కొబ్బరినూనెతో డాండ్రఫ్ ను నివారించడం ఎలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

కొబ్బరి నూనెలో అనేక ఔషధ గుణాలు కలవు. కొబ్బరి నూనె కేవలం వంటకానికి పరిమితం కాలేదు. ఇది అనేక సౌందర్య సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది.

అందువలన, అనేక బ్యూటీ ప్రోడక్ట్స్ లో కొబ్బరి నూనెను ముఖ్యమైన పదార్థంగా వాడతారు. మన డే టు డే లైఫ్ లో కొబ్బరి నూనె కున్న పాత్ర విశిష్టమైనది.

కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు కలవు. అలాగే, కొబ్బరి నూనె చర్మంపై మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇది అత్యంత ప్రభావవంతమైనది. శిరోజాలకు పోషణని అందిస్తుంది.

How To Treat Dandruff With Coconut Oil

ఈ రోజుల్లో అనేక బ్యూటీ ప్రాబ్లెమ్స్ ఎదురవుతున్నాయి. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, హెయిర్ ఫాల్ మరియు డల్ స్కిన్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. డాండ్రఫ్ అనేది అటువంటి సమస్యలలో ఒకటి.

డాండ్రఫ్ మరియు డ్రై స్కాల్ప్ సమస్యలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. శిరోజాలను రూట్స్ నుంచి మాయిశ్చర్ చేయడానికి కొబ్బరి నూనె ట్రీట్మెంట్ అవసరపడుతుంది. ఇక్కడ కొబ్బరి నూనెతో డాండ్రఫ్ ని అలాగే డ్రై స్కాల్ప్ ని నివారించేందుకు కొన్ని అద్భుతమైన రెమెడీస్ ను వివరించాము.

హాట్ ఆయిల్ మసాజ్:

హాట్ ఆయిల్ మసాజ్:

కొబ్బరి నూనెతో హాట్ ఆయిల్ మసాజ్ ను చేసుకుంటే స్కాల్ప్ పై పేరుకున్న దుమ్మూ ధూళి తొలగిపోతాయి. స్కాల్ప్ పై పేరుకున్న దుమ్ము ధూళి వలన స్కాల్ప్ ఆరోగ్యం దెబ్బతింటుంది. సరైన హాట్ ఆయిల్ మాసాజ్ ద్వారా ఈ సమస్యను తొలగించుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:

3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

ఎలా చేయాలి:

1. కొంత వర్జిన్ కొబ్బరి నూనెను కాస్తంత వేడి చేయండి. మీ శిరోజాల పొడవును బట్టి ఆయిల్ ను తీసుకోవాలి.

2. ఈ నూనె మీ శిరోజాలకు అప్లై చేయడానికి తగిన విధంగా వేడి చేయబడాలి. ఎక్కవగా వేడి చేయకండి.

3. ఈ హాట్ ఆయిల్ తో స్కాల్ప్ పై అలాగే శిరోజాలపై పది నుంచి పదిహేను నిమిషాలపాటు మసాజ్ చేయండి.

4. ముప్పై నిమిషాలపాటు ఈ నూనెను శిరోజాలపై అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత సాధారణ నీటితో అలాగే తేలికపాటి షాంపూతో వాష్ చేయండి.

5. వారానికి ఒకసారి ఈ పద్దతిని పాటించడం ద్వారా డాండ్రఫ్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:

కొబ్బరి నూనె మరియు నిమ్మరసం:

నిమ్మరసం అనేది ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది స్కాల్ప్ ని శుభ్రపరచి రిస్టోర్ చేయడానికి తోడ్పడుతుంది. డాండ్రఫ్ నుంచి తక్షణ పరిష్కారం కోసం ఈ రెమెడీని ప్రయత్నించవచ్చు.

కావలసిన పదార్థాలు:

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

ఒక టీస్పూన్ నిమ్మరసం

ఎలా వాడాలి:

1. ఈ రెండు పదార్థాలని ఒక బౌల్ లోకి తీసుకోండి.

2. శిరోజాలపై వీటిని అప్లై చేయండి. సున్నితంగా మసాజ్ చేయండి.

3. వీటిని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు హెయిర్ పై ఉండనివ్వండి.

4. సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో వాష్ చేసుకోండి.

 కొబ్బరి నూనె మరియు కర్పూరం:

కొబ్బరి నూనె మరియు కర్పూరం:

కొబ్బరి నూనె మరియు కర్పూరం డాండ్రఫ్ ను అరికట్టేందుకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. కర్పూరంలో హీలింగ్ ప్రాపర్టీస్ కలవు.

కావలసిన పదార్థాలు:

ఒక టీస్పూన్ కర్పూరం

అర కప్పు కొబ్బరినూనె

ఎలా వాడాలి:

1. కర్పూరంతో పాటు కొబ్బరి నూనెను బాగా కలపండి.

2. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై అప్లై చేసి ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు అలాగే ఉంచండి.

3. ముప్పై నిమిషాల తరువాత సాధరణ నీటితో అలాగే సల్ఫేట్ ఫ్రీ మైల్డ్ షాంపూతో వాష్ చేయండి.

4. ఈ రెమెడీని వారానికి రెండు మూడు సార్లు పాటించండి. అద్భుతమైన అలాగే వేగవంతమైన ఫలితాలను పొందగలుగుతారు.

కొబ్బరినూనె మరియు మెంతులు:

కొబ్బరినూనె మరియు మెంతులు:

స్కాల్ప్ పై దురదను అలాగే డాండ్రఫ్ ను అరికట్టేందుకు మెంతులు ఉపయోగకరంగా ఉంటాయి.

కావలసిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ మెంతులు

నాలుగు టేబుల్ స్పూన్ల వర్జిన్ కొబ్బరి నూనె

ఎలా వాడాలి:

1. కొంత కొబ్బరి నూనెను వేడి చేయండి.

2. ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడిని జోడించి బాగా కలపండి.

3. ఈ మిశ్రమంతో స్కాల్ప్ పై మసాజ్ చేయండి.

4. ముప్పై నిమిషాల తరువాత మైల్డ్ షాంపూతో వాష్ చేయండి.

English summary

How To Treat Dandruff With Coconut Oil

Coconut oil is antibacterial in nature that helps in getting rid of dandruff. Also, coconut oil acts as the best moisturizer for the skin and is very effective for hair than any other oils that we have. Coconut oil can be used with lemon, jojoba oil, camphor, etc., to treat dandruff.Coconut Oil For DandruffCoconut oil is antibacterial in nature that helps in getting rid of dandruff. Also, coconut oil acts as the best moisturizer for the skin and is very effective for hair than any other oils that we have. Coconut oil can be used with lemon, jojoba oil, camphor, etc., to treat dandruff.Coconut Oil For Dandruff