ఒక నెలలోనే హెయిర్ గ్రోత్ ను పెంపొందించడమెలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

నిగనిగలాడే ఒత్తైన, పొడవాటి శిరోజాలను పొందాలని ఎవరికుండదు? శిరోజాలు అందాన్ని పెంచుతాయి. సిల్కీ, స్మూత్ హెయిర్ అనేది మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

అయితే కెమికల్ హెయిర్ ట్రీట్మెంట్, పొల్యూషన్ వంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎండలో ఎక్కువసేపు ఉండటం వంటి వివిధ కారణాల వలన హెయిర్ లాస్ తో పాటు ఫ్రిజ్జీ హెయిర్ సమస్య వేధిస్తుంది.

How To Grow Hair In 1 Month?

శిరోజాలను ఒత్తుగా మార్చేందుకు కెమికల్ గా అనేక ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ ద్వారా మీ స్టైలిస్ట్ మీకు శాశ్వత పరిష్కారాన్ని సూచించవచ్చు. అయితే, దీర్ఘకాలంలో హెయిర్ కు హానీ జరగవచ్చు.

అటువంటి సమస్యను అవాయిడ్ చేయడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ను పాటించడం మంచిది. ఈ రెమెడీస్ ను ఇంట్లోనే పాటించవచ్చు. సలోన్ కి వెళ్లి సమయాన్ని అలాగే ధనాన్ని వెచ్చించే బదులు ఇంట్లోనే చక్కటి పరిష్కారాన్ని పొందవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె ద్వారా అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను పొందవచ్చు. కాస్తంత కొబ్బరి నూనెను హెయిర్ మొదళ్ళ నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఆ తరువాత టవల్ తో కవర్ చేయండి. ముప్పై నిమిషాల పాటు ఇలా ఉంచండి. ఆ తరువాత షాంపూతో రిన్స్ చేయండి. ఈ రెమెడీను వారానికి రెండు లేదా మూడు సార్లు పాటించండి.

అవొకాడో ప్రోటీన్ మాస్క్:

అవొకాడో ప్రోటీన్ మాస్క్:

పదార్థాలు

1 అవొకాడో

1 ఎగ్

2 స్పూన్ల ఆలివ్ ఆయిల్

ఎలా వాడాలి:

పాత్రలోకి ఒక ఎగ్ ని తీసుకుని విస్క్ చేసి దాంట్లో మాష్ చేసిన అవొకాడోను మిక్స్ చేయండి. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను ఇందులో జోడించాలి. బాగా కలపాలి. ఈ మాస్క్ ను హెయిర్ పై అప్లై చేయాలి. హెయిర్ టిప్స్ ను కూడా కవర్ చేయాలి. దీన్ని 25-30 నిముషాల వరకు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేయాలి.

హనీ మరియు ఆయిల్ మాస్క్:

హనీ మరియు ఆయిల్ మాస్క్:

కావాల్సిన పదార్థాలు:

2 టేబుల్ స్పూన్ల మాయిశ్చరైజర్

1 స్పూన్ తేనె

2 స్పూన్ల ఆలివ్ ఆయిల్

ఎలా వాడాలి:

ఒక పాత్రలో, పైన చెప్పిన పదార్థాలని తీసుకుని వాటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేయాలి. ఆ తరువాత షవర్ క్యాప్ తో కవర్ చేయాలి. 20 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయాలి. లేదా షాంపూ చేసుకున్న తరువాత హనీ మరియు ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేయవచ్చు. 5 నిమిషాల తరువాత షాంపూతో రిన్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం హెయిర్ కండిషనర్ గా పనిచేస్తుంది. హెయిర్ ను బలపరుస్తుంది. ఆ విధంగా హెయిర్ గ్రోత్ ను మెరుగుపరుస్తుంది.

అరటిపండు:

అరటిపండు:

అరటిపండులో విటమిన్ ఏ, సి మరియు ఈ తో పాటు కొన్ని మినరల్స్ లభ్యమవుతాయి. ఇవి హెయిర్ ను మాయిశ్చరైయిజ్ చేసి బలపరిచేందుకు తోడ్పడతాయి. తద్వారా, హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.

కావాల్సిన పదార్థాలు:

బాగా పండిన అరటిపండు

2 టేబుల్ స్పూన్ల పెరుగు

2 స్పూన్ల రోజ్ వాటర్

ఎలా వాడాలి:

బాగా పండిన అరటిపండును మ్యాష్ చేసి చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. ఇప్పుడు పెరుగు మరియు రోజ్ వాటర్ ను జోడించి బాగా కలపాలి. ఈ చిక్కటి మాస్క్ ను హెయిర్ పై అప్లై చేయాలి. 1 గంటపాటు ఈ మిశ్రమాన్ని ఇలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ ను హెయిర్ పై అప్లై చేసుకున్నప్పుడు షవర్ క్యాప్ తో కవర్ చేయడం మరచిపోకూడదు. ఈ మాస్క్ ను వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితం లభిస్తుంది.

English summary

How To Grow Hair In 1 Month?

Who wouldn't love to have that thick, bouncy and long hair? After all, smooth, silky and healthier hair adds on to one's own personality along with enhancing the beauty. Ingredients like coconut oil, banana, olive oil, etc., can help you to grow your hair naturally within a month.But due to several reasons like chemical hair treatment,