స్ట్రైటెనింగ్ వల్ల మీ జుట్టు గనుక దెబ్బ తిని ఉంటే, ఈ సహజ పద్దతుల ద్వారా సరిచేసుకోండి

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఇది ఏమి రహస్యం కాదు, స్ట్రైటెనింగ్ చేసుకోవడం వల్ల మీ జుట్టుకి విపరీతమైన నష్టం వాటిల్లుతుంది మరియు దెబ్బతింటుంది. చాలా కొద్దిమంది స్త్రీలు మాత్రమే శాశ్వత స్ట్రైటెనింగ్ పద్దతులను అవలంభింస్తారు. మిగతా ఎంతో మంది ఫ్లాట్ ఐరన్ పద్దతిని ఉపయోగించి జుట్టుని నిటారుగా, సొగసైనదిగా చేసుకుంటారు.

ఈ రకమైన స్టైలింగ్ పద్దతిలో వేడిని ఉపయోగించి జుట్టు యొక్క నిర్మాణాన్ని మార్చడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు యొక్క గ్రీవం దెబ్బ తింటుంది మరియు శక్తిహీనం అవుతుంది. ఈ నష్టాన్ని గనుక సరిచేసుకోకపోయినా లేక సరైన సంరక్షణ చేసుకోకపోయినా, మీ యొక్క జుట్టు యొక్క స్థితి గతులు మరింతగా దిగజారిపోతుంది మరియు చిట్లిపోతుంది. కొన్నిసార్లు మధ్యలోకి తెగిపోతాయి.

damaged hair

అదృష్టవశాత్తు స్ట్రైటెనింగ్ వల్ల నష్టం కలిగిన జుట్టుని సహజ సిద్దమైన పద్దతుల ద్వారా వాటికీ పూర్వ వైభవాన్ని తీసుకురావచ్చు. వాటిని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. ఈరోజు మనం బోల్డ్ స్కై లో వివిధ రకాల పద్ధతులు ఏంటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, జుట్టు ని సంరక్షించుకోవడానికి అవసరమైన పదార్ధాలన్నింటిని తెచ్చుకోవాలి మరియ అందాన్ని పెంపొందించుకునే పనిలో భాగంగా వాటిని క్రమం తప్పకుండా వాడాలి.

దెబ్బ తిన్న జుట్టుకి సమర్ధవంతమైన నివారణలు ఏవి మరియు వేటిని ఉపయోగించడం వల్ల అవి ప్రభావవంతంగా పనిచేసి వీలైనంత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1. హెన్నా పొడి :

1. హెన్నా పొడి :

ఎలా వాడాలంటే :

ఒక టేబుల్ స్పూన్ హెన్నా పొడిని, రెండు టేబుల్ స్పూన్ ల కొబ్బరి నూనె మరియు 3 నుండి 4 టీ స్పూన్ల పెరుగులో కలపాలి.

ఈ మిశ్రమాన్ని మీరు మీ జుట్టుకి రాసుకోవాలి. దానిని అలానే 40 నుండి 45 నిమిషాల పాటు ఉంచేయాలి.

ఆ తర్వాత దానిని సాధారణ షాంపూ మరియు గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.

ఎప్పుడెప్పుడు వాడాలంటే :

ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి వాడటం వల్ల జుట్టుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, జుట్టు సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తుంది మరియు స్ట్రైటెనింగ్ వల్ల దెబ్బ తిన్న జుట్టు ని మరమత్తులు చేస్తుంది.

2. గుడ్డు :

2. గుడ్డు :

దీనిని ఎలా వాడాలంటే :

గుడ్డులో ఉన్న తెల్లని సొనను, 2 టేబుల్ స్పూన్ల బాదాం నూనె లో కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు యొక్క కుదుళ్లకు బాగా రాయాలి మరియు జుట్టు చివర్లకు కూడా బాగా రాసి ఆ తర్వాత తలను బాగా మర్దన చేయాలి.

ఇలా రాసుకున్న తర్వాత 50 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీరు మరియు సాధారణ షాంపూ తో కడిగివేయాలి.

ఎప్పుడెప్పుడు వాడాలంటే :

ఈ ఇంట్లో చేసుకొనే మిశ్రమాన్ని వారానికి 2 సార్లు వాడటం వల్ల, మీ కుదుళ్లకు కొత్త శక్తిని ఇస్తుంది, దెబ్బ తిన్న జుట్టుని బాగు చేస్తుంది మరియు మొత్తంగా మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. ఆలివ్ నూనె :

3. ఆలివ్ నూనె :

దీనిని ఎలా వాడాలంటే :

2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె ని 20 నుండి 30 సెకండ్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్ లో వేడి చేయాలి.

ఆ తర్వాత కుదుళ్ళ భాగంలో బాగా రాసి బాగా మర్దన చేయాలి.

అలా రాసుకున్న నూనెను రాత్రంతా అలానే వదిలివేయాలి.

ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు మరియు సాధారణ షాంపూ తో కడిగివేయాలి.

