For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఉసిరికాయ వలన కలిగే కేశ ఆరోగ్య ప్రయోజనాలు

  |

  ఎటువంటి సమస్యలు లేని ఆరోగ్యవంతమైన జుట్టు కోరుకునేవారు తప్పనిసరిగా ప్రతిరోజు శిరోజాసంరక్షణ చర్యలు చేపట్టాలి. జుట్టు యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికై వివిధ రకాల తైలాలను వాడటం అనాదిగా మనం చూస్తూనే ఉన్నాం.

  జుట్టుకు నూనె పెట్టడం వలన అనేక కేశ సంబంధిత సమస్యలు నివారింపబడటమే కాక జుట్టుకు పోషణ మరియు తేమ అందుతుంది. కాని, మీ జుట్టుకు ఏ నూనె సరిగ్గా సరిపోతుంది అని తెలుసుకోవడం కష్టతరమైన పని. బజారులో దొరికే రసాయనాలతో కూడిన తైలాలను కాకుండా, ఇంట్లో లభించే సహజమైన నూనెలు ఉపయోగించడం ఉత్తమం.

  How To Use Amla For Hair Care?

  వివిధ బ్రాండ్ల ఉత్పత్తులు శ్రేష్టమైనవని వారికి వారుచెప్పుకున్నా, వాటిలో ఎన్నో రసాయనాలు ఉంటాయి. అధిక కాలం పాటు వినియోగిస్తే, ఇవి మీ కేశాలకు నష్టం కలిగిస్తాయి. కనుక మన ఇంట్లో చవకగా లభించే సామాగ్రితో, నూనె తయారు చేసుకుని వాడటం అన్నిటికన్నా శ్రేయస్కరం.

  అటువంటి వాటిలో ఒకటి ఉసిరికాయని ఉపయోగించి నూనె తయారు చేయడం. ఉసిరికాయను ఉపయోగించి నూనె ఎలా తయారు చేయాలో, దాని వలన కలిగే ఉపయోగాలు ఏమిటో, తెలుసుకోవాలంటే , ఈ వ్యాసాన్ని చదివేయండి మరి!

  శిరోజ సంరక్షణకు ఉసిరికాయ నూనె:

  శిరోజ సంరక్షణకు ఉసిరికాయ నూనె:

  ఈ నూనెను, మనకు ఎక్కడైనా సులభంగా దొరికే ఉసిరికాయలతో, మీకు మీరుగా ఇంట్లోనే, సులువుగా తయారు చేసుకోవచ్చు. జుట్టు అధికంగా రాలిపోయే వారికి ఈ నూనె చాలా మేలు చేస్తుంది.అనాదిగా ఉసిరికాయలను ఎన్నో రకాల శిరోజ సమస్యల చికిత్సలో వినియోగిస్తున్నారు.

  ఉసిరికాయ నూనెను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

  ఉసిరికాయ నూనెను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:

  • కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరినూనె - ఒక కప్పు

  • నీరు - 4 లీ.

  • ఉసిరిక పొడి- 100 గ్రాములు

  ఉసిరికాయను ఉపయోగించి నూనె తయారు చేసే విధానం:

  ఉసిరికాయను ఉపయోగించి నూనె తయారు చేసే విధానం:

  • నాలుగు లీటర్ల నీరు తీసుకుని, దానిలో 70 గ్రాముల ఉసిరిక పొడిని కలిపి, బాగా మరిగించాలి.

  • నీటి పరిమాణం పావు వంతుకు తగ్గేదాక మరిగించాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

  • చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడగట్టి, ఉసిరిక నీటిని సేకరించండి.

  • ఒక గిన్నెలో మిగిలిన ఉసిరిక పొడిని తీసుకుని నీటిని కలిపి చిక్కని ముద్దగా చేయండి.

  • ఇప్పుడు వడగట్టిన ఉసిరిక రసానికి, ఉసిరిక పేస్టు మరియు కొబ్బరినూనె కలిపి బాగా మరిగించాలి.

  • నీరు మొత్తం ఆవిరయ్యేంత వరకు మరిగించి కేవలం నూనె మరియు ఉసిరిక పొడి మాత్రమే మిగిలేటట్టు చేయండి. ఈ మిశ్రమాన్ని చల్లబరచండి.

  • రెండు టేబుల్ స్పూన్ల నూనెను వినియోగానికి వేరుగా పెట్టుకుని, మిగిలిన నూనెను గాలి చొరబడని సీసాలో వేసి భద్రపరచండి.

