతో జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ఒత్తైన అలాగే మెరిసే జుట్టును పొందే విధానాన్ని వివరించాము.

శిరోజాల సంరక్షణకు ఉపయోగపడే ఆ ప్రత్యేకమైన పదార్థమే విటమిన్ ఈ ఆయిల్. ఈ నేచురల్ ఆయిల్ అనేది శిరోజాలకు అనేకవిధాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. విటమిన్ ఈ ఆయిల్ మీ జుట్టును మృదువుగా చేసి సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది.

సంపూర్ణ ఆరోగ్యానికి కేరాఫ్ ‘విటమిన్ ఇ’ఆహారాలు..!

ఈ ఆయిల్ ను అనేక విధాలుగా వాడడం ద్వారా శిరోజాలకు వివిధ ప్రయోజనాలను చేకూర్చుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో విటమిన్ ఈ ఆయిల్ ను వాడే వివిధ మార్గాలను మీకు వివరించాము. ఈ ప్రభావవంతమైన మార్గాలను పాటించడం ద్వారా మీ శిరోజాలను మృదువుగా చేసుకోవచ్చు.

ఈ కింద మార్గాలను పాటించి అందమైన శిరోజాలను మీ సొంతం చేసుకోండి. ఈ కింద వివరించబడిన పద్దతులను చదివి శిరోజాలను సంరక్షించుకోండి.

 1. విటమిన్ ఈ ఆయిల్ తో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ :

1. విటమిన్ ఈ ఆయిల్ తో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ :

రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని తీసుకుని అందులోంచి నూనెను వెలికితీయండి. అందులో రెండు టీస్పూన్ల స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ను కలపండి.

ఇలా తయారైన మిశ్రమాన్ని స్కాల్ప్ పై సున్నితంగా అప్లై చేయండి. ఆ తరువాత 20 నుంచి 25 నిమిషాల వరకు ఈ మిశ్రమం స్కాల్ప్ పై ఉండేలా చూసుకోండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో అలాగే మీ రెగ్యులర్ షాంపూతో మీ జుట్టును శుభ్రపరుచుకోండి.

ఈ హోంమేడ్ బ్లెండ్ ని వారానికి ఒకసారి అప్లై చేయడం ద్వారా మృదువైన మెరిసే శిరోజాలను పొందవచ్చు.

2. విటమిన్ ఈ ఆయిల్ తో ఫిష్ ఆయిల్ :

2. విటమిన్ ఈ ఆయిల్ తో ఫిష్ ఆయిల్ :

రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ లోంచి నూనెను వెలికితీసి అందులో ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ నుంచి వెలికితీయబడిన నూనెను జోడించండి. ఈ రెండు ఆయిల్స్ ని బాగా కలపండి. అలా తయారైన మిశ్రమాన్ని వెంట్రుకలకు బాగా అప్లై చేయండి. ఈ మిశ్రమం మీ స్కాల్ప్ పై కనీసం గంట పాటు ఉండాలి. ఆ తరువాత మీకు నచ్చిన షాంపూతో అలాగే గోరువెచ్చటి నీటితో మీ జుట్టును శుభ్రపరుచుకోండి. ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి వాడితే మెరిసే మృదువైన జుట్టు మీ సొంతమవుతుంది.

3. విటమిన్ ఈ ఆయిల్ తో పెరుగు

3. విటమిన్ ఈ ఆయిల్ తో పెరుగు

రెండు లేదా మూడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి సేకరించబడిన నూనెను రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కలపండి. ఇలా తయారైన మిశ్రమంతో మీ తలపై మసాజ్ చేయండి. డ్రై షవర్ క్యాప్ తో మీ తలను కవర్ చేయడం ద్వారా ఈ మిశ్రమం మీ తలపై కనీసం గంటపాటు ఉండేలా చూడండి. ఆ తరువాత మీ రెగ్యులర్ షాంపూతో ఆలాగే గోరువెచ్చటి నీటితో మీ శిరోజాలను శుభ్రపరుచుకోండి. ఈ అద్భుతమైన హోంమేడ్ బ్లెండ్ ని వారానికి ఒకసారి చెప్పిన విధంగా అప్లై చేయడం ద్వారా గొప్ప ఫలితాలను పొందవచ్చు.

