For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు చివర్లు చిట్లి ఉంటే, అవకాడో ఎలా ఉపయోగించాలి?

జుట్టు చివర్లు చిట్లడం అనేది జుట్టు దెబ్బతినడానికి సంకేతం. ఈరకమైన జుట్టు పేలవంగా, కష్టంగా, అరిగిపోయినట్టు కనిపిస్తుంది. మీ జుట్టు వెలుపలి పోర దెబ్బతిన్నపుడు ఇలాంటి అసహ్యమైన పరిస్ధితి కనిపిస్తుంది.

By Lakshmi Bai Praharaju
|

చివర్లు చిట్లడం అనేది జుట్టు దెబ్బతినడానికి సంకేతం. ఈరకమైన జుట్టు పేలవంగా, కష్టంగా, అరిగిపోయినట్టు కనిపిస్తుంది. మీ జుట్టు వెలుపలి పోర దెబ్బతిన్నపుడు ఇలాంటి అసహ్యమైన పరిస్ధితి కనిపిస్తుంది.

మీరు కూడా జుట్టు చివర్లు చిత్లినపుడు, వాటిని అరికట్టడానికి హెయిర్ కట్ కి ఎప్పుడూ వెళ్తూ ఉంటె, మొదళ్ళ నుండి జుట్టు సమస్యను వదిలించుకునే సమస్యను అధిగమించే సమయం ఇదే. ఆ తంతువులను వేరుచేయడానికి బదులుగా, ఈ కనిపించని సమస్య చికిత్సకు మీరు ప్రయత్నించండి.

how to use avocado for split ends

చిట్లిన జుట్టు చికిత్సకు సహజ పదార్ధాలు ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేకమైన వస్తువు ఈ చిట్లిన జుట్టును అద్భుతంగా బాగుచేసి, మీ మొత్తం జుట్టు ఆరోగ్యంగా ఉండేట్టు చేస్తుంది. మేము మాట్లాడేది అవకాడో గురించి.

ఫాటీ అమైనో ఆసిడ్స్ తో నిండి ఉన్న ఈ అవకాడో దెబ్బతిన్న జుట్టును పునరుద్ధరించి, చిట్లిన జుట్టుకు ఎంతో ప్రభావవంతమైన రీతిలో చికిత్సను అందిస్తుంది.

చిట్లిన జుట్టుకు చికిత్స కోసం జుట్టు ప్రయోజనాలకు ఉపయోగపడే మంచి మార్గాలలో కొన్నిటి జాబితాను ఇక్కడ ఇచ్చాము:

1.అవకాడో + అరటిపండు

1.అవకాడో + అరటిపండు

మాష్ చేసిన ఒక అవకాడో, పండిన అరటిపండు, 4-5 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేయండి.

ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి, ఒక గంటపాటు వదిలేయండి.

తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

చిట్లిన చివర్లు తొలగించడానికి ఈ విధానాన్ని వారానికి ఒకసారి మరలా చేయండి.

2.అవోకడో + ఆల్మండ్ ఆయిల్

2.అవోకడో + ఆల్మండ్ ఆయిల్

3 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్తో 2 టేబుల్ స్పూన్ల అవోకడో ఆయిల్ ని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి, 40 నిమిషాల సేపు ఉంచండి. గోరువెచ్చని నీటితో మీ జుట్టును కడగండి.

అద్భుతమైన ఫలితాల కోసం వారానికి ఒకసారి ఇలా చేయండి.

3.అవోకడో + మయోనైజ్

3.అవోకడో + మయోనైజ్

అవోకడో ని బాగా మాష్ చేసి, 2 టేబుల్ స్పూన్ల మయోనైజ్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి, 30-35 నిమిషాల సేపు ఉంచండి. తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో మీ జుట్టును కడగండి.

గమనించదగ్గ ఫలితాల కోసం, ఈ ప్రత్యేకమైన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించండి.

4.అవోకడో + బొప్పాయి

4.అవోకడో + బొప్పాయి

తాజాగా తీసిన బొప్పాయి గుజ్జుకు 2 టేబుల్ స్పూన్ల మాష్ చేసిన అవోకడో తో కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి, 30 నిమిషాల పాటు మంచిగా ఆరనివ్వండి.

తరువాత, గోరువెచ్చని నీటితో కడగండి.

అనుకూల ఫలితాల కోసం ఇంట్లో తయారుచేసిన ఈ మాస్క్ తో మీ సమస్య ఉన్న జుట్టుకు నెలకు రెండుసార్లు చికిత్స చేయండి.

5.అవోకడో + తేనె

5.అవోకడో + తేనె

2-3 టేబుల్ స్పూన్ల మాష్ చేసిన అవోకడో మిశ్రమానికి 4 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ తేనె ని కలపండి.

ఈ తయారుచేసిన మిశ్రమాన్ని మీ తలకు పట్టించండి.

40 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేయండి.

చిట్లిన జుట్టును పోగొట్టుకోవడానికి నెలకు 3-4 సార్లు ఈ పద్ధతిని పాటించండి.

6.అవోకడో + ఎగ్ వైట్

6.అవోకడో + ఎగ్ వైట్

ఎగ్ వైట్ ని పక్కకు పెట్టి, 3 టేబుల్ స్పూన్ల మాష్ చేసిన అవోకడో తో కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ చిట్లిన జుట్టుకు పట్టించండి.

30-35 నిమిషాల పాటు అలా వదిలేసి, తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

మీ జుట్టుకు మంచి ఫలితాలను పొందడానికి ఈ పద్ధతిని ప్రయత్నించండి.

7.అవోకడో + పాలు

7.అవోకడో + పాలు

ఒక బౌల్ తీసుకుని, అందులో అవోకడో ని తీసుకుని ఒక ఫోర్క్ తో మాష్ చేయండి.

అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి పాలు పోసి మిశ్రమం తయారయ్యే వరకు బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి, 30 నిమిషాల పాటు ఉంచండి.

తరువాత, గోరువెచ్చని నీటితో, మీ రోజువారీ షాంపూ తో కడిగేయండి.

చిట్లిన జుట్టును అరికట్టడానికి ఇంట్లో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని నెలకు రెండుసార్లు మీ జుట్టుకు పట్టించండి.

English summary

how to use avocado for split ends | benefits of avocado in hair care

Though there are natural ingredients that can treat split ends, there is one in particular that can effectively repair split ends and boost your hair's overall health. We're talking about avocados.
Desktop Bottom Promotion