స్ట్రయిట్ హెయిర్ కోసం ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి?!!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మనలో చాలామంది అమ్మాయిలు సొగసైన స్ట్రెయిట్ హెయిర్ ఇష్టపడుతారు. స్ట్రెయిట్ హెయిర్ చూడటానికి సులభంగానే కనిపిస్తుంది దానికి సరైన సరైన జాగ్రత్త అవసరం. ఇప్పుడు సహజంగా స్ట్రెయిట్ హెయిర్ ని ఈ జాగ్రత్తలను పాటించడం వలన మేనేజ్ చేయడం సులభం. మరి దీని కోసం ఎలాంటి సంరక్షణలు తీసుకోవాలో కొన్ని చిట్కాలను మీకోసం తెలియజేశాము మరి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా వున్నారా..

కర్లీ లేదా ఉంగరాల వెంట్రుకలు కలిగిన వ్యక్తులకు స్ట్రెయిట్ హెయిర్ ని మేనేజ్ చేయడం సులభంగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు.స్ట్రెయిట్ హెయిర్ తో ఒత్తయిన జుట్టుని పొందవచ్చు మరియు దానితో పాటు చిక్కుపట్టడం వంటి సమస్యలని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జుట్టు ని ఎలా స్ట్రిగ్టెనింగ్ చేసుకోవాలి మరియు స్ట్రెయిట్ హెయిర్ కోసం ఎలాంటి శ్రద్ధ వహించాలనే విషయం మీద మీకు అనేక రకాల ఆర్టికల్స్ వున్నాయి.

కానీ మీ జుట్టు సహజంగా స్ట్రెయిట్ గా ఉంచడం ఎలా? చాలామంది మహిళలు ఈ జుట్టు మీద చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండదని అనుకుంటూ వుంటారు. అయితే, ఇక్కడ మేము మీకోసం స్ట్రెయిట్

హెయిర్ గురించి ఎలా శ్రద్ధ వహించాలో కొన్ని సాధారణ చిట్కాలు ఇస్తున్నాము వాటిని చదివి తెలుసుకోండి.

1. షాంపూ:

1. షాంపూ:

మీరు మీ జుట్టుకి ఉపయోగించే షాంపూ ఎప్పుడూ ఒక తేలికపాటి ధై ఉండాలి. ఎందుకంటే మీ జుట్టు చాలా పొడిగా ఉంటే,తొందరగా మీ జుట్టు చెదిరిపోయి గూడులాగా తయారవుతుంది అంతే కాదు ఇది చూడటానికి చాలా అసహ్యం గా కూడా కన్పిస్తుంది. మీరు స్ట్రెయిట్ హెయిర్ గురించి శ్రద్ధ వహించడానికి సులభమైన చిట్కా ఇది.

2. బ్రషింగ్:

2. బ్రషింగ్:

మీరు మీ జుట్టు ని వాష్ చేయడానికి ముందు ఖచ్చితంగా బ్రష్(దువ్వండి) మరియు వాష్ చేసిన తరవాత

ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టుని దువ్వకండి ఎందుకంటే, ఈ సమయంలో జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది మరియు బ్రష్ చేయడం వలన ఇది విరిగిపోయి మరియు స్ప్లిట్ అయ్యే ప్రమాదముంది.

3. హీట్ స్టైలింగ్ ని ఆపండి:

3. హీట్ స్టైలింగ్ ని ఆపండి:

సాధ్యమైనంతవరకు, మీ జుట్టు కి హీట్ స్టైలింగ్ చేయడం ఆపండి. అంటే బ్లో డ్రైయ్యింగ్ కూడా చేయడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు మీ జుట్టు ను సహజంగా ఆరబెట్టడానికి ప్రయత్నించండి.

4. స్ప్లిట్ ఎండ్స్ కోసం:

4. స్ప్లిట్ ఎండ్స్ కోసం:

స్ట్రెయిట్ హెయిర్ చివరలను జుట్టు స్ప్లిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది మరియు అవి స్ట్రెయిట్ హెయిర్ మీద చాలా ఎక్కువ గా కనిపిస్తాయి. కాబట్టి ఇలా స్ప్లిట్ రాకుండా నివారించడానికి రెగ్యులర్ ట్రిమ్స్ కోసం వెళ్లడమనేది ఒక చిన్న చిట్కా. కానీ ఉంగరాల లేదా కర్లీ జుట్టు లో, స్ప్లిట్ కనిపించకుండా అందులో కవర్ అయిపోతాయి.

5. ఆహారం:

5. ఆహారం:

మీ జుట్టు ఎలా ఉంటుందో దానిలో మీరు తీసుకొనే ఆహారం భారీ పాత్ర పోషిస్తుంది. మీ ఆహారంలో ప్రోటీన్లను చేర్చండి. మీకు మంచి ఆహారం తీసుకోకపోతే, అది పెళుసు గా మారి మరియు చూడటానికి బలహీనంగా అనిపిస్తుంది. ఇది స్ట్రెయిట్ హెయిర్ యొక్క శ్రద్ధ వహించడానికి చాలా ముఖ్యమైన చిట్కాలలో ఒకటి.

6. ఆయిల్ మసాజ్:

6. ఆయిల్ మసాజ్:

విటమిన్ E నూనెను ఉపయోగించి జుట్టు మరియు స్కాల్ప్ కి మసాజ్ చేయండి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు మీరు మీ జుట్టును కడగడం చేసినప్పుడు, మీ జుట్టు దాని సహజ నూనెలను కోల్పోదు. ఈ విధంగా స్ట్రెయిట్ హెయిర్ కోసం సహజంగానే శ్రద్ధ తీసుకోవచ్చు.

English summary

How To Take Care Of Straight Hair?

Most people LOVE straight and sleek hair. But even straight hair, which looks easy to manage, needs proper care. Now, naturally straight hair is fairly easy to manage, but if it is rebonded straight hair, it would need a lot of care. And that's why we're sharing tips on how to take care of straight hair..
Story first published: Monday, January 29, 2018, 14:00 [IST]
Subscribe Newsletter