4. విటమిన్ ఈ ఆయిల్ తో మయోన్నైస్

4. విటమిన్ ఈ ఆయిల్ తో మయోన్నైస్

ఒక బౌల్ ని తీసుకుని అందులో రెండు లేదా మూడు టీస్పూన్ల మయోన్నైస్ ను తీసుకోండి. అందులో రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి సేకరించబడిన నూనెను జోడించండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేసి 40 నుంచి 45 నిమిషాల వరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత గోరువెచ్చటి నీటితో అలాగే మీ రెగ్యులర్ షాంపూతో మీ శిరోజాలను వాష్ చేసుకోండి.

ఈ హోంమేడ్ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం ద్వారా మెరిసే మృదువైన శిరోజాలను పొందవచ్చు.

5. విటమిన్ ఈ ఆయిల్ తో ఆలివ్ ఆయిల్ :

5. విటమిన్ ఈ ఆయిల్ తో ఆలివ్ ఆయిల్ :

రెండు లేదా మూడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి నూనెను సేకరించి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను జోడించండి.

ఈ మిశ్రమాన్ని తలపై బాగా అప్లై చేసుకోండి. ఆ తరువాత గంట పాటు తలపై నున్న ఈ మిశ్రమాన్ని ఆరనివ్వండి.

ఆ తరువాత, రెగ్యులర్ షాంపూతో అలాగే గోరువెచ్చటి నీటితో మీ జుట్టును వాష్ చేసుకోండి.

ఈ హోంమేడ్ బ్లెండ్ ని వారానికొకసారి వాడడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

6. విటమిన్ ఈ ఆయిల్ తో అవొకాడో

6. విటమిన్ ఈ ఆయిల్ తో అవొకాడో

బాగా పండిన అవొకాడో నుంచి గుజ్జును తీసుకుని అందులో రెండు లేదా మూడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ నుంచి సేకరించబడిన నూనెను జోడించండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు అలాగే వెంట్రుకల చివర్లకు కూడా పట్టించండి.

తలపై పట్టించిన ఈ మిశ్రమాన్ని గంట వరకూ తొలగించకండి.

ఆ తరువాత మీ రెగ్యులర్ షాంపూతో అలాగే గోరువెచ్చటి నీటితో మీ జుట్టును వాష్ చేసుకోండి.

వారానికి రెండుసార్లు ఈ హోంమేడ్ మెటీరియల్ తో మీ శిరోజాలను గారాబం చేస్తే మెరిసే మృదువైన శిరోజాలు మీ సొంతమవుతాయి.

7. విటమిన్ ఈ ఆయిల్ తో కొబ్బరి నూనె మరియు ఆపిల్ సిడర్ వినేగార్

7. విటమిన్ ఈ ఆయిల్ తో కొబ్బరి నూనె మరియు ఆపిల్ సిడర్ వినేగార్

ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ నుంచి నూనెను సేకరించి అందులో రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెను అలాగే అర టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ను కలపాలి.

ఈ మిశ్రమాన్ని తలపై బాగా అప్లై చేసుకోవాలి.

ఆ తరువాత మీ తలపై ఒక డ్రై షవర్ క్యాప్ ను ధరించాలి. 40 నుంచి 45 నిమిషాల తరువాత మీ శిరోజాలను గోరువెచ్చటి నీటితో అలాగే మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో శుభ్రపరుచుకోండి.

ఈ విటమిన్ ఈ ఆయిల్ కాంబినేషన్ ను వారానికి రెండు సార్లు వాడడం ద్వారా మెరిసే మృదువైన జుట్టును పొందవచ్చు.

English summary

how to get shiny hair | how to get smooth hair | vitamin e oil beneifts on hair care | how to get shiny and smooth hair with vitamin e oil

There are a number of ways in which you can use this amazing oil for improving your hair's appearance. Here, we've listed the most effective ways to use vitamin E oil for glossier and smoother hair.
Story first published: Friday, February 2, 2018, 14:30 [IST]
Subscribe Newsletter