ఎప్పుడెప్పుడు వాడాలంటే :

వారానికి కనీసం 2 నుండి 3 సార్లు ఈ ఇంట్లో తయారుచేసుకున్న ఇంటి వైద్యాన్ని వాడవచ్చు. ఎవరి జుట్టు అయితే ఫ్లాట్ ఐరన్ పద్దతి ని ఎక్కువగా వాడటం వల్ల పాడై ఉంటుందో, అలాంటి జుట్టుని ఇది మరమత్తు చేస్తుంది.

4. మయోన్నైస్:

4. మయోన్నైస్:

దీనిని ఎలా వాడాలంటే :

2 నుండి 3 స్పూన్ల మయోన్నైస్ తీసుకొని మీ కుదుళ్ళ భాగం మరియు జుట్టుకు బాగా రాయండి.

మీ తలకు ఒక పొడి షవర్ కాప్ ని ఉపయోగించి కప్పండి.

అలా ఒక గంట పాటు వదిలేయండి.

ఆ తర్వాత గోరువెచ్చటి నీరు, సాధారణ షాంపూ ని ఉపయోగించి మీ జుట్టుని బాగా కడుక్కోండి మరియు కండీషనర్ ని వాడండి.

ఎప్పుడెప్పుడు వాడాలంటే :

ఉత్తమైన ఫలితాలు రావాలంటే కనీసం ఒక నెలలో 4 నుండి 5 సార్లు ఈ శక్తివంతమైన చికిత్సను మీరు ఉపయోగించండి.

5. విటమిన్ ఈ నూనె :

5. విటమిన్ ఈ నూనె :

దీనిని ఎలా వాడాలంటే :

2 నుండి 3 విటమిన్ ఈ గుళికలు తీసుకొని, వాటి నుండి నూనె ను బయటకు తీయండి.

మీ యొక్క కుదుళ్ళ భాగంలో ఆ నూనె రాయండి మరియు మీ వేళ్ళ యొక్క చివరలు ఉపయోగించి 5 నుండి 10 నిముషాల పాటు సౌమ్యంగా మర్దన చేయండి.

ఆ నూనెను మీ జుట్టు పై 40 నుండి 45 నిముషాల పాటు ఉంచిన తర్వాత, గోరువెచ్చని నీరు మరియు సాధారణ షాంపూ తో కడిగివేయండి.

ఎప్పుడెప్పుడు వాడాలంటే :

దెబ్బతిన్న జుట్టుని బాగు చేయాలని మీరు గనుక భావిస్తే, ఈ సహజ సిద్దమైన పద్దతిని వారానికి కనీసం 2 నుండి 3 సార్లు వాడండి.

6. అరటి పండు :

6. అరటి పండు :

దీనిని ఎలా వాడాలంటే :

పండు మాగిన రెండు అరటి పండ్లను తీసుకొని బాగా చితగొట్టండి. ఆ తర్వాత ఆ ముద్దని 5 నుండి 6 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లో కలపండి.

ఈ మిశ్రమాన్ని అంతా జుట్టు కుదుళ్ళ నుండి జుట్టు చివర్ల వరకు రాయండి.

దీనిని అలానే 40 నుండి 45 నిముషాల పాటు ఉంచిన తర్వాత, గోరువెచ్చని నీరు మరియు సాధారణ షాంపూతో కడిగి వేయండి.

ఎప్పుడెప్పుడు ఎలా వాడాలంటే :

దెబ్బతిన్న జుట్టు ఆరోగ్యవంతంగా మరియు అందంగా కనపడాలంటే, ఈ సహజ సిద్దమైన చికిత్సను వారానికి ఒకసారి వాడండి.

7. అవొకాడో :

7. అవొకాడో :

దీనిని ఎలా వాడాలంటే :

పండు మాగిన ఒక అవొకాడో ని తీసుకొని, బాగా చితకొట్టండి మరియు ఆ ముద్దను 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లో కలపండి.

ఈ మొత్తం మిశ్రమాన్ని కుదుళ్ళ దగ్గర నుండి జుట్టు చివర్ల వరకు రాయండి.

మీ తల పై అలానే ఒక గంట పాటు ఉంచండి.

గోరువెచ్చటి నీరు మరియు సాధారణ షాంపూ తీసుకొని మీ జుట్టుని శుభ్రంగా కడిగివేయండి.

ఎప్పుడెప్పుడు వాడాలంటే :

ఈ శక్తివంతమైన చికిత్సను నెలకు కనీసం రెండు సార్లు వాడటం వల్ల, మీ జుట్టు కుదుళ్ళు మరియు జుట్టు మొత్తం కూడా ఆరోగ్యవంతంగా మారి మీ జుట్టుకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తుంది. .

English summary

How To Naturally Repair Hair Damaged From Straightening

Holi colours may cause a lot of irritation to the skin. It is important to protect your skin against these chemicals. Having a dry skin too can cause skin damage due to the Holi colours. Keeping yourself hydrated, using a sunglass, applying a sunscreen, etc., are some of the ways you can take care of you skin this Holi.
Story first published: Monday, February 26, 2018, 7:00 [IST]