  • ఈ నూనెతో మాడును పదిహేను నిమిషాల పాటు మర్దన చేసుకుని, తరువాత జుట్టు పొడవునా పట్టేటట్లు, ఈ నూనెను బాగా రాసుకోవాలి.

  • 45 నిమిషాలు పాటు జుట్టును ఆరనివ్వండి.

  • తరువాత సల్ఫేటు లేని సున్నితమైన షాంపూతో తలరుద్దుకోండి.

  • తరువాత, సున్నితమైనకండీషనర్ తో జుట్టు కండిషన్ చేసుకోండి.

  • జుట్టు ని కడుక్కున్నాక తువ్వాలను ఉపయోగించి నీటిని శుభ్రంగా తుడుచుకోండి.

  • జుట్టును సహజంగా గాలికి ఆరనివ్వండి.

  ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు ఆచరించడం వలన, ఏ సమస్యలు లేని ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతమవుతుంది.

  ఉసిరికాయలు శిరోజ సంరక్షణకు సర్వశ్రేష్టమైనది.

  ఉసిరికాయలు శిరోజ సంరక్షణకు సర్వశ్రేష్టమైనది.

  ఉసిరికాయలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు అత్యవసర కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మాడును ఉసిరిక నూనెతో మర్దన చేసుకున్నప్పుడు, ఈ గుణాలన్ని కలిసి మాడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. జుట్టు యొక్క కుదుళ్లను బలంగా చేసి, రాలడాన్ని అరికట్టి, ఆరోగ్యంగా మెరిసే శిరోజాలను మీకు అందిస్తుంది.

  ఉసిరికాయ ఏ విధంగా మీ జుట్టుకు మేలు చేస్తుంది?

  ఉసిరికాయ ఏ విధంగా మీ జుట్టుకు మేలు చేస్తుంది?

  ఉసిరికాయ జుట్టు రాలడాన్ని అరికట్టడానికి మాత్రమే కాక, ఆరోగ్యవంతమైన జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. దీనిని స్త్రీలు మరియు పురుషులు కూడా వినియోగించి జుట్టును అందంగా మలచుకోవచ్చు.

  మాడును ఉసిరిక నూనెతో మర్దన చేసుకుంటే, రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివలన వెంట్రుకలకు పోషణ అంది ఆరోగ్యంగా ఎదుగుతాయి. అంతేకాకుండా, మాడు యొక్క ఆరోగ్యం కూడా ఉసిరిక నూనె వలన మెరుగవుతుంది.

  మాడు మీద అసహ్యంగా కనిపించే చుండ్రు, క్రమం తప్పకుండా ఉసిరిక నూనెను వాడితే మాయమవుతుంది. అంతేకాక, జుట్టును పట్టుకుని ఉండే మురికి, జిడ్డు కూడా ఉసిరిక నూనెలో కరిగిపోతాయి.

  విటమిన్ సి లోపం వలన జుట్టు రాలడం, విరగడం వంటివి జరుగుతాయి. ఉసిరికాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ సి నిల్వలు పెరుగుతాయి.

  ఉసిరికలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు వెంట్రుకలను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్ తో పోరాడటం వలన ఇది సాధ్యమవుతుంది.

  క్రమం తప్పకుండా ఉసిరిక నూనెను వాడటం వలన, వెంట్రుకలు బలంగా తయారై,జుట్టు తెగిపోవడం మరియు పగలడం జరగవు.

  మీ ఆహారంలో ఉసిరికాయను భాగంగా మార్చుకోండి. ఉసిరికాయలను తినడం వలన, మీ శిరోజాల ఆరోగ్యం అన్ని రకాలుగా మెరుగవుతుంది. జుట్టు తెల్లబడటాన్ని నివారించి, మాడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. తాజా ఉసిరికాయల రసాన్ని ప్రతిదినం సేవించడం వలన, మీ ఆరోగ్యం అన్ని విధాలుగా మెరుగవుతుంది.

  English summary

  How To Use Amla For Hair Care?

  Proper hair care routine is important if you wish to have healthy and problem-free hair. Oiling your hair frequently keeps your hair strong and healthy. Using oils to boost hair health is one tradition that has been followed since ages.Apart from solving almost all hair-related problems, oiling the hair keeps it conditioned and nourished. However, deciding the oil that will best suit your hair type can be a tough job. You can dump the chemical-rich hair oils available in the market and substitute it with home-based oils